అన్వేషించండి

Polimera 2 Controversy: ముదురుతున్న 'పొలిమేర 2' వివాదం - న్యాయం చేయాలంటూ దిల్‌ రాజుకు నిర్మాత లేఖ!

Polimera 2 Controversy: పొలిమేర 2 వివాదం ఫిలిం ఛాంబర్‌ వరకు వెళ్లింది. తనకు న్యాయం చేయాలంటే నిర్మాత గౌరీ కృష్ణ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్ అధ్యక్షులు దిల్‌ రాజుకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.

Polimera 2 Producer Write Letter to Dil Raju: 'పొలిమేర 2' వివాదం మరింత ముదిరింది. ఇప్పటికే పొలిమేర 2 నిర్మాత పొలిమేర 3 నిర్మాతపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మూవీ లాభాల్లో వాట అడిగినందుకు చంపేస్తానని బెదిరిస్తున్నారంటూ పొలిమేర 2 నిర్మాత గౌరీ కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు తన కంటెంట్‌ రిలేటెడ్‌గా పార్ట్‌ 3లో లేకుండా సినిమా తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వివాదం సినీ పెద్దల వరకు వెళ్లింది. ఈ విషయంలో నిర్మాత గౌరీ కృష్ణ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్ అధ్యక్షులు దిల్‌ రాజుకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.

తాజాగా ఈ లేఖను ఆయన విడుదల చేశారు. ఈ లేఖలో గౌరీ కృష్ణ ఇలా రాసుకొచ్చారు. తాను నిర్మించిన పొలిమేర 2 లాభాల్లో తన వాట అడిగినందుకు చంపేస్తానని బెదిరించిన నందిపాటి వంశీపై గత ఏడాది నవంబర్ 27వ ఫిర్యాదు చేశానని, దయచేసి దానిని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.  లేఖలో ఏముందంటే.. "ఫిలిం ఛాంబర్ కి చెందిన నిర్మాత ప్రసన్నకుమార్ తమ గొడవలో కలుగజేసుకుని పవర్‌ని మిస్ యూస్ చేస్తూ ఛాంబర్ తరపున నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కొన్ని డాక్యుమెంట్ల మీద సంతకం చేయాలని కూడా బెదిరిస్తున్నారని, మరోపక్క నందిపాటి వంశీ నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు.

వంశీ నందిపాటి పొలిమేర 2 సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు కొనుగోలు చేశాడు. రిఫండబుల్ అడ్వాన్స్ బేసిస్ మీద రెండు తెలుగు రాష్ట్రాల హక్కులు కొనుగోలు చేశారు. అయితే ఇప్పటివరకు నాకు ఆ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ వివరాలు చెప్పడం లేదు. నిజానికి సినిమా రిలీజ్ చేసేటప్పుడు నాకు అడ్వాన్స్ ఇచ్చి నా దగ్గర బ్లాంక్ చెక్కులు సంతకం చేసిన బ్లాంక్ లెటర్లు, బ్లాంక్ బాండ్ పేపర్లు సెక్యూరిటీ నిమిత్తం తీసుకున్నారు. ఇప్పుడు వాటి ద్వారా నన్ను బెదిరిస్తున్నారు" అని లేఖలో పేర్కొన్నారు. అనంతం "పొలిమేర 3 సినిమాని నాకు చెప్పకుండానే ప్రకటన ఇచ్చారు. పొలిమేర 2 సినిమా నిర్మాతగా నాకున్న హక్కులను ధిక్కరించడమే అవుతుంది. వీలైనంత త్వరగా ఛాంబర్ ఈ విషయంలో కలగజేసుకొని నాలాంటి చిన్న నిర్మాతలకు న్యాయం చేయాలని కోరుతున్నా. ఈ విషయాన్ని త్వరితగతిన పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి. అలాగే పొలిమేర 2 కలెక్షన్స్ వివరాలు నాకు ఇవ్వాల్సిందిగా.. అదే విధంగా నేను సంతకం చేసిన డాక్యుమెంట్లు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను.

పొలిమేర స్త్రీలో పొలిమేర 2కి సంబంధించిన కంటెంట్ వాడకుండా చూడాలని కూడా కోరుతున్నాను" అంటూ ఆయన లేఖ రాసుకొచ్చారు. ఇక దీని మీద దిల్ రాజు స్పందించాల్సి ఉంది. కాగా లాక్‌డౌన్‌లో నేరుగా ఓటీటీలో రిలీజైన పొలిమేర మూవీ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి అంచనాలు లేకుండ ఓటీటీలో రిలీజైన ఈ సినిమా ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన 'మా ఊరి పొలిమేర 2' థియేటర్లో రిలీజ్‌ అయ్యింది. మొదట మిక్స్‌డ్ టాక్‌ రాగా ఆ తర్వాత రన్‌ టైం మంచి వసూళ్లు చేసింది. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ సినిమా మూడో పార్ట్‌కు కూడా రెడీ అయ్యింది. ఇటీవల పొలిమేర 3ని ఆఫీషియల్‌ అనౌన్స్‌  చేశారు కూడా. ఈ సినిమా షూటింగ్‌ కూడా మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో 'పొలిమేర 2' నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. 

Also Read: లావణ్యపై రాజ్‌ తరుణ్‌ తండ్రి సంచలన వ్యాఖ్యలు - ఆమె పచ్చి తాగుబోతు.. పదేళ్లు మాకు నరకం చూపించింది!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Jr NTR On Ayudha Pooja Song: ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
Jammu Kashmir Exit Polls 2024: జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్
జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? Exit Polls Result
Harsha Sai: 'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
Embed widget