Peddi: వాట్ ఏ మూమెంట్ 'పెద్ది' - ఆ విలేజ్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కొత్త షెడ్యూల్ స్టార్ట్
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ఇప్పటికే 30 శాతం పూర్తి కాగా.. కొత్త షెడ్యూల్ కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

Ram Charan's Peddi Movie Shooting New Schedule Started: మెగా ఫ్యాన్స్‌కు నిజంగా ఇది గూస్ బంప్స్ తెప్పించే న్యూస్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అవెయిటెడ్ మూవీ 'పెద్ది' షూటింగ్ కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ మేరకు మూవీ టీం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
విలేజ్‌లో రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల లండన్ పర్యటనకు వెళ్లారు. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహం లాంచింగ్ కార్యక్రమంలో ఆయన కుటుంబంతో సహా పాల్గొన్నారు. కొద్ది రోజుల రెస్ట్ తర్వాత తాజాగా చరణ్ 'పెద్ది' షూటింగ్‌లో పాల్గొన్నారు. కొత్త షెడ్యూల్‌లో భాగంగా హైదరాబాద్‌లోనే ఓ భారీ విలేజ్ సెట్‌ను వేశారు.
ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా, తన టీంతో కలిసి ఓ భారీ విలేజ్ సెట్‌ను నిర్మించారని టీం వెల్లడించింది. ''పెద్ది' మట్టి సౌందర్యాన్ని లోతుగా పరిశీలిస్తుంది. ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు చాలా కష్టపడుతున్నాం.' అంటూ పేర్కొంది. 'పూర్తి స్థాయిలో యాక్షన్ ప్యాక్ షెడ్యూల్ జరగుతోంది.' అంటూ డైరెక్టర్ బుచ్చిబాబు.. రామ్ చరణ్, దివ్యేందు శర్మతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ముగ్గురు కలిసి నవ్వుతూ ఉన్న ఫోటోలు వైరల్‌గా మారాయి. ఇప్పటికే 30 శాతం సినిమా పూర్తైందని.. ఈ కొత్త షెడ్యూల్ మూవీలో ఓ ఇంపార్టెంట్ పార్ట్‌ను కవర్ చేస్తుందని అన్నారు.
An Action Packed Schedule in full swing @AlwaysRamCharan sir 🔥❤️🤗@divyenndu bro 😍🤗#BTS #Peddi
— BuchiBabuSana (@BuchiBabuSana) May 22, 2025
GLOBAL RELEASE ON 27th March 2026💥 pic.twitter.com/mEyoyBQP6O
Also Read: నా మీద చేతబడి జరిగింది - షాక్ ఇచ్చిన హీరోయిన్ నందిని రాయ్... అందుకే అవకాశాలు రావట్లేదా?
ఇప్పటికే గ్లింప్స్ ట్రెండింగ్
రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఇటీవలే ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేయగా ట్రెండ్ సృష్టించింది. ముక్కుకు రింగుతో మాస్ లుక్‌లో చరణ్, ఉత్తరాంధ్ర యాసలో డైలాగ్స్, ఆయన కొట్టిన సిగ్నేచర్ షాట్, రెహమాన్ బీజీఎం, బుచ్చిబాబు హైలెట్‌గా నిలిచాయి. ఇది చూసిన ఫ్యాన్స్‌కు నిజంగా గూస్ బంప్స్ తెప్పించింది. దీనిపై కొన్ని స్పెషల్ మీమ్స్ కూడా క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఐపీఎల్ ట్రెండ్ నడుస్తుండగా.. చరణ్ సిగ్నేచర్ షాట్‌ను రీ క్రియేట్ చేస్తూ కొన్ని ఐపీఎల్ టీంలు వీడియోలు కూడా చేశాయి. గ్లింప్స్ వేరే లెవల్‌లో ఉండడంతో మూవీపై మరింత హైప్ నెలకొంది. విలేజ్ బ్యాక్ డ్రాప్‍లో స్పోర్ట్స్ ప్రధానాంశంగా మూవీ తెరకెక్కనుంది.
ఈ మూవీ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. రామ్ చరణ్ సరసన అందాల నటి జాన్వీ కపూర్ నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు, సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.




















