అన్వేషించండి

Spirit Heroine: కండిషన్లు పెడితే ఎలా? ప్రభాస్ సినిమా నుంచి దీపికను తీసేసిన దర్శకుడు??

ప్రభాస్, దీపిక పదుకోన్ కలిసి ‌'కల్కి 2898 ఏడీ' చేశారు. అయితే అందులో ఇద్దరు జంటగా కనిపించలేదు. వాళ్ళిద్దరిని 'స్పిరిట్'లో జంటగా చూడొచ్చని ప్రేక్షకులు అనుకున్నారు.‌ ఇప్పుడు అది నెరవేరాలా కనిపించడం లేదు.

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నటించిన 'కల్కి 2898 ఏడీ'తో బాలీవుడ్ భామ దీపికా పదుకోన్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే, ఆ సినిమాలో ఇద్దరూ జంటగా కనిపించలేదు.‌ ప్రభాస్, దీపికను జంటగా చూడాలనుకున్న ప్రేక్షకులు... 'స్పిరిట్' హీరోయిన్ పొడుగు కాళ్ళ సుందరి అని తెలిశాక హ్యాపీగా ఫీలయ్యారు. అయితే, ఇప్పుడు ఆ కోరిక నెరవేరేలా కనిపించడం లేదు.

సందీప్ రెడ్డి వంగాకు కండిషన్లు పెడితే ఎలా?
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) క్యారెక్టర్ గురించి ఆడియన్స్ అందరికీ తెలుసు. క్రియేటివిటీ పరంగా తన కథకు ఎవరైనా అడ్డు‌ వస్తే, తన పనిలో వేలు పెడితే ఊరుకునే రకం కాదు. అటువంటి దర్శకుడికి కండిషన్లు పెడితే ఎలా? ఏకంగా సినిమా నుంచి తీసి పక్కన పెట్టేశారు.

'స్పిరిట్'కు సందీప్ రెడ్డి వంగా దర్శకుడు అనే సంగతి తెలిసిందే. తన కథ, ఫిలిం మేకింగ్ పట్ల ఆయన చాలా క్లారిటీగా ఉంటారు. ఆ క్లారిటీకి కండిషన్లు పెట్టారట దీపికా పదుకోన్. సాధారణంగా ఎనిమిది గంటల షూటింగ్ టైంను ఒక కాల్ షీట్ అంటారు. దీపిక మాత్రం తాను ఆరు గంటలు మాత్రమే షూటింగ్ చేస్తానని సందీప్ రెడ్డి వంగాకు చెప్పారట. అంతే కాదు... తనకు సినిమా లాభాలలో వాటా కావాలని మరొక కండిషన్ పెట్టారట. 

ఆరు గంటల కంటే ఎక్కువ షూటింగ్ చేయాల్సి వస్తే ఎక్స్ట్రా రెమ్యూనరేషన్ ఇవ్వాలని, అలాగే తన స్టాఫ్ ఖర్చులు అన్నీ నిర్మాత భరించడంతో పాటు వాళ్లకు జీతాలు కూడా ఇవ్వాలని దీపికా పదుకోన్ గొంతెమ్మ కోరికలు కోరిందట. 'స్పిరిట్' నిర్మాతలలో సందీప్ రెడ్డి వంగా ఫ్యామిలీకి చెందిన భద్రకాళి పిక్చర్స్ కూడా భాగస్వామి. టి సిరీస్ సంస్థ మరో భాగస్వామి. దీపికా పదుకోన్ కండిషన్లు విన్న తర్వాత సినిమా నుంచి ఆవిడను తొలగించారట.

Also Read: డ్రగ్స్ కోసం సపరేట్ బడ్జెట్, రూమ్స్... మాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? తేనె తుట్టెను కదిపిన మహిళా నిర్మాత
 
దీపిక బదులు మృణాల్ ఠాకూర్ వస్తుందా?
దీపికా పదుకోన్‌ను తీసేశారని తెలిసిన తర్వాత సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు అందరూ సందీప్ రెడ్డి వంగాను రిక్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు... మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)ను హీరోయిన్‌గా తీసుకోమని!ఇప్పటి వరకు ప్రభాస్, మృణాల్ ఠాకూర్ జంట సినిమా చేయలేదు. 'ఫౌజీ'లో మృణాల్ హీరోయిన్ అవుతుందని అందరూ ఆశించినా... చివరకు ఆ క్యారెక్టర్ ఇమాన్వీకి దక్కింది. మరి, ఇప్పుడు అయినా ప్రభాస్ హీరోయిన్ ఛాన్స్ మృణాల్ ఠాకూర్ అందుకుంటుందో? లేదో? చూడాలి. వెయిట్ అండ్ సి. హీరోగా ప్రభాస్ 25వ చిత్రమిది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో మాత్రమే కాకుండా చైనీస్, కొరియన్, జపనీస్ భాషల్లోనూ విడుదల చేయడానికి సందీప్ రెడ్డి వంగా రెడీ అవుతున్నారు.

Also Readహీరోలను డామినేట్ చేసిన కియారా బికినీ... ట్విట్టర్‌లో ఆ పోస్టులు, ఫాలోయింగ్ చూస్తే మాస్ మెంటల్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

iBomma Case Update: ఐబొమ్మ మిస్టరీలో కొత్త పేరు? అంతర్జాతీయ స్థాయికి చేరిన ఇమ్మడి రవి పైరసీలో సహకరించిందెవరు?
ఐబొమ్మ మిస్టరీలో కొత్త పేరు? అంతర్జాతీయ స్థాయికి చేరిన ఇమ్మడి రవి పైరసీలో సహకరించిందెవరు?
Septic Tank Dump in Gandipet Lake : తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
Pawan Kalyan Gift To Sujeeth : 'OG' డైరెక్టర్‌కు పవన్ కాస్ట్‌లీ కారు గిఫ్ట్ - హిట్ కొట్టినందుకు కాదు... అసలు రీజన్ ఏంటంటే?
'OG' డైరెక్టర్‌కు పవన్ కాస్ట్‌లీ కారు గిఫ్ట్ - హిట్ కొట్టినందుకు కాదు... అసలు రీజన్ ఏంటంటే?
Bangladesh Protest: భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
iBomma Case Update: ఐబొమ్మ మిస్టరీలో కొత్త పేరు? అంతర్జాతీయ స్థాయికి చేరిన ఇమ్మడి రవి పైరసీలో సహకరించిందెవరు?
ఐబొమ్మ మిస్టరీలో కొత్త పేరు? అంతర్జాతీయ స్థాయికి చేరిన ఇమ్మడి రవి పైరసీలో సహకరించిందెవరు?
Septic Tank Dump in Gandipet Lake : తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
Pawan Kalyan Gift To Sujeeth : 'OG' డైరెక్టర్‌కు పవన్ కాస్ట్‌లీ కారు గిఫ్ట్ - హిట్ కొట్టినందుకు కాదు... అసలు రీజన్ ఏంటంటే?
'OG' డైరెక్టర్‌కు పవన్ కాస్ట్‌లీ కారు గిఫ్ట్ - హిట్ కొట్టినందుకు కాదు... అసలు రీజన్ ఏంటంటే?
Bangladesh Protest: భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
Embed widget