అన్వేషించండి

Peddi Collections Day 8: 'పెద్ది' కలెక్షన్లకు వర్కింగ్ డేస్ టెస్ట్... రామ్ చరణ్ సినిమాకు ఇంకా తక్కువ?

Peddi Box Office Collection Day 8: రామ్ చరణ్ 'పెద్ది' కలెక్షన్లు రోజు రోజుకూ తగ్గుతున్నాయి. గురువారం మరింత డ్రాప్ కనిపించింది. థియేటర్లలో విడుదలైన 8వ రోజు సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • “పెద్ది” ప్రపంచవ్యాప్త వసూళ్లు ₹279.35 కోట్లు; నిర్మాత లెక్క వేరు.
  • ఎనిమిదో రోజు ఇండియాలో ₹6.30 కోట్లు
  • ఎనిమిది రోజులకు ఇండియా నెట్ ₹193.55 కోట్లు; ₹300 కోట్లే లక్ష్యం.
  • జాన్వీ కపూర్ పాత్ర విమర్శల మేరకు కొన్ని సన్నివేశాల తొలగింపు.

రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'కి వీకెండ్ తర్వాత కలెక్షన్స్ తగ్గిన సంగతి తెలిసిందే. అయితే బాక్సాఫీస్ దగ్గర రోజు రోజుకూ మరింత తగ్గుదల కనిపిస్తోంది. వర్కింగ్ డేస్‌లో సినిమాకు వచ్చే జనాల సంఖ్య తగ్గుతోంది. సినిమా రిలీజైన సెకండ్ వీకెండ్ (ఈ శుక్రవారం నుంచి ఆదివారం వరకు) ఎలా ఉంటుందో చూడాలి. ఎనిమిదో రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

మూడు వందల కోట్లకు దగ్గరలో!
Peddi Eight Days Collection: ప్రపంచవ్యాప్తంగా తమ సినిమా 345 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందని ప్రొడక్షన్ హౌస్ వృద్ధి సినిమాస్ అనౌన్స్ చేసింది. అయితే ట్రేడ్ పోర్టల్ - కలెక్షన్స్ వివరాలు వెల్లడించే సాక్నిల్క్ (Sacnilk) ప్రకారం... ఈ సినిమా గ్రాస్ ఇంకా 300 దాటలేదు. 

  • థియేటర్లలో విడుదలైన ఎనిమిదవ రోజున ఇండియాలో 'పెద్ది'కి రూ. 6.30 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి.
  • ఏడవ రోజు వసూళ్లు (రూ. 7.55 కోట్ల)తో పోలిస్తే 16.6 శాతం డ్రాప్ కనిపించింది. వర్కింగ్ డేస్‌లో అన్ని వసూళ్లు రావడం గ్రేట్ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
  • ఇప్పటి వరకు ఇండియాలో 'పెద్ది' టోటల్ నెట్ కలెక్షన్లు రూ. 193.55 కోట్లు.
  • 'పెద్ది' ఇండియా గ్రాస్ వసూళ్లు (ఎనిమిది రోజుల్లో) రూ. 229.95 కోట్లు.
  • విదేశాల్లో (ఓవర్సీస్) కూడా 'పెద్ది' కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. ఎనిమిదో రోజు రూ. 60 లక్షల గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఓవర్సీస్ టోటల్ గ్రాస్ రూ. 49.40 కోట్లకు చేరింది.
  • ప్రపంచవ్యాప్తంగా 'పెద్ది' టోటల్ గ్రాస్ కలెక్షన్లు ఎనిమిది రోజులకు... రూ. 279.35 కోట్లు. సెకండ్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి 300 కోట్ల క్లబ్బులోకి చేరే అవకాశం ఉంది.

Also ReadSing Geetham Twitter Review - 'సింగ్ గీతం' ట్విట్టర్ రివ్యూ: ఎక్స్‌పరిమెంటా? ఎంజాయ్‌మెంటా? పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

Peddi Collections In Telugu States: 'పెద్ది' సినిమాకు ముందు నుంచి తెలుగు రాష్ట్రాలే బలంగా నిలిచాయి. ఎనిమిదవ రోజున కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి రూ. 5.30 కోట్ల గ్రాస్ వచ్చింది. హిందీలో ఎనిమిదో రోజు కోతికి పైగా కలెక్ట్ చేసింది. ఆ తర్వాత కర్ణాటక నుంచి రూ. 55 లక్షలు, తమిళనాడు నుంచి రూ. 25 లక్షలు వచ్చాయి.

Also Read: Vijay Deverakonda Cameo In Sing Geetham: విజయ్ దేవరకొండను నాగ్ అశ్విన్ వదల్లేదుగా... లేటెస్ట్ 'సింగ్ గీతం'లోనూ అతిథిగా

సినిమాకు వసూళ్లు వస్తున్నా... జాన్వీ కపూర్ పాత్రపై విమర్శల రావడంతో కొంత ఇబ్బంది పెట్టే అంశం. అయితే... దర్శకుడు బుచ్చిబాబు సానా అభ్యంతరకర సన్నివేశాలను తొలగించడంతో పాటు రీ ఎడిటెడ్ వెర్షన్ రిలీజ్ చేయాలని తీసుకున్న నిర్ణయంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరగవచ్చని చిత్ర బృందం భావిస్తోంది. జగపతి బాబు, శివ రాజ్‌కుమార్ తదితరులు నటించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

Also ReadWho Was Kumod Raney? Why Salman Breaks Down? - స్నేహితురాలి మరణంతో సల్మాన్ కంటతడి... ఎవరీ కుముద్ రాణే? 

Frequently Asked Questions

'పెద్ది' సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఎంత వసూలు చేసింది?

8 రోజులకు 'పెద్ది' సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 279.35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది. రెండవ వారాంతం నాటికి 300 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.

'పెద్ది' సినిమా వసూళ్ల ట్రెండ్ ఎలా ఉంది?

వారాంతం తర్వాత సినిమా కలెక్షన్లు తగ్గాయి. వర్కింగ్ డేస్‌లో రోజురోజుకూ తగ్గుదల కనిపిస్తోంది. ఎనిమిదో రోజున 7వ రోజుతో పోలిస్తే 16.6 శాతం వసూళ్లు తగ్గాయి.

'పెద్ది' వసూళ్లపై నిర్మాణ సంస్థ, సాక్నిల్క్ మధ్య తేడా ఉందా?

వృద్ధి సినిమాస్ 345 కోట్లు వసూలు చేసినట్లు ప్రకటించగా, ట్రేడ్ పోర్టల్ సాక్నిల్క్ ప్రకారం ఈ సినిమా గ్రాస్ ఇంకా 300 కోట్లు దాటలేదు.

'పెద్ది' సినిమా దర్శకుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు?

జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు రావడంతో దర్శకుడు బుచ్చిబాబు సానా అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి, రీ-ఎడిటెడ్ వెర్షన్‌ను విడుదల చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ప్రేక్షకుల సంఖ్య పెరగవచ్చని చిత్ర బృందం భావిస్తోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Embed widget