నాగ్ అశ్విన్ 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. సావిత్రి బయోపిక్ 'మహానటి' ఆయనకు దర్శకుడిగా మంచి పేరు తెచ్చింది.
Vijay Deverakonda: విజయ్ దేవరకొండను నాగ్ అశ్విన్ వదల్లేదుగా... లేటెస్ట్ 'సింగ్ గీతం'లోనూ
Vijay Deverakonda Nag Ashwin: నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన సినిమాలు అన్నిటిలో విజయ్ దేవరకొండ ఉన్నారు. ఇప్పుడు ప్రొడ్యూస్ చేసిన సినిమాలోనూ ఉన్నారు. దాంతో ఆయన లక్కీ ఛార్మ్ దేవరకొండ అంటున్నారు జనాలు.

- రెండు నిమిషాల పాత్రకు ప్రేక్షకులు విజిల్స్ వేసి ఎంజాయ్ చేశారు.
రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'తో నాగ్ అశ్విన్ (Nag Ashwin) పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్స్ లిస్టులో చేరారు. అయితే... ఆయన దర్శకుడిగా పరిచయమైనది? నాని 'ఎవడే సుబ్రమణ్యం'తో. దర్శకుడిగా ఆయన పేరు తీసుకు వచ్చినది? సావిత్రి బయోపిక్ 'మహానటి'. నాగ్ అశ్విన్ మూడు సినిమాల్లో హీరోలు వేర్వేరు కావచ్చు. కానీ, ఆ మూడు సినిమాల్లో ఉన్నది మాత్రం యంగ్ అండ్ సెన్సేషనల్ స్టార్, రౌడీ బాయ్ 'ది' విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). థియేటర్లలోకి వచ్చిన నాగ్ అశ్విన్ లేటెస్ట్ సినిమాలోనూ దేవరకొండ ఉన్నారు.
'సింగ్ గీతం'లో అతిథిగా విజయ్ దేవరకొండ
Sing Geetham Movie Cast: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు డైరెక్షన్ చేసిన లేటెస్ట్ సినిమా 'సింగ్ గీతం'. ఇందులో ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రధారులు. ప్రీమియర్స్, ఫస్ట్ డే థియేటర్లకు వెళ్లిన తెలుగు ప్రేక్షకులు సినిమాలో స్టార్ హీరోని చూశారు. ఆయనే విజయ్ దేవరకొండ.
అవును... 'సింగ్ గీతం' సినిమాలో విజయ్ దేవరకొండ అతిథి పాత్ర చేశారు. తెరపై ఆయన్ను చూసి ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అయ్యారు. దాంతో దర్శకుడిగా మాత్రమే కాదు... నాగ్ అశ్విన్ నిర్మాతగా తీసిన సినిమాలోనూ విజయ్ దేవరకొండను వదల్లేదని కొందరు నెటిజనులు కామెంట్ చేశారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై నాగ్ అశ్విన్ ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్‌కు విజయ్ దేవరకొండ లక్కీ ఛార్మ్ అని ట్వీట్లు పడుతున్నాయి. 'సింగ్ గీతం'లో విజయ్ దేవరకొండ కనిపించేది రెండు మూడు నిమిషాలే అయినా... ఆయన తెరపై వచ్చినప్పుడు ఆడియన్స్ అందరూ విజిల్స్ వేయడం గ్యారెంటీ అని, ఆ రోల్ సూపర్బ్ ఉందని సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు. దీనికి ముందు నాగ్ అశ్విన్ నిర్మించిన 'జాతి రత్నాలు' సినిమాలోనూ విజయ్ దేవరకొండ అతిథి పాత్ర చేశారు. తన ప్రతి సినిమాలోనూ విజయ్ ఉంటారని నాగ్ అశ్విన్ చెప్పిన సంగతి తెలిసిందే.
Can we call @TheDeverakonda the lucky charm of @nagashwin7? #SingGeetham IYKYK 😉😅 pic.twitter.com/nkPnzN3Wff
— 🏃🏃 (@Urs_akill_here) June 11, 2026
Vijay deverakonda cameo in #SingGeetham 💥💥🔥 #VijayDeverakonda pic.twitter.com/xwN8KuYDf3
— RavindraVK¹⁸ (@RavindraVK18) June 11, 2026
Vijay Deverakonda Upcoming Movies: ప్రజెంట్ విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాలకు వస్తే... రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో 'రణబలి', రవి కిరణ్ కోలా దర్శకత్వంలో 'రౌడీ జనార్థన' చేస్తున్నారు. ఆ రెండూ పాన్ ఇండియా సినిమాలు. నాగ్ అశ్విన్ విషయానికి వస్తే... పాన్ ఇండియా హిట్, రెబల్ స్టార్ ప్రభాస్ - లోక నాయకుడు కమల్ హాసన్ - బాలీవుడ్ లెజెండరీ హీరో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'కల్కి 2898 ఏడీ'కి సీక్వెల్ 'కల్కి 2' చేస్తున్నారు. 'కల్కి'లో అర్జునుడిగా విజయ్ దేవరకొండ నటించారు. మరి, 'కల్కి 2'లో ఆయన రోల్ ఉంటుందా? లేదా? అనేది త్వరలో తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే.
Frequently Asked Questions
నాగ్ అశ్విన్ దర్శకుడిగా పరిచయమైన చిత్రం ఏది, ఆయనకు పేరు తెచ్చిన సినిమా ఏది?
ట్రెండింగ్ వార్తలు






















