Pawan Kalyan: మాట మీద నిలబడిన పవన్... ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ ఇచ్చే ట్వీట్!
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన వీరాభిమాని హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. లేటెస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన సందర్భంగా హరీష్ ట్వీట్ చేశారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు అందరూ 'ఓజీ' (OG Movie) మొదటి పాట 'ఫైర్ స్ట్రోమ్' మేనియాలో ఉన్నారు. అందులో ఓజాస్ గంభీర పాత్రలో పవన్ లుక్స్ మామూలుగా లేవు. ఫ్యాన్స్ అందరికీ గూస్ బంప్స్ ఇచ్చాయి. ఇప్పుడు వాళ్లకు మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar).
మాట మీద నిలబడిన పవన్!
'గబ్బర్ సింగ్' వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో రూపొందుతున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh). సుమారు నెల రోజుల క్రితం హైదరాబాద్ సిటీలో లేటెస్ట్ షెడ్యూల్ మొదలు అయింది. అందులో పవన్ కళ్యాణ్ సహా హీరోయిన్లు శ్రీ లీల, రాశీ ఖన్నా పాల్గొన్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ షెడ్యూల్ కంప్లీట్ అయింది.
'ఉస్తాద్ భగత్ సింగ్' లేటెస్ట్ షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా... ''మాట ఇస్తే నిలబెట్టుకోవడం... మాట మీదే నిలబడడం (పవన్ కళ్యాణ్ నైజం!)'' అని ట్వీట్ చేశారు దర్శకుడు హరీష్ శంకర్. దాంతో పాటు ఒక ఫోటో కూడా షేర్ చేశారు. అందులో ఆయన కూర్చుని ఉండగా పక్కనే పవన్ నిలబడ్డారు. ఆ మూమెంట్ గురించి... ''మీరు (పవన్ కళ్యాణ్) పక్కన ఉంటే కరెంటు పాకినట్టే'' అని తెలిపారు. హరీష్ శంకర్ ఇచ్చిన క్యాప్షన్ అభిమానులకు గూస్ బంప్స్ ఇస్తోంది.
Also Read: 'గాడ్ ఫాదర్' తర్వాత 15 సినిమాలు వదిలేశా... నేను డబ్బుల కోసం చేయట్లేదు: సత్యదేవ్ ఇంటర్వ్యూ
'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో శ్రీ లీల హీరోయిన్ అనేది ముందు నుంచి తెలిసిన విషయమే అయితే రాశీ ఖన్నా కూడా జాయిన్ అయినట్లు తాజాగా తెలిపారు.
'ఓజీ' సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రానుంది. ఆ సినిమా విడుదల అయ్యేలోపు షూటింగ్ కంప్లీట్ చేయాలని హరీష్ శంకర్ ప్లాన్ చేశారు. సినిమా చిత్రీకరణ అంతా పూర్తయిన తర్వాత విడుదల తేదీని వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.





















