Pawan Kalyan: ఫలితాల అనంతరం ఆసక్తికర దృశ్యం, పవన్‌కి విజయ తిలకం దిద్దిన అన్నా లెజ్నెవా - పక్కనే అకిరా నందన్, వీడియో వైరల్
Pawan Kalyan: నేటి ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పిఠాపురంలో గెలిచిన అనంతరం పవన్‌కు ఆయన మూడో భార్య అన్నా లెజ్నెవా విజయ తిలకం దిద్దిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Pawan Kalyan Wife Anna Lezneva Traditional Sendoff to pawan: నేడు విడుదలైన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ఆయన వైసీపీ అభ్యర్థి వంగా గీతాపై అరవై తొమ్మిది వేల(69 వేలు) ఓట్ల తేడాతో భారీ మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం విజయోత్సహంతో ఉన్న పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాల అనంరతం హైదరాబాద్ నుంచి మంగళగిరి చేరుకున్నారు. ఈక్రమంలో ఆయన ఇంటి నుంచి బయలు దేరే ముందు ఆయన భార్య అన్నా లెజ్నెవా విజయతిలకం దిద్దారు. ఇందుకు సంబంధించిన వీడియోను జనసేన పార్టీ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. తన పవన్‌కు అన్నా లెజ్నెవా విజయం తిలకం దిద్దుతున్న సమయంలో పక్కనే పవన్ కుమారుడు అకిరా నందన్ వెనకాలే ఉన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
విజయోత్సాహంతో మంగళగిరికి బయలుదేరిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
— JanaSena Party (@JanaSenaParty) June 4, 2024
హైదరాబాద్ లో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విజయ తిలకం దిద్ది హారతి ఇచ్చిన శ్రీమతి అనా కొణిదెల గారు.#KutamiTsunami pic.twitter.com/gbb4E2XS0Z
కాగా అన్నా లెజ్నెవా పవన్ కళ్యాణ్‌కు మూడో భార్య అనే విషయం తెలిసిందే. తిన్‌మార్ మూవీ టైంలో ఆమెతో ప్రేమలో పడిన పవన్ కళ్యాన్ కొంతకాలం సీక్రెట్ రిలేషన్‌లో ఉన్నారు. పెళ్లికి ముందే వీరికి ఒక కూతురు కూడా జన్మించింది. ఈ క్రమంలో రేణు దేశాయ్‌కి విడాకులు ఇచ్చి అన్నా లెజ్నెవాను మూడో పెళ్లి చేసుకున్నారు. ఇక అప్పటికే పవన్ కళ్యాణ్‌కు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. రేణు దేశాయ్‌కి కంటే నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఇక బద్రి మూవీ చేస్తున్న టైంలో రేణు దేశాయ్‌లో ప్రేమలో పడి ఆమె కొన్నేళ్లు సహాజీవనం చేశారు. అకిరా నందన్ పుట్టిన తర్వాత రేణు దేశాయ్‌ని వివాహమాడారు.
Also Read: మా కుటుంబానికి గర్వకారణమైన రోజు! - బాబాయ్ గెలుపుపై రామ్ చరణ్ ఎమోషనల్ ట్వీట్