Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ తగ్గట్లేదుగా... జెట్ స్పీడులో ఉస్తాద్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్
Pawan Kalyan UBS Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదలు అయ్యాయి.

దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) అసలు ఎక్కడా తగ్గట్లేదు! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) డేట్స్ ఇవ్వడమే ఆలస్యం... జెట్ స్పీడులో 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) షూటింగ్ చేశారు. చిత్రీకరణకు కాస్త విరామం దొరకగానే పోస్ట్ ప్రొడక్షన్ పనుల మీదకు వెళ్లారు. సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...
భగత్ సింగ్ ఎడిటింగ్ షురూ!
'ఓజీ' చిత్రీకరణ పూర్తి చేసిన వెంటనే 'ఉస్తాద్ భగత్ సింగ్'కు డేట్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. మధ్యలో 'హరి హర వీరమల్లు' ప్రచార కార్యక్రమాల పనుల వల్ల కొంత గ్యాప్ తీసుకున్నా... గత నెల రోజులలో చాలా వరకు షూటింగ్ చేశారు. పవన్ పాత్రకు సంబంధించి ఒక వారం మినహా చిత్రీకరణ అంతా పూర్తి చేశామని నిర్మాత నవీన్ యెర్నేని ఇటీవల తెలిపారు. సినిమా చిత్రీకరణ సైతం మరో పది పదిహేను రోజులు చేస్తే చాలు. కంప్లీట్ అవుతుంది.
'ఉస్తాద్ భగత్ సింగ్' లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... సినిమా ఎడిటింగ్ వర్క్ స్టార్ట్ చేశారు. చకచకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఉస్తాద్ షూటింగ్ నుంచి వీరమల్లు ప్రచార కార్యక్రమాలకు పవన్ వచ్చినప్పుడు ఆయన లుక్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మరింత యంగ్, హ్యాండ్సమ్ అయ్యారని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. తరతరాలుగా నరనరాల్లో పవన్ మీద అభిమానం ఉందని హరీష్ శంకర్ తెలిపారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Ustaad Bhagat Singh Looks)ను బెస్ట్ లుక్స్‌లో హరీష్ ప్రజెంట్ చేస్తున్నారని యూనిట్ చెబుతోంది.
Also Read: అమ్మకు అంకితం... తల్లి మీద సాయి దుర్గా తేజ్ ప్రేమ, గౌరవానికి ఫిల్మ్ ఫేర్ సలామ్
Removing the clap board shots for getting all the claps and applause on the big screens 💥💥#UstaadBhagatSingh editing in full swing ❤🔥
— Mythri Movie Makers (@MythriOfficial) August 10, 2025
The man @harish2you presents POWER STAR in the best way ❤🔥
You are all in for a massive feast.
POWER STAR @PawanKalyan @harish2you… pic.twitter.com/Lx33teftkY
సెప్టెంబర్ 25న 'ఓజీ' థియేటర్లలోకి రానుంది. ఇటీవల ఆ సినిమా నుంచి 'ఫైర్ స్ట్రోమ్' సాంగ్ రిలీజ్ చేశారు. ఆ సినిమా విడుదల వరకు 'ఉస్తాద్ భగత్ సింగ్' పబ్లిసిటీ స్టార్ట్ చేయకూడదని భావిస్తున్నారట.
Ustaad Bhagat Singh Cast: పవన్ కళ్యాణ్ సరసన శ్రీ లీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ యెర్నేని, రవిశంకర్ వై ప్రొడ్యూస్ చేస్తున్నారు. వచ్చే ఏడాది థియేటర్లలోకి సినిమా రావచ్చని అంచనా.
Also Read: మహేష్ బాబు పర్సనల్ లైఫ్ గురించి గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ప్రశ్నలు... సమాధానాలు తెల్సా?





















