OG Second Single: పవన్ కళ్యాణ్ 'ఓజీ'లో రెండో పాట రెడీ... 'ఫైర్ స్ట్రోమ్' రేంజ్‌లో ఉంటుందా? రిలీజ్ ఎప్పుడంటే?
OG Second Single Release Date: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు 'ఓజీ' టీమ్ మరో గుడ్ న్యూస్ అందించింది. సెకండ్ సింగిల్ 'సువ్వి సువ్వి' రిలీజ్ అప్డేట్ ఇచ్చింది.

Pawan Kalyan's OG Second Single News: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో గుడ్ న్యూస్. ఎప్పట్నించి ఫ్యాన్స్ అండ్ కామన్ ఆడియన్స్ ఎదురు చూస్తున్న 'ఓజీ' సినిమాలో మరో సాంగ్ రిలీజుకు రెడీ అవుతోంది. ఆ విడుదల తేదీని ఇవాళ అధికారికంగా వెల్లడించారు.
'ఓజీ'లో రెండో సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే!?
OG Second Song Release Date: 'ఓజీ' నుంచి ఇటీవల మొదటి పాట 'ఫైర్ స్ట్రోమ్' రిలీజ్ అయ్యింది. అది హీరోయిజం ఎలివేట్ చేసే సాంగ్. అయితే... రెండో పాటగా మెలోడీని రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది టీం. ఆగస్టు 27న... అంటే ఈ బుధవారం ఉదయం 10.08 గంటలకు 'సువ్వి సువ్వి'ని విడుదల చేయనున్నట్టు పేర్కొంది.
'సువ్వి సువ్వి...' పాటను పవన్ కళ్యాణ్, హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్ మీద తెరకెక్కించారు. సాంగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సందర్భంగా విడుదల చేసిన వాళ్ళిద్దరి స్టిల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అందులో ఒక ఫెస్టివల్ మూడ్, వైబ్ ఉన్నాయి.
Also Read: పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ వీడియో... ఫ్రీగా హరిహర వీరమల్లు ఫస్ట్ ఫైట్ చూడొచ్చు... లింక్ క్లిక్ చేయండి
You have heard how FIRE sounds.
— DVV Entertainment (@DVVMovies) August 24, 2025
Now feel how love and emotion sing. #SuvviSuvvi will win you over from August 27th, 10:08 AM. ❤️#OG #OGSecondSingle#TheyCallHimOG pic.twitter.com/IXISHMDSYs
'ఫైర్ స్ట్రోమ్'లో తెలుగు, ఇంగ్లీష్, జపనీస్ పదాలతో కూడిన లిరిక్స్ మీనింగ్ తెలుసుకోవడం కోసం అభిమానులు ఎక్కువ ఆసక్తి చూపించారు. సాహిత్యంతో సంబంధం లేకుండా పాటను పాడుతున్న ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు. 'పగ రగిలిన ఫైరు...' లిరిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 'ఫైర్ స్ట్రోమ్' కంటే ముందు గ్లింప్స్‌లో వినిపించిన 'నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా' సైతం వైరల్ అవుతోంది.
షూటింగ్ పూర్తి... విడుదల తేదీ మారలేదు!
'ఓజీ' చిత్రీకరణ పూర్తి కాలేదని, మరో ఆరు రోజులు షూటింగ్ చేయాల్సి ఉందని ఈ మధ్య ఓ ప్రచారం మొదలైంది. అవన్నీ పుకార్లు మాత్రమే అని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. 'ఓజీ' టీమ్ పరోక్షంగా ఆ పుకార్లకు చెక్ పెట్టింది. ఆగస్టు 29వ తేదీ నుంచి అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్టు పేర్కొంది. 'ఓజీ' షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యిందని, విడుదల తేదీలో మార్పు లేదని స్పష్టమైన అప్డేట్ ఇచ్చింది. సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ అయితే... అమెరికాలో ఒక్క రోజు ముందు (సెప్టెంబర్ 24న) ప్రీమియర్స్ పడుతున్నాయి.
Also Read: పరదా వర్సెస్ శుభం కలెక్షన్లు... ఓపెనింగ్ డే రిజల్ట్ క్లియర్... సమంత క్రేజ్ ముందు అనుపమ వెలవెల!
పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన 'ఓజీ' సినిమాలో విలన్ రోల్ బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ పోషించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించిన చిత్రమిది. ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్ ఇతర ప్రధాన తారాగణం.





















