Pawan Kalyan: వీరమల్లుకు ఒక్క రూపాయి వద్దు... అడ్వాన్స్ వెనక్కి ఇస్తున్న పవర్ స్టార్
Pawan Kalyan Remuneration: పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ కోట్లలో ఉంటుంది. అయితే 'హరిహర వీరమల్లు' కోసం ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు. ఆల్రెడీ తీసుకున్న అడ్వాన్స్ వెనక్కి ఇస్తున్నారు.

Pawan Kalyan remuneration for Hari Hara Veera Mallu movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎంత? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరైనా ఇట్టే చెబుతారు. 'బ్రో' సినిమాకు ఆయన ఆల్మోస్ట్ 40 కోట్లకు పైగా తీసుకున్నారు. ఆయన ఫంక్షన్‌లో ఆ సంగతి చెప్పారు కూడా! 'బ్రో' కోసం పవన్ ఇచ్చిన డేట్స్ తక్కువ. అటువంటి హీరో 'హరిహర వీరమల్లు' వంటి హిస్టారికల్ వార్ డ్రామా కోసం ఎక్కువ రోజులు కేటాయిస్తే ఎంత తీసుకుంటారు? 'ఉస్తాద్ భగత్ సింగ్'కు 75 కోట్ల రెమ్యూనరేషన్ అని ప్రచారం జరుగుతోంది. అప్పుడు 'వీరమల్లు'కు ఎలా లేదన్నా 50 కోట్లు తీసుకునే అవకాశం ఉందని అనుకోవచ్చు. అయితే అసలు నిజం వేరు.
వీరమల్లుకు ఒక్క రూపాయి వద్దు...
ఆల్రెడీ తీసుకున్న 11 కోట్లు వెనక్కి!
'హరిహర వీరమల్లు' సినిమాకు గాను నిర్మాత ఏయం రత్నం నుంచి పవన్ కళ్యాణ్ అకౌంట్‌లోకి వచ్చిన డబ్బులు రూ. 11 కోట్లు. అవును... ఇప్పటి వరకు నిర్మాత నుంచి పవర్ స్టార్ తీసుకున్న మొత్తం అక్షరాలా పదకొండు కోట్లు... అది కూడా అడ్వాన్స్ కింద. ఆ తర్వాత నిర్మాతను ఆయన డబ్బులు అడగలేదు.
'హరిహర వీరమల్లు' చిత్రీకరణకు ఆల్మోస్ట్ ఐదేళ్లు పట్టింది. దర్శకుడి మార్పు, ఏపీ ఎన్నికల ప్రచారం, ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతలు... కారణాలు ఏవైనా సరే సినిమా పూర్తి కావడానికి ఎక్కువ సమయం అయ్యింది. అయితే నిర్మాత పరిస్థితి అర్థం చేసుకున్న పవన్... అడ్వాన్స్ కింద తీసుకున్న 11 కోట్ల రూపాయలు వెనక్కి ఇవ్వడానికి సిద్ధం అయ్యారు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు ఈ సినిమా విడుదల వాయిదా పడటానికి అసలు కారణం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కాదు. వీఎఫ్ఎక్స్ వర్క్స్ ఆలస్యం కావడం.
నిర్మాతల శ్రేయస్సు కోరే హీరోలలో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ముందు ఉంటారు. తన సినిమా క్వాలిటీ కోసం ఆయన రెమ్యూనరేషన్ సైతం వెనక్కి ఇవ్వడానికి వెనుకాడరు. 'తొలిప్రేమ'లోని పాటలో తాజ్ మహల్ సెట్ వేయడం కోసం డబ్బులు ఇచ్చారు. 'తీన్ మార్' ఆశించిన విజయం సాధించలేదని తాను ప్రొడ్యూస్ చేయాలనుకున్న 'గబ్బర్ సింగ్'ను బండ్ల గణేష్ చేతిలో పెట్టారు. ఇప్పుడు 'హరి హర వీరమల్లు'తో మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు పవన్.
పవన్ కళ్యాణ్, నిర్మాత ఏయం రత్నం మధ్య చక్కటి అనుబంధం ఉంది. పవన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్ 'ఖుషి' చిత్రాన్ని రత్నం ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత 'బంగారం' తీశారు. 'సత్యాగ్రహి' అని మరో సినిమా ప్రారంభించినా... ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదు. 'హరిహర వీరమల్లు' విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో ''అప్పట్లో 'సత్యాగ్రహి' చేసి ఉంటే ఆమీర్ ఖాన్ తరహాలో తాను సినిమాలు చేసుకుంటూ ఉండేవాడినని పవన్ చెప్పారు'' అని రత్నం పేర్కొన్నారు. 'హరిహర వీరమల్లు'తో మరోసారి పవన్, రత్నం కలయికలో భారీ విజయం సాధించడం ఖాయమని ఇండస్ట్రీ ఖబర్.





















