అన్వేషించండి

OG 2 Launch: 'ఓజీ 2' ఓపెనింగ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారా? పవన్ కళ్యాణ్ కొత్త సినిమాపై లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?

OG 2 Latest Update: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు 'ఓజీ 2' అప్డేట్ సంతోషాన్ని ఇచ్చింది. మరి సినిమా ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలుసా?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఏపీ డిప్యూటీ సీఎం పవన్ 'ఓజీ 2' ప్రకటనతో అభిమానుల్లో సంతోషం.
  • నవంబర్‌లో ప్రారంభానికి సుజీత్ సిద్ధం; నాని సినిమా వాయిదా.
  • నిర్మాతపై సందిగ్ధత, థమన్ సంగీతం, కొత్త పాత్రలు వస్తాయి.

Pawan Kalyan's OG 2 News: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ 2' ప్రకటనతో అభిమానుల్లో సందడి మొదలైంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్న పవన్, ఇప్పట్లో సినిమాలు చేసే అవకాశం లేదని మెగా ఫ్యాన్స్, ప్రేక్షకులు భావించారు. వాళ్ళకు 'ఓజీ 2' అప్డేట్ బిగ్ సర్ ప్రైజ్. దాంతో హ్యాపీ. మరి, సినిమా ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలుసా?

నవంబర్ తర్వాత 'ఓజీ 2' షురూ!?
ఓపెనింగ్ ముహూర్తం ఖరారు చేశారా?థియేటర్లలో 'ఓజీ' బ్లాక్ బస్టర్ హిట్. మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ సినిమాకు సీక్వెల్ 'ఓజీ 2'ను ప్రకటించడం అటు అభిమానులను, ఇటు తెలుగు చిత్రసీమను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేశారు పవన్ కళ్యాణ్. 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల తర్వాత నటనకు స్వస్తి పలికి పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవుతారని ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో... సొంత ప్రొడక్షన్ హౌస్ 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' నుంచి వచ్చిన అప్డేట్ అందరిలోనూ చాలా ఉత్సాహాన్ని నింపింది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... నవంబర్‌లో పూజా కార్యక్రమాలతో 'ఓజీ'ని లాంఛనంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారట.

Also ReadDeva Katta On Dragon - ఎన్టీఆర్ సినిమాకు దేవకట్టా డైరెక్షన్... ఇదిగో క్లారిటీ వచ్చేసింది

'ఓజీ' తర్వాత నానితో 'బ్లడీ రోమియో' సినిమా చేయాలని దర్శకుడు సుజీత్ ప్లాన్ చేశారు. ఇప్పుడు గనుక పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే... నానితో చేయాలనుకున్న ప్రాజెక్ట్ పక్కనపెట్టి, దాని కంటే ముందు 'ఓజీ 2'ని స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారట. ఆల్రెడీ స్క్రిప్ట్ గురించి ఆయనకు ఓ ఐడియా ఉందని, 'ఓజీ' చేసే సమయంలో సీక్వెల్ గురించి పవన్ కళ్యాణ్‌తో డిస్కషన్స్ చేశారని, ఆయన ఓకే అంటే నవంబర్‌లో ప్రారంభం అవుతుంది. ఒకవేళ పవన్ పొలిటికల్ షెడ్యూల్ వల్ల డేట్స్ ఇవ్వడం ఆలస్యం అయితే... వచ్చే ఏడాది ఇస్తే... అప్పుడు నాని సినిమాను సుజీత్ పూర్తి చేసే అవకాశం ఉంది. ముందు ఏ సినిమా ఉంటుంది? అనేది కొన్ని వారాల్లో క్లారిటీ వస్తుంది. 

Also Read: Maa Inti Bangaram - సమంతకు లైన్ క్లియర్ చేసిన అఖిల్... బంగారం లాంటి ఛాన్స్

'ఓజీ' సీక్వెల్ నుంచి నిర్మాతను తప్పిస్తారా?
'ఓజీ'ని నిర్మించిన డీవీవీ దానయ్య ఈ సీక్వెల్ 'ఓజీ 2'ని కూడా నిర్మిస్తారా? లేదా పవన్ సొంత ప్రొడక్షన్ హౌస్ 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' రంగంలోకి వస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. 'ఓజీ' సమయంలో దర్శకుడు సుజీత్ - నిర్మాత దానయ్య మధ్య చిన్నపాటి మనస్పర్థలు వచ్చాయట. జపాన్ షెడ్యూల్ కోసం సుజీత్ తన కారును అమ్మేశారని, సినిమా విడుదల తర్వాత అది తెలిసి పవన్ కొత్త కారు కొని ఇచ్చారని ఫిల్మ్ నగర్ వర్గాల కథనం. నాని - సుజీత్ 'బ్లడీ రోమియో'ను కూడా డీవీవీ దానయ్య నిర్మించాల్సి ఉండగా... తర్వాత ప్రొడక్షన్ హౌస్ మారింది. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. 'ఓజీ 2'కి కూడా తమన్ సంగీతం అందించనున్నారు. ఈసారి కొన్ని కొత్త క్యారెక్టర్లు ఎంటర్ కానున్నాయి.

Also ReadPeddi Collections Day 9 - ఓవర్సీస్‌లో 'పెద్ది'గాడి కలెక్షన్స్ మళ్ళీ పెరిగాయ్... సెకండ్ వీకెండ్ రామ్ చరణ్ జోరు కంటిన్యూ అవుతుందా?

Frequently Asked Questions

'ఓజీ 2' సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది?

నవంబర్ తర్వాత 'ఓజీ 2' సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నవంబర్‌లో పూజా కార్యక్రమాలతో సినిమాను లాంఛనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

'ఓజీ 2' చిత్రానికి దర్శకుడు ఎవరు?

'ఓజీ' సినిమా దర్శకుడు సుజీత్ 'ఓజీ 2' చిత్రాన్ని కూడా దర్శకత్వం చేయనున్నారు. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే, ఆయన ఈ ప్రాజెక్ట్‌కు ప్రాధాన్యత ఇస్తారు.

'ఓజీ 2' సినిమాను ఎవరు నిర్మిస్తారు?

'ఓజీ 2' నిర్మాత గురించి ఇంకా స్పష్టత లేదు. 'ఓజీ'ని నిర్మించిన డీవీవీ దానయ్య లేదా పవన్ కళ్యాణ్ సొంత నిర్మాణ సంస్థ 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' నిర్మించే అవకాశం ఉంది.

'ఓజీ 2'లో కొత్త పాత్రలు ఉంటాయా?

అవును, 'ఓజీ 2'లో కొన్ని కొత్త పాత్రలు ఎంటర్ కానున్నాయి. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
Objection My Lord Series OTT : ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
Spiderman Brand New Day India Collection: ఇండియాలో 'స్పైడర్ మ్యాన్' రికార్డులు... రిలీజుకు ముందు వంద కోట్ల క్లబ్బులో!
ఇండియాలో 'స్పైడర్ మ్యాన్' రికార్డులు... రిలీజుకు ముందు వంద కోట్ల క్లబ్బులో!
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Objection My Lord Series OTT : ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
Kidney Health : కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా.. శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే పెద్ద ప్రమాదమే, జాగ్రత్త
కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా.. శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే పెద్ద ప్రమాదమే, జాగ్రత్త
వృషభం, సింహం, వృశ్చికం, మీనం సహా ఈ రాశులవారికి ఆగష్టు నెల ఎలాంటి ఫలితాన్నిస్తుంది?
వృషభం, సింహం, వృశ్చికం, మీనం సహా ఈ రాశులవారికి ఆగష్టు నెల ఎలాంటి ఫలితాన్నిస్తుంది?
ప్రసవం తర్వాత బాలింత చీపురు ఎందుకు ముట్టుకోకూడదు? సంప్రదాయం వెనుకున్న ఆరోగ్య రహస్యం!
ప్రసవం తర్వాత బాలింత చీపురు ఎందుకు ముట్టుకోకూడదు? సంప్రదాయం వెనుకున్న ఆరోగ్య రహస్యం!
Embed widget