అన్వేషించండి

Peddi Collections Day 9: ఓవర్సీస్‌లో 'పెద్ది'గాడి కలెక్షన్స్ మళ్ళీ పెరిగాయ్... సెకండ్ వీకెండ్ రామ్ చరణ్ జోరు కంటిన్యూ అవుతుందా?

Peddi Box Office Collection 9: తెలుగులో శుక్రవారం 'సింగ్ గీతం' మినహా మరో చెప్పుకోదగ్గ సినిమా విడుదల కాలేదు. దాంతో రామ్ చరణ్ 'పెద్ది'కి సెకండ్ వీకెండ్ మంచి కలెక్షన్స్ వచ్చేలా ఉన్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మెగా పవర్ స్టార్ 'పెద్ది' రెండో వారాంతంలో మంచి వసూళ్లను కొనసాగిస్తోంది.
  • తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ₹286.38 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
  • ఈ వారాంతానికి ₹300 కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశం స్పష్టంగా ఉంది.

బాక్స్ ఆఫీస్ బరిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' జర్నీ విజయవంతంగా కొనసాగుతోంది. తెలుగులో శుక్రవారం (జూన్ 12న) 'సింగ్ గీతం' మినహా మరొక చెప్పుకోదగ్గ సినిమా విడుదల కాలేదు. దాంతో సెకండ్ వీకెండ్ కూడా రామ్ చరణ్ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చేలా ఉన్నాయి. థియేటర్లలో విడుదలైన రెండో శుక్రవారం, వీక్ డేస్‌తో కంపేర్ చేస్తే కాస్త కలెక్షన్స్ పెరిగాయ్.

'పెద్ది'గాడు తొమ్మిదో రోజు ఎంత కలెక్ట్ చేశాడు?
బాక్స్ ఆఫీస్ బరిలో ఫస్ట్ వీకెండ్ తర్వాత 'పెద్ది' జోరు తగ్గింది. వీక్ డేస్‌తో సినిమాకు అసలైన పరీక్ష ఎదురైంది. మిక్స్డ్ మౌత్ టాక్, నెగిటివిటీని తట్టుకుని రోజుకు ఐదు కోట్ల కంటే ఎక్కువ రాబట్టింది. ఇక... సెకండ్ వీకెండ్ ముందు శుక్రవారం, 'పెద్ది'కి ఇండియాలో 5.15 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. ఎనిమిదో రోజు కలెక్షన్లు రూ. 6.30 కోట్లతో పోలిస్తే 18.3 శాతం తగ్గింది. హిందీలో మనోజ్ బాజ్‌పాయి 'గవర్నర్', కంగనా రనౌత్ 'భారత భాగ్య విధాత' వంటి సినిమాలు ఉన్నా... ఐదు కోట్లకు తగ్గకుండా 'పెద్ది'కి కలెక్షన్లు రావడం విశేషం.

Also ReadAnil Ravipudi - GV Prakash Funny Video: జీవీని పాతేసిన అనిల్ రావిపూడి... ప్రమోషన్లు మొదలెట్టేశార్రో

  • థియేటర్లలో విడుదలై తొమ్మిది రోజుల ముగిసే సరికి ఇండియాలో 'పెద్ది' నెట్ కలెక్షన్లు రూ. 198.70 కోట్లు.
  • ఇండియాలో 'పెద్ది' సినిమా తొమ్మిది రోజుల టోటల్ గ్రాస్ కలెక్షన్లు రూ. 235.98 కోట్లు.
  • ఓవర్సీస్ మార్కెట్లలో తొమ్మిదో రోజు కోటి రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది 'పెద్ది'. దాంతో ఓవర్సీస్ టోటల్ గ్రాస్ రూ. 50.40 కోట్లకు చేరుకుంది.
  • గురువారం ఓవర్సీస్‌లో కేవలం 50 లక్షల గ్రాస్ మాత్రమే వచ్చింది. దాంతో కంపేర్ చేస్తే శుక్రవారం గ్రాస్ పెరిగింది. శని, ఆది వారాల్లో మళ్లీ పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. సెకండ్ వీకెండ్ ఓవర్సీస్‌లో కొంచెం కలెక్ట్ చేసే సూచనలు ఉన్నాయి.
  • ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది రోజుల్లో 'పెద్ది' కలెక్ట్ చేసిన టోటల్ గ్రాస్ రూ. 286.38 కోట్లు. ఈ వీకెండ్ అయ్యేసరికి 300 కోట్ల క్లబ్బులో చేరే అవకాశం కనబడుతోంది.
  • నార్త్ అమెరికాలో ఆల్రెడీ మూడు మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరిందీ సినిమా. రామ్ చరణ్ కెరీర్‌లో కొత్త రికార్డును క్రియేట్ చేసింది.

Also ReadSing Geetham Review - 'సింగ్ గీతం' రివ్యూ: ఊరికి శాపం, మాటల బదులు పాటలు... సింగీతం సినిమా ఎలా ఉందంటే?

తెలుగులో ఫస్ట్ టైమ్ ఐదు కోట్ల కంటే తక్కువ!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ టైమ్ ఐదు కోట్ల కంటే తక్కువ నెట్ కలెక్ట్ చేసింది 'పెద్ది'. తొమ్మిదో రోజున రూ. 4.50 కోట్ల నెట్ మాత్రమే రాబట్టింది. హిందీ నుంచి 52 లక్షల నెట్ వచ్చింది. కన్నడ వెర్షన్ 8 లక్షలు, తమిళ్ వెర్షన్ 5 లక్షలు రాబట్టింది.

Photo GalleryPandu Master - పండు మాస్టర్‌కు పృథ్వీరాజ్ పరామర్శ... లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏమిటంటే?

Frequently Asked Questions

'పెద్ది' సినిమా ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది రోజుల్లో ఎంత వసూలు చేసింది?

తొమ్మిది రోజుల్లో 'పెద్ది' ప్రపంచవ్యాప్తంగా రూ. 286.38 కోట్ల గ్రాస్ కలెక్షన్‌ను సాధించింది. ఈ వీకెండ్ అయ్యేసరికి రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.

తొమ్మిది రోజులకు 'పెద్ది' సినిమా ఇండియా నెట్ కలెక్షన్లు ఎంత?

థియేటర్లలో విడుదలైన తొమ్మిది రోజుల ముగిసే సరికి 'పెద్ది' సినిమా ఇండియాలో రూ. 198.70 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది.

తొమ్మిదో రోజు 'పెద్ది' సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎంత వసూలు చేసింది?

తొమ్మిదో రోజున 'పెద్ది' సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 4.50 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. ఇది తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి ఐదు కోట్ల కంటే తక్కువగా నమోదైంది.

రామ్ చరణ్ 'పెద్ది' సినిమాతో ఏ కొత్త రికార్డును సృష్టించారు?

'పెద్ది' సినిమా నార్త్ అమెరికాలో మూడు మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. ఇది రామ్ చరణ్ కెరీర్‌లో కొత్త రికార్డును క్రియేట్ చేసింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Embed widget