అన్వేషించండి

Anil Ravipudi: జీవీని పాతేసిన అనిల్ రావిపూడి... ప్రమోషన్లు మొదలెట్టేశార్రో

Anil Ravipudi - GV Prakash Kumar: అనిల్ రావిపూడి మార్క్ ప్రమోషనల్ వీడియోలు మ్యూజిక్ డైరెక్టర్ అనౌన్స్‌మెంట్‌ నుంచి మొదలైంది. జీవీ ప్రకాష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఓ వీడియో విడుదల చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వెంకటేష్, అనిల్ రావిపూడి ఐదవ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం.
  • అనిల్ మార్క్ ప్రమోషన్‌తో సంగీత దర్శకుడు, గేయ రచయిత పరిచయం.
  • కల్యాణ్ రామ్, కీర్తి, కృతి నటిస్తున్న సినిమా జూన్ 22న షూటింగ్.
  • ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

సినిమాను ప్రమోట్ చేయడంలో హిట్ మెషీన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) స్టయిలే సపరేటు. ఈ సంక్రాంతికి వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు', అంతకు ముందు పెద్ద పండక్కి వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' ప్రమోషన్స్ చూశారుగా... ఏ సందర్భాన్ని అసలు వదల్లేదు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే ఐదో సినిమా (Venky Anil 5)కు కూడా తన మార్క్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు దర్శకుడు.

వెంకీ అనిల్ 5కు సంగీత దర్శకుడిగా జీవీ!
జీవీ ప్రకాష్ కుమార్... తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం అవసరం లేని సంగీత దర్శకుడు. ఏఆర్ రెహమాన్ మేనల్లుడు అని అందరికీ పరిచయమైన ఆయన... తక్కువ సమయంలో సంగీత దర్శకుడిగా తనకంటూ సపరేట్ స్టైల్, మార్క్ క్రియేట్ చేస్తున్నారు. ఒక్క జానర్ సినిమాలకు పరిమితం కాకుండా ఏ జానర్ సినిమాకు అయినా సంగీతం అందించగలడని పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన్ను వెంకీ - అనిల్ 5 సినిమాకు సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు.

'మన శంకర వరప్రసాద్ గారు' విజయం తర్వాత వెంకటేష్, అనిల్ రావిపూడి కలిసి మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నందమూరి కళ్యాణ్ రామ్ మరో హీరో. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ మ్యూజిక్ చేస్తారని కొన్ని రోజుల క్రితమే లీకులు వచ్చాయి. ఇప్పుడు ఆ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు. అదీ అనిల్ రావిపూడి మార్క్ స్టైల్‌లో.

Also Read: Sing Geetham Review - 'సింగ్ గీతం' రివ్యూ: ఊరికి శాపం, మాటల బదులు పాటలు... సింగీతం సినిమా ఎలా ఉందంటే?

చెన్నైలోని సముద్ర తీర ప్రాంతం (బీచ్)లోని ఇసుకలో జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar)ని అనిల్ రావిపూడి పాతి పెట్టేస్తారు. ఎందుకు? అని జీవీ ప్రశ్నిస్తే ''హీరోగా బిజీ. నిర్మాతగా బిజీ. మ్యూజిక్ డైరెక్టర్‌గా బిజీ. నీతో ట్యూన్స్ / సాంగ్స్ చేయించుకోవడం కోసం మా నిర్మాత ఇలా పాతిపెట్టమని చెప్పారు'' అని అనిల్ రావిపూడి బదులు ఇచ్చారు. జీవీని మాత్రమే కాదు... లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ (Anantha Sriram)ని కూడా పాతి పెట్టారు. మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయని ఇలా చెప్పారు అనిల్ రావిపూడి. అదీ సంగతి. జూన్ 13న జీవీ ప్రకాష్ కుమార్ పుట్టినరోజు (GV Prakash Kumar Birthday). అందుకు ఈ అనౌన్స్‌మెంట్ అన్నమాట.

Photo Gallery: Pandu Master - పండు మాస్టర్‌కు పృథ్వీరాజ్ పరామర్శ... లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏమిటంటే?

వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి కథానాయికలుగా నటించనున్న ఈ సినిమాను జూన్ 18వ తేదీన... హైదరాబాద్‌లో పూజ, ముహూర్త కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు. అలాగే, జూన్ 22వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు సమర్పిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయనున్నారు. 

Also Read: Peddi Collections Day 8 - 'పెద్ది' కలెక్షన్లకు వర్కింగ్ డేస్ టెస్ట్... రామ్ చరణ్ సినిమాకు ఇంకా తక్కువ?

Frequently Asked Questions

వెంకీ అనిల్ 5 సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు?

ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన ఏఆర్ రెహమాన్ మేనల్లుడు మరియు విభిన్న జానర్ల సినిమాలకు సంగీతం అందించగలరు.

ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు ఇతర నటీనటులు ఎవరు?

నందమూరి కళ్యాణ్ రామ్ మరో హీరోగా నటిస్తున్నారు. వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి కథానాయికలుగా నటించనున్నారు.

ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది మరియు విడుదల ఎప్పుడు?

సినిమా పూజా కార్యక్రమాలు జూన్ 18న, రెగ్యులర్ షూటింగ్ జూన్ 22న మొదలవుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.

సంగీత దర్శకుడిని అనిల్ రావిపూడి ఎలా ప్రకటించారు?

అనిల్ రావిపూడి, జీవీ ప్రకాష్ కుమార్ మరియు అనంత శ్రీరామ్‌లను బీచ్ ఇసుకలో పాతిపెట్టి ఈ విషయాన్ని ప్రకటించారు. మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయని చెప్పడానికి ఇది ఆయన మార్క్ ప్రమోషన్.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Arya: హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?
హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?
Lenin Box Office Collection Day 2: 'లెనిన్' కలెక్షన్స్ పెరిగాయ్... రెండో రోజు బాక్సాఫీస్ దుమ్ము దులిపిన అఖిల్
'లెనిన్' కలెక్షన్స్ పెరిగాయ్... రెండో రోజు బాక్సాఫీస్ దుమ్ము దులిపిన అఖిల్
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
S Janaki Death - Health Bulletin: జానకి మృతిపై అపోలో హాస్పిటల్ హెల్త్ బులిటెన్ రిలీజ్ - ఎన్ని గంటలకు మరణించారు? రీజన్ ఏంటి?
జానకి మృతిపై అపోలో హాస్పిటల్ హెల్త్ బులిటెన్ రిలీజ్ - ఎన్ని గంటలకు మరణించారు? రీజన్ ఏంటి?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Car Insurance: నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Embed widget