News
News
X

Pawan Kalyan Next Movie : పవన్‌తో హరీష్ శంకర్ సినిమా ఆగలేదు - వచ్చే వారమే పూజ, సంక్రాంతి తర్వాత

పవన్ కళ్యాణ్, సుజిత్ సినిమా ప్రకటన రావడంతో హరీష్ శంకర్ సినిమా ఏమైంది? - ఈ ప్రశ్న చాలా మంది మదిలో మొదలైంది. దానికి హరీష్ సమాధానం ఇచ్చారు. 

FOLLOW US: 
Share:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా తెలుగు చిత్రసీమలోని ఆయన వీరాభిమానుల్లో ఒకరైన హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఇది కొత్త విషయం కాదు. కానీ, ఈ సినిమా చుట్టూ ఎన్నో అనుమానాలు, సందేహాలు నెలకొన్నాయి. ఒకానొక దశలో ఈ సినిమా క్యాన్సిల్ అయ్యిందని కూడా గుసగుసలు వినిపించాయి. 

పవన్ కళ్యాణ్ హీరోగా ఈ రోజు సుజిత్ దర్శకత్వంలో యాక్షన్ ఫిల్మ్ నిర్మిస్తున్నట్లు డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత డీవీవీ దానయ్య అనౌన్స్ చేశారు. దాంతో హరీష్ శంకర్ సినిమా ఏమైంది? అని చాలా మంది మదిలో ఓ ప్రశ్న మొదలైంది. దానికి హరీష్ శంకర్ సమాధానం ఇచ్చారు.
 
వచ్చే వారమే పూజతో మొదలు!
Pawan Kalyan Harish Shankar Movie : పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో సినిమా వచ్చే వారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. దాంతో రూమర్స్ అన్నిటికీ చెక్ పెట్టనున్నారు. పూజతో సినిమా స్టార్ట్ చేస్తున్నట్లు హరీష్ శంకర్ కూడా కన్ఫర్మ్ చేశారు.

సంక్రాంతి తర్వాత నుంచి సెట్స్‌కు...
డిసెంబర్ రెండో వారంలో పూజ చేసినా... సెట్స్ మీదకు సంక్రాంతి తర్వాత నుంచి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu) చేస్తున్నారు పవన్ కళ్యాణ్. చారిత్రక కథతో రూపొందుతోన్న ఆ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ సీన్స్ తీస్తున్నారు. ఆ షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక... హరీష్ శంకర్ సినిమా సెట్స్ మీదకు పవన్ వస్తారట.   

పవన్ - హరీష్ సినిమా కథ మారిందా?
పవన్ కళ్యాణ్ కోసం హరీష్ శంకర్ మొదట ఒక స్క్రిప్ట్ రెడీ చేశారు. 'భవదీయుడు భగత్ సింగ్' (Bhavadeeyudu Bhagat Singh Movie) అని టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. అయితే... ఇప్పుడు ఆ కథ మారిందని ఫిల్మ్ నగర్ టాక్. ఇటీవల హరీష్ శంకర్‌కు పవన్ ఒక లైన్ చెప్పి... దానిని డెవలప్ చేయమన్నారట. ఆ స్క్రిప్ట్ రెడీ చేసిన హరీష్ హీరోకి వినిపించారని, గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలిసింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించనున్నారు. 

'గబ్బర్ సింగ్' క్రేజ్ అలాంటిది మరి!
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో 'గబ్బర్ సింగ్' లాంటి హిట్ ఉంది. ఆ సినిమా వచ్చి పదేళ్లు అవుతోంది. ఆ సినిమాలో డైలాగ్ ఉంది కదా... 'పాట వచ్చి పదేళ్లు అయ్యింది. కానీ, క్రేజ్ తగ్గలేదు' అని! ఆ విధంగా పవన్ - హరీష్ కలయికలో సినిమా వచ్చి పదేళ్లు దాటినా... వాళ్ళ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఎటువంటి కథ అయినా సరే... పవన్ నుంచి అభిమానులు ఆశించే సన్నివేశాలు, డైలాగులు హరీష్ శంకర్ రాస్తారని పవర్ స్టార్ అభిమానుల నమ్మకం. 

Also Read : గ్యాంగ్‌స్టర్‌గా పవన్, జపనీస్ లైన్ అర్థం ఏమిటో తెలుసా? పోస్టర్‌లో హింట్స్ గమనించారా?

Published at : 04 Dec 2022 02:39 PM (IST) Tags: Harish Shankar Pawan Kalyan Pawan Kalyan New Movie Pawan Harish Movie Pawan Kalyan Next Movie

సంబంధిత కథనాలు

Kalyan Ram in Suma Adda: హీరోయిన్ ను పక్కనబెట్టి యాంకర్ సుమకు ప్రపోజ్ చేసిన కళ్యాణ్ రామ్!

Kalyan Ram in Suma Adda: హీరోయిన్ ను పక్కనబెట్టి యాంకర్ సుమకు ప్రపోజ్ చేసిన కళ్యాణ్ రామ్!

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Madhavan Audition Clip: ‘3 ఇడియట్స్’ సినిమా కోసం మాధవన్ చేసిన ఆడిషన్ వీడియో చూశారా?

Madhavan Audition Clip: ‘3 ఇడియట్స్’ సినిమా కోసం మాధవన్ చేసిన ఆడిషన్ వీడియో చూశారా?

‘రైటర్ పద్మభూషణ్’ మూవీపై మహేష్ బాబు ట్వీట్ - సుహాస్ భావోద్వేగం!

‘రైటర్ పద్మభూషణ్’ మూవీపై మహేష్ బాబు ట్వీట్ - సుహాస్ భావోద్వేగం!

Jr NTR: సుమపై ఎన్టీఆర్ ఆగ్రహం - ఫ్యాన్స్ క్లాస్, నా భార్య కంటే ముందు మీకే చెప్తానని వెల్లడి!

Jr NTR: సుమపై ఎన్టీఆర్ ఆగ్రహం - ఫ్యాన్స్ క్లాస్, నా భార్య కంటే ముందు మీకే చెప్తానని వెల్లడి!

టాప్ స్టోరీస్

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Love Marriage : సరిహద్దులు లేని ప్రేమ - ఆదిలాబాద్ అబ్బాయితో మయన్మార్ అమ్మాయికి పెళ్లి

Love Marriage : సరిహద్దులు లేని ప్రేమ - ఆదిలాబాద్ అబ్బాయితో మయన్మార్ అమ్మాయికి పెళ్లి

Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్‌లో ఐదుగురు!

Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్‌లో ఐదుగురు!

Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?

Majilis Congress :  మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ -  వర్కవుట్ అవుతుందా ?