HHVM Pre Release Postponed: సినిమా ఒక్కటే కాదు... వీరమల్లు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా వాయిదా!
Hari Hara Veera Mallu: వీరమల్లు సినిమాతో పాటు ఈ వీకెండ్ జరగాల్సిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా వాయిదా పడింది. తిరుపతిలో ఈవెంట్ చేసేందుకు సిద్ధమైన నిర్వాహకులు వాయిదా విషయాన్ని తెలిపారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటించిన 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu) సినిమా విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వాయిదా పడిందనే విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. సినిమా విడుదల వాయిదా పడడంతో తిరుపతిలో ఈ వీకెండ్ జరగాల్సిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ క్యాన్సిల్ చేశారు.
ఆదివారం వీరమల్లు ఫంక్షన్ లేదు...
ప్రస్తుతానికి వాయిదా వేశామని వెల్లడి!
ఏడు కొండల వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో ఈ ఆదివారం (జూన్ 8వ తేదీన) 'హరి హర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. అయితే సినిమా విడుదల వాయిదా పడడంతో ఆ ఫంక్షన్ కూడా వాయిదా పడింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని తారకరామా స్టేడియంలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సినిమా విడుదల తేదీ ఖరారు అయిన తర్వాత ఫంక్షన్ కొత్త డేట్ ఖరారు అయ్యే అవకాశం ఉంది.
సినిమా వాయిదా వెనుక కారణం ఏమిటి?
ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని కొందరు, వీరమల్లు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎగ్జిబిటర్స్ ఎవరూ ముందుకు రావడం లేదని మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అయితే అసలు కారణం అది కాదు విజువల్ ఎఫెక్ట్ వర్క్స్ సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల 'హరిహర వీరమల్లు' వాయిదా పడిందని యూనిట్ సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తుంది. పూర్తి వివరాల కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.
'హరి హర వీరమల్లు' సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకం మీద ఏయం రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైన చిత్రమిది. ఆ తర్వాత రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్, బాబీ డియోల్ విలన్.
Also Read: ఒక్క రాత్రిలో జీవితం తల్లకిందులు... ఏడు భాషల్లో ప్రియమణి లీగల్ వెబ్ సిరీస్... ఫస్ట్ లుక్ చూశారా?





















