HHVM Pre Release Event: పవన్ 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మారింది! - ఎక్కడో తెలుసా?
Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ మారినట్లు తెలుస్తోంది. ఇదివరకూ తిరుపతిలో చేయాలని ప్లాన్ చేయగా... తాజాగా మేకర్స్ వెన్యూ మార్చారట.

Pawan Kalyan Hari Hara Veera Mallu Pre Release Event Venue Changed: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అవెయిటెడ్ పీరియాడిక్ అడ్వెంచర్ మూవీ 'హరిహర వీరమల్లు' ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. సినిమా విడుదలకు నాలుగు రోజుల ముందు ఈ నెల 20న ఏపీలోనే ఈవెంట్ నిర్వహించాలని ఏర్పాట్లు చేశారు.
మారిన వెన్యూ!
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏపీలోని తిరుపతిలో నిర్వహించాలని ఇంతకు ముందు మేకర్స్ ప్లాన్ చేశారు. ఇందుకు తగిన విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారనే టాక్ వినిపించింది. అయితే... తాజాగా అనివార్య కారణాలతో ఈ వెన్యూ మార్చారని తెలుస్తోంది. తిరుపతిలో కాకుండా విశాఖలో ఈవెంట్ నిర్వహించేందుకు మూవీ టీం సన్నాహాలు చేస్తుందట. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు జనసైనికులు భారీగా ఈవెంట్‌కు హాజరయ్యే ఛాన్స్ ఉంది. అందుకు తగిన విధంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: వీరమల్లులో కోట శ్రీనివాస రావు... చివరి సినిమా ఇదే కానీ... ఎన్ని రోజులు షూటింగ్ చేశారంటే?
పవన్ స్పీచ్‌పైనే అందరి దృష్టి
ఈ ఈవెంట్‌లో పవన్ స్పీచ్‌పైనే అందరి దృష్టి ఉంది. ఏపీలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన సినిమాలకు కాస్త గ్యాప్ వచ్చింది. నేరుగా ఏ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరు కాలేదు. ఇటీవల 'హరిహర వీరమల్లు' రిలీజ్‌పై కుట్రలు జరిగాయంటూ సాగిన ప్రచారం, ఇండస్ట్రీలో కొందరి తీరుపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేయడం పెద్ద చర్చే సాగింది. దీంతో తన సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ ఏం మాట్లాడతారు? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 'భీమ్లా నాయక్' తర్వాత ఆయన సినిమా థియేటర్లలోకి వస్తుండడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
మరోవైపు... 'హరిహర వీరమల్లు' సినిమాలో హిస్టరీని వక్రీకరించారంటూ తెలంగాణలో కొన్ని సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమా రిలీజ్ అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అయితే... ఈ విమర్శలపై మూవీ టీం స్పందించింది. సనాతన ధర్మాన్ని రక్షించే ఓ వీరుడి ప్రయాణమే 'హరిహర వీరమల్లు' అని... తమది కల్పిత కథతో తీసిన సినిమా అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎఎం రత్నం సమర్పణలో ఎ.దయాకరరావు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకులుగా వ్యవహరించగా... పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. బాబీ డియోల్ విలన్ రోల్‌లో నటించారు. అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్ గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, నోరా ఫతేహి, సుబ్బరాజు కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.






















