అన్వేషించండి

Pawan Kalyan: సనాతన ధర్మం అవసరం, ఎవరినీ వీరమల్లు కించపరచదు - ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్

Pawan Kalyan Interview: 'హరి హర వీరమల్లు' విడుదల నేపథ్యంలో ఏబీపీ న్యూస్‌తో ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు...

'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) ఈ గురువారం (జూలై 24న) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ముందు రోజు (జూలై 23) రాత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ ప్లాన్ చేశారు. ప్రెస్ మీట్, ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రమోషన్స్ కోసం మూడు రోజులు కేటాయించారు ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వీరమల్లు విడుదల నేపథ్యంలో ఏబీపీ న్యూస్‌తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు...    

హరి హర వీరమల్లు సినిమా గురించి మీరు ఏం చెబుతారు?
మొఘలులు పాలించిన కాలంలో, ప్రత్యేకించి ఔరంగజేబు రాజ్యంలో ఉన్నప్పుడు జరిగిన కథ 'హరిహర వీరమల్లు'. చిత్ర కథంతా కోహినూర్ డైమండ్ చుట్టూ ఎక్కువ తిరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ సమీపంలో కొల్లూరు వజ్రాల గనుల దగ్గర ఓ పిల్లాడికి కోహినూర్ దొరికింది. అక్కడి నుంచి అది ఎలా నిజాం ప్రభువుల దగ్గరకు, అక్కడి నుంచి మొఘలుల చేతికి, అక్కడి నుంచి నెమలి సింహానంతో బ్రిటీషర్ల చేతుల్లోకి వెళ్లింది. ఆ సమయంలో జరిగిన కథ. నెమలి సింహాసనం నుంచి కోహినూర్ వజ్రాన్ని హరి హర వీరమల్లు ఎలా కొట్టాశాడనే కల్పిత పాత్ర, కథతో ఈ సినిమా తీశాం. ఆ సమయంలో ప్రజల భావోద్వేగాలు ఎలా ఉండేవో అలాంటి భావాల నుంచి పుట్టిన వ్యక్తి హరి హర వీరమల్లు. సినిమా సాగే కొద్దీ అతని తత్వం ఏంటో మనకు తెలుస్తుంది. మొదటి పార్ట్ అతను ఢిల్లీ ప్రయాణానికి ఎందుకు సిద్ధమయ్యాడు? ఎలా కోహినూర్ ఢిల్లీకి వెళ్లింది? అనేంత వరకూ ఉంటుంది. రెండో పార్ట్ లో మొఘలుల నుంచి కోహినూర్ ఎలా వెనక్కి తీసుకురావాలనేంత వరకూ ఉంటుంది. ఆ సమయంలో కోహినూర్ మన సంస్కృతిలో భాగం. అందుకే ఈ కథ వినగానే నాకు బాగా కనెక్ట్ అయ్యింది.

సినిమాలో మొఘలులను ఎలా చూపించారు? వాళ్ళ పాలన గురించి మీరేం చెబుతారు?
మొఘలుల చరిత్రను గొప్పగా మార్చి చెప్పారు. స్కూల్ పిల్లలు చదువుకునే పాఠాల్లో మొఘలుల గొప్పతనం గురించే ఉంటుంది. పాండ్యులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యాధీశుల కంటే అదే ఎక్కువగా కనపడుతుంది. నేను మన రాజుల గురించి ఎక్కువగా బయట వ్యక్తులు రాసిన పుస్తకాల నుంచి చదివాను. పాఠశాలలో అవన్నీ చెప్పలేదు. ముఖ్యంగా ప్రసాద్ జీ రాసిన పుస్తకాలు బాగా ఆకర్షించాయి. ఈ సినిమా చేస్తున్నప్పుడు అవన్నీ గుర్తొచ్చాయి. ఔరంగజేబు వేసిన జిజియా పన్ను నన్ను బాధించింది. హిందువుగా ఉండాలంటే పన్ను కట్టాల్సిన రావటం దారుణం. హిందువులు ఎక్కువగా ఉండే ఈ నేలలో మిగిలిన ధర్మాలను సైతం ఆదరించే మన సంస్కృతిలో బయట దేశం నుంచి వచ్చిన పాలకులు మన మీద పెత్తనం చేస్తూ మనల్నే ఎదురు తిరిగి పన్ను కట్టమంటే ఎంత దారుణం. ఈ సినిమాలో మేం ఆ విషయాన్ని ప్రశ్నించాం. పతాక సన్నివేశాల్లో అది ఉంటుంది. కోహినూర్ వెతికి పట్టుకోవడం, తిరిగి రావడం ఇవన్నీ నాకు చాలా ఆసక్తిగా అనిపించి ఈ సినిమా చేశాను. కోహినూర్ తీసుకు వెళ్లడం అంటే మన సంపదను మొఘలులు ఎలా కొల్లగొట్టారో అర్థం చేసుకోవాలి. అప్పటి రోజుల్లో ఉండే పాలన ఎలాంటింది? మన సంస్కృతిని ఎలా నాశనం చేశారు? వంటివన్నీ చూపించాం.

మీరు ఉప ముఖ్యమంత్రి అయ్యాక వీరమల్లు చిత్రీకరణ చేశారు. ఈ సినిమాకు టైమ్ ఎలా కేటాయించారు? 
ప్రభుత్వ పాలన, విధులకు ఎటువంటి ఆటంకంకలగకుండా సినిమా చేశా. నేను రోజూ రెండు గంటలు కేటాయించే వాడిని. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకూ టైమ్ ఇచ్చేవాడిని. మా ఆఫీస్ దగ్గరే స్టూడియో సెటప్ క్రియేట్ చేసుకుని రెండు గంటల టైమ్ లో పూర్తి చేసేవాడిని. అసలు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోకముందే చాలా సినిమా పూర్తై పోయింది. బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రజల సేవకు టైమ్ కేటాయిస్తూ నా వ్యక్తిగత సమయంలో రెండు గంటలు 'హరి హర వీరమల్లు'కు కేటాయించా.

చరిత్రను వక్రీకరించారని, కొందరి మనోభావాలు గాయపరిచేలా సినిమా వస్తున్న విమర్శల పట్ల మీ స్పందన?
'హరి హర వీరమల్లు' కేవలం హిందూయిజం గురించి మాత్రమే కాదు. అసలు వీరమల్లుకు కోహినూర్ వజ్రం కొట్టేయాలని చెప్పేది తానీషా. అప్పట్లో తెలంగాణను పాలించిన ముస్లిం పాలకుడు ఆయన. ఔరంగజేబు వద్ద కోహినూర్ ఉండకూడదని చెప్పి వీరమల్లును పంపిస్తాడు. కనుక నేనేదో ఓ ధర్మాన్ని, వారి మనోభావాలను కించపరిచేలా సినిమా తీయలేదు. నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నా. చరిత్ర గురించి చెప్పాలి... అలాగే ఎవరినీ బాధ పెట్టకూడదు. ఈ సినిమా మానవత్వం గురించి మాట్లాడుతుంది. ఔరంగజేబు కాలం గురించి నాడు హిందూ ధర్మం ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి ప్రస్తావిస్తుంది. ఈ సినిమాలో ఇదంతా ఓ భాగం మాత్రమే. ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. చాలా ఏళ్ల తర్వాత నా సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ నేను కొరియోగ్రఫీ చేశా. క్లైమాక్స్ ఫైట్ నేనే డిజైన్ చేశాను. అవన్నీ 'హరి హర వీరమల్లు'లో అలరిస్తాయి.

సనాతన ధర్మం గురించి మీరు మాట్లాడుతున్నారు. ఈ సినిమాలోనూ ఆ అంశం ఉన్నట్లు దర్శకుడు చెప్పారు. సనాతన ధర్మం గురించి మీరు ఏమంటారు?
ఏ దేశమైనా, దేశ ప్రజలకు అయినా ఆ దేశ సంస్కృతిని కాపాడుకోవటం ప్రాథమిక హక్కు. సోషలిజం, మార్క్సిజం లాంటి భావజాలాలు, సిద్ధాంతాలు ఎన్ని అయినా రావొచ్చు. కానీ ఆ దేశ సంస్కృతిని అందరూ గౌరవించి తీరాల్సిందే. రష్యాలో కూడా లెనిన్ టైంలో కమ్యూనిజానికి ఆధిపత్యం వచ్చింది. అన్ని మతాలను నిషేధించారు. కానీ సనాతన క్రైస్తవం మళ్లీ అక్కడ పుట్టుకొచ్చింది. జరిగేది అదే. మనం సంస్కృతిని అణిచేయలేం, చంపేయలేం. అందుకే సంస్కృతిని వ్యతిరేకించకూడదు. మా సంస్కృతిని మేం కాపాడుకుంటాం. ఇస్లాం, క్రైస్తవాన్ని నేను గౌరవిస్తా. అదే సమయంలో నా ధర్మాన్ని కాపాడుకుంటా. నేను హిందుత్వానికి కట్టుబడి ఉన్నవాడిని. అంకిత భావంతో ఉన్నా. మా మతాన్ని అవమానించొద్దు. సనాతన ధర్మం మన దేశానికి అవసరం. దానికి సహనం ఎక్కువ. అందుకే ఇన్ని విదేశీ మతాలను చేతులు చాపి మరీ ఆహ్వానించింది మన దేశం.

Also Read: బాహుబలి @ 10 - తెర వెనుక సమ్‌గతుల నుంచి రికార్డ్స్‌, అవార్డ్స్‌ వరకూ... ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌ తెలుసా?

హిందీ గురించి మీరు చేసిన వ్యాఖ్యలపై విమర్శలు సైతం వచ్చాయి. మీరు ఏమంటారు?
హిందీని వ్యతిరేకించాల్సిన అవసరం ఏంటి? అని ఆలోచిస్తున్నా. ఎవరైనా ఎప్పుడైనా భాష నేర్చుకోవటం మంచిదే. నేను ఏమన్నా మాట్లాడాలంటే తెలుగు, ఇంగ్లీషుల్లోనే వస్తుంది. నేను హిందీ రాయగలను, చదవగలను కానీ మాట్లాడేప్పుడు కొంచెం ఇబ్బంది. అందుకని నా మీద నాకు కోపం. హిందీ నేర్చుకుని ఉంటే నేనూ బాగా మాట్లాడేవాడిని. కానీ ఇప్పుడు ఇంగ్లీషులోనే హిందీ కంటే బాగా మాట్లాడుతున్నా. నేను హిందీ ఇంకా నేర్చుకోవాలి. నాకు టైమ్ ఉండటం లేదు. మాట్లాడే వాళ్లు లేరు. అవసరం పడటం లేదు. పైగా నేను తెలుగు సినిమాకే పరిమితమైపోయా. నేను కొత్త భాష నేర్చుకుంటే అది నా కెరీర్ పరంగానూ ఉపయోగపడుతుంది. ఇంత పెద్ద దేశంలో ఎక్కువ మంది హిందీ మాట్లాడేవాళ్లు ఉన్నప్పుడు ఆ భాష నేర్చుకోవటం అవసరం. అలాగే ఉత్తరాది ప్రజలు కూడా దక్షిణాది భాషలు నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది.

Also Read: పాన్ ఇండియా హిట్స్‌కు కేరాఫ్ అడ్రస్ శివశక్తి దత్తా... రాజమౌళి సినిమాల్లో ఆ సాంగ్స్ రాసింది ఆయనే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget