అన్వేషించండి

Patang Teaser: ప్రీతి పగడాల ఫస్ట్ మూవీ 'పతంగ్' టీజర్ వచ్చేసింది - ఫీల్ గుడ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ!

Patang Teaser: ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల, వంశీ పూజిత్ నటించిన చిత్రం 'పతంగ్'. తాజాగా ఈ మూవీ టీజర్ ను డైరెక్టర్ బుచ్చిబాబు చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.

Patang Teaser: ప‌‌‌‌తంగుల పోటీ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ 'ప‌‌‌‌తంగ్'. ఇందులో ఇన్‌స్టాగ్రామ్ సెన్సేష‌న్ ప్రీతి ప‌గ‌డాల‌, జీ స‌రిగ‌మ‌ప ర‌న్న‌ర‌ప్ ప్ర‌ణ‌వ్ కౌశిక్‌, హిరోయిన్ శాన్వీ మేఘన సోదరుడు వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా హైదరాబాద్ లో టీజర్ లాంఛ్ ఈవెంట్ ను నిర్వహించారు. దీనికి ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా ముఖ్య అతిథిగా హాజరై, చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ అందజేశారు.

"ప్రేమ కోసం యుద్ధాలే జరిగాయి అంటారు.. నువ్వు పతంగ్ ఎగరెయ్యలేవా?" అనే హీరోయిన్ వాయిస్ ఓవర్ తో టీజర్ ప్రారంభమైంది. పతంగుల ఆట నేపథ్యంలో లవ్, ఫ్రెండ్ షిప్ ల గురించి తెలియజేస్తూ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అరుణ్ (ప్ర‌ణ‌వ్ కౌశిక్‌), విక్కీ (వంశీ పూజిత్), ప్రీతిల మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీని మనం ఈ టీజర్ లో చూడొచ్చు. ప్రీతిని విక్కీ ప్రేమిస్తుండగా.. ఆమె మాత్రం ప్రేమించమని అరుణ్ వెంట పడుతోంది. ఈ కథలో పతంగుల మ్యాచ్ కీలకంగా మారినట్లు తెలుస్తోంది. సింగర్ ఎస్పీ చరణ్‌ కీలక పాత్రలో కనిపించారు.

సహజత్వానికి దగ్గరగా ఉండేలా కంప్లీట్ యూత్‌‌‌‌ ఫుల్‌‌‌‌ కామెడీ ఎంటర్టైనర్ గా పతంగ్ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఇన్స్టా గ్రామ్ రీల్స్ తో అలరించిన ప్రీతి పగడాల ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద కూడా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. వంశీ తన పేరు విస్కీ అని చెప్పినప్పుడు.. 'నాకు ఆ పేరంటే చాలా ఇష్టం, ఎందుకంటే మా కుక్క పేరు కూడా అదే' అని ప్రీతి చెప్పడం నవ్వు తెప్పిస్తుంది. ఇందులో ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్‌‌‌‌ తో పాటు ఎమోషన్‌‌‌‌ కూడా ఉంటుందని టీజర్ ని బట్టి అర్థమవుతోంది. దీనికి బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 

ఇండియన్ సినిమాలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు వచ్చాయి. ప‌తంగుల పోటీ నేపధ్యంలో తెలుగులో రాబోతున్న మొదటి కామెడీ స్పోర్ట్స్ డ్రామా 'ప‌తంగ్'. ఈ చిత్రానికి ప్ర‌ణీత్ ప్ర‌త్తిపాటి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాటిక్ ఎలిమెంట్స్ & రిష‌న్ సినిమాస్ బ్యానర్ పై విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాని బండ్రెడ్డి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా.. నిఖిల్ కోడూరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

శ‌క్తి అర‌వింద్‌ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్న ఈ సినిమాకి జోస్ జిమ్మీ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీమణి సాహిత్యం అందించారు. చాణ‌క్య రెడ్డి ఎడిట‌ర్‌‌గా, వెంక‌ట్ శాతావాహ‌న‌ ప్రొడ‌క్ష‌న్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ ఆటా సందీప్ కొరియోగ్రఫీ చేశాడు. మేఘన శేషవపురి కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా పని చేశారు. చాలా కాలంగా నిర్మాణం జరుపుకుంటున్న 'పతంగ్' సినిమాని సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Also Read: ఎవరైనా అనిల్‌ రావిపూడిని ముసుగేసి గుద్దితే రూ. 10 వేలు ఇస్తా - ఎస్ఎస్ రాజమౌళి

టాప్ హెడ్ లైన్స్

DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Anil Ravipudi Animated Movie : అనిల్ రావిపూడి యానిమేటెడ్ మూవీ - వెరీ స్పెషల్‌గా రామాయణం
అనిల్ రావిపూడి యానిమేటెడ్ మూవీ - వెరీ స్పెషల్‌గా రామాయణం
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Embed widget