SS Rajamouli: ఎవరైనా అనిల్ రావిపూడిని ముసుగేసి గుద్దితే రూ. 10 వేలు ఇస్తా - ఎస్ఎస్ రాజమౌళి
Krishnamma: కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్ హీరోగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రముఖ దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని అతిథులుగా హాజరయ్యారు.
Krishnamma Pre Release Event: వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కృష్ణమ్మ’. డెబ్యూ డైరెక్టర్ వి.వి. గోపాలకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పిస్తున్నారు. ఈ సినిమా మే 10న రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. దీనికి స్టార్ డైరెక్టర్లు ఎస్.ఎస్ రాజమౌళి, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవి శంకర్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ఎవరైనా అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తానని ప్రకటించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
RRR వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు దర్శకధీరుడు రాజమౌళి. #SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని ఫ్యాన్స్ ఆతృతగా వేచి చూస్తున్నారు. ఏదైనా అప్డేట్ ఇవ్వమని మేకర్స్ ను అడుగుతున్నారు. 'కృష్ణమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా అనిల్ రావిపూడి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మహేశ్ తో చేయబోయే సినిమా అప్డేట్ ఇవ్వాలని కోరారు.
''రాజమౌళి తన సినిమా ఓపెనింగ్ రోజునే కథేంటో చెప్పేస్తారు. అసలు ఏ జోనర్, ఏం సినిమా తీస్తున్నారు అనేది తెలుసుకోవాలని అందరూ ఎగ్జైటింగ్ ఉన్నారు. ఆయన స్పీచ్ లో ఆ రెండింటి గురించి చెప్పాలని కోరుకుంటున్నాను'' అని అనిల్ రావిపూడి అన్నారు. దీనికి రాజమౌళి స్పందిస్తూ.. ''ఎవరైనా సరే ఒక కెమెరా పట్టుకొని అనిల్ రావిపూడి వెనకాలే వెళ్లి ఆయన మీద ముసుగేసి గుద్దితే పదివేలు ఇస్తాను'' అంటూ వేదికపై నవ్వులు పూయించారు. దీంతో ''దయచేసి ప్రైజ్ మనీ తగ్గించండి సార్. 10 వేలు అంటే ఎవరైనా వచ్చేస్తారు'' అంటూ అనిల్ ఫన్నీగా అనడంతో వేదిక మీద ఉన్నవారంతా నవ్వేశారు.
ఇంకా 'కృష్ణమ్మ' గురించి రాజమౌళి మాట్లాడుతూ.. ''ఈ సినిమాతో ప్రెజెంటర్‌గా పరిచయం అవుతున్న కొరటాల శివకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కొరటాల ప్రెజెంట్స్ అనగానే అందరిలో ఈ మూవీపై ఆసక్తి కలుగుతుంది. ఈ సినిమాతో పెద్ద విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తక్కువ షాట్స్ లోనే చాలా అట్రాక్టీవ్ గా, సినిమా చూడాలని ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా టీజర్, ట్రైలర్ కట్ చేసిన డైరెక్టర్ గోపాలకృష్ణకి ఆల్ ది బెస్ట్. సత్యదేవ్ ఎలాంటి నటుడో ఇండస్ట్రీలో అందరికీ ప్రేక్షకులందరికీ తెలుసు. ఇలాంటి టాలెంటెడ్ యాక్టర్స్ కు ఏదో ఒక సినిమా స్టార్ డమ్ తెచ్చిపెడుతుంది. సత్యదేవ్ కెరీర్ కి ‘కృష్ణమ్మ’ అలాంటి సినిమా అవుతుందని నమ్ముతున్నాను'' అని అన్నారు.
కొరటాల శివ మాట్లాడుతూ.. ''నిర్మాత కృష్ణ కొమ్మలపాటి సూచన మేరకు దర్శకుడు గోపాలకృష్ణ వచ్చి నాకు 'కృష్ణమ్మ' స్టోరీ వినిపించారు. వెంటనే నేనూ ఈ సినిమాలో భాగమవుతానని చెప్పా. అంత మంచి కథ రాసారు గోపాల్. ఓ దర్శకుడిగా నేనుఏమైనా చెబుదామనుకునే లోపే తనే కొన్ని ఆప్సన్స్ తో వచ్చేవాడు. ఆయన చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. అప్పటి నుంచి ఆయనపై నాకు నమ్మకంతో నేను ఎక్కడా జోక్యం చేసుకోలేదు. క్రియేటివ్ వర్క్ అంతా తనదే.. నాకు ఎలాంటి సంబంధం లేదు. టీమ్ ఎంతో ఇష్టంతో నిజాయితీగా పనిచేసింది. కచ్చితంగా వాళ్ల కష్టానికి మే 10న ప్రతిఫలం దక్కుతుందని ఆశిస్తున్నా. నేను చూసిన టాలెంటెడ్ యాక్టర్స్ లో సత్యదేవ్ ఒకరు. ఈ సినిమాతో అతను మరో మెట్టు ఎక్కుతాడు'' అని అన్నారు. ఎన్టీఆర్ తో చేస్తున్న ‘దేవర’ అప్‌డేట్ గురించి అడగ్గా.. ఈ మూవీ గురించి చెప్పేందుకు చాలా సమయం ఉందని, త్వరలోనే అప్‌డేట్స్ వస్తాయని తెలిపారు.
Also Read: తెర మీదకు సూపర్ స్టార్ బయోపిక్ - రజనీకాంత్ పాత్రలో నటించే హీరో ఎవరంటే?