Prabhas On Salaar : 'సలార్' దర్శక - నిర్మాతలకు ప్రభాస్ కండిషన్స్ - అంతా 'ఆదిపురుష్' కోసమే!
Prabhas Conditions To Salaar Makers : 'ఆదిపురుష్' సినిమా కోసం 'సలార్' దర్శక నిర్మాతలకు ప్రభాస్ కండిషన్లు పెట్టినట్లు ఫిల్మ్ నగర్ గుసగుస.
రెబల్ స్టార్, పాన్ ఇండియా డార్లింగ్ (Prabhas) చేతిలో నాలుగు ఐదు సినిమాలు ఉన్నాయి. వాటిలో ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చేది మాత్రం 'ఆదిపురుష్'. అయితే, ఆ సినిమాకు ఏ మాత్రం బజ్ లేదు. నిజం చెప్పాలంటే... టీజర్ విడుదల తర్వాత కంప్లీట్ నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఆ సినిమా కంటే 'సలార్' సినిమాపై ఎక్కువ క్రేజ్ ఉంది. ఈ అంశం ప్రభాస్ & 'ఆదిపురుష్' బృందాన్ని కొంచెం టెన్షన్ పెట్టే విషయమే. అందుకని, ప్రభాస్ ఓ నిర్మాణం తీసుకున్నారట!
'ఆదిపురుష్' విడుదలయ్యే వరకూ...
జూన్ 16న 'ఆదిపురుష్' ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. అప్పటి వరకు 'సలార్' నుంచి ఎటువంటి అప్డేట్స్ ఇవ్వొద్దని దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరగందూర్ & ఇతర సినిమా బృందానికి ప్రభాస్ కొంచెం గట్టిగా చెప్పారట.
'కెజియఫ్' తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న సినిమా 'సలార్'. రఫ్ & రగ్గడ్ ప్రభాస్ లుక్, యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి మూడు నాలుగు నెలల ముందు నుంచి పబ్లిసిటీ ప్లాన్ చేస్తారు. సెప్టెంబర్ 28న 'సలార్' విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. అందులో మరో ఆలోచన లేదు.
Also Read : 'సార్' రివ్యూ : ధనుష్ పాఠాలు బోర్ కొట్టించాయా? ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయా?
Adipurush Vs Salaar : 'ఆదిపురుష్' థియేటర్లలోకి వచ్చే సమయానికి టీజర్ విడుదల చేయాలని ముందుగా ప్లాన్స్ వేశారట. ఆ టీజర్ వస్తే... 'ఆదిపురుష్' మీద ఎక్కడ ఎఫెక్ట్ పడుతుందోనని ప్రభాస్ వద్దని చెప్పేశారట. అదీ సంగతి!
డార్లింగ్ ఈజ్ బ్యాక్!
డార్లింగ్ ఫ్యాన్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్. ప్రస్తుతం ప్రభాస్ ఆరోగ్యంగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన జ్వరం బారిన పడ్డారు. అయితే, ఆ విషయంలో పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇటీవల అభిమానుల కోసం ఆయన ఫోటోషూట్ చేశారు. ఫ్యాన్స్ అందరికీ ఫోటోలు ఇచ్చారు. వాటిలో ప్రభాస్ ఫుల్ ఛార్మ్, హ్యాండ్సమ్ గా ఉన్నారు. జ్వరం కూడా పెద్దగా లేదని సమాచారం.
Also Read : సద్గురుకు ఉపాసన దత్త పుత్రిక - రామ్ చరణ్ వైఫ్ పోస్ట్ చూశారా?
జ్వరం కారణంగా ఈ నెలలో జరగాల్సిన మారుతి సినిమా షూటింగును ప్రభాస్ క్యాన్సిల్ చేశారట. ఆ షెడ్యూల్ వాయిదా వేసి... మరోసారి చేద్దామని చెప్పారట. మారుతి సినిమా సంగతి పక్కన పెడితే... ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రభాస్ థియేటర్లలో సందడి చేయనున్నారు. ఆ సినిమాలు ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
Prabhas Upcoming Movies : 'ఆదిపురుష్', 'సలార్', మారుతి సినిమాలు కాకుండా... 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కె' సినిమా సెట్స్ మీద ఉంది. అది సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ ఓ పాన్ ఇండియా సినిమా ప్రొడ్యూస్ చేయనుంది. లేటెస్టుగా 'అన్‌స్టాపబుల్ 2'కు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి వచ్చారు. వాళ్ళను ప్రభాస్ సినిమా గురించి బాలకృష్ణ అడగ్గా... కన్ఫర్మ్ చేశారు. పైన చెప్పిన 'స్పిరిట్' ఇంకొకటి.