Upasana Meets Sadhguru : సద్గురుకు ఉపాసన దత్త పుత్రిక - రామ్ చరణ్ వైఫ్ పోస్ట్ చూశారా?
సద్గురుతో దిగిన ఫోటోను ఉపాసన పోస్ట్ చేశారు. దానికి ఆమె పేర్కొన్న కాప్షన్ చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ, ఆమె ఏమన్నారు? ఏంటి? అనేది మీరూ చూడండి.
ప్రముఖ యోగి, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ (Sadhguru Jaggi Vasudev) తో దిగిన ఫోటోను ఎంట్రప్రెన్యూర్, మెగా కోడలు ఉపాసనా కామినేని కొణిదెల (Upasana Kamineni Konidela) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానికి ఇచ్చిన కాప్షన్ నెటిజనుల దృష్టిని ఆకర్షిస్తోంది.
కుమార్తెలతో సద్గురు
''తన కుమార్తెలతో సద్గురు. ఒకరు కన్నబిడ్డ అయితే... మరొకరు దత్త పుత్రిక అని అనుకోవచ్చు'' అని ఉపాసన పేర్కొన్నారు. ఆ ఫోటోలో మరో మహిళ సద్గురు కుమార్తె రాధే జగ్గీ.
ఇటీవల ఉపాసన తాతయ్య, అపోలో ఆస్పత్రుల వ్యవస్థాపకులు ప్రతాప్ సి. రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. సద్గురు, ఆయన కుమార్తె ఆ వేడుకలకు విచ్చేశారు. సద్గురు సమక్షంలో ఉండటం ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని, తాతయ్య బర్త్ డే పార్టీకి వచ్చిన ఆయనకు థాంక్స్ అని ఉపాసన పేర్కొన్నారు. అదీ సంగతి!
Also Read : వంటింట్లోకి రావొద్దు - త్రివిక్రమ్‌కు వైఫ్ ఆర్డర్! ఎందుకంటే?
View this post on Instagram
రామ్ చరణ్, ఉపాసన వ్యక్తిగత జీవితానికి వస్తే... ఈ దంపతులు అతి త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. గత ఏడాది డిసెంబర్ 12న తాను తాతయ్య కాబోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత రామ్ చరణ్ కూడా ఆ విషయం చెప్పారు. సినిమా వేడుకలు, ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో ఉపాసన బేబీ బంప్‌తో కనిపిస్తున్నారు.
Also Read : ప్రేమికుల రోజున స్టార్ హీరోయిన్లు ఎక్కడ ఉన్నారు? ఎవరితో ఉన్నారంటే?
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాలోని 'నాటు నాటు...' పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చినప్పుడు ఉపాసన ఎమోషనల్ పోస్ట్ చేశారు. ''ఆర్ఆర్ఆర్' చిత్ర బృందంలో నేనూ ఓ భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలోని పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం దేశం గర్వించదగిన విషయం. ఈ అవార్డు వేడుకల్లో నాతో పాటు నా కడుపులో ఉన్న బిడ్డ కూడా అనుభూతి పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణాలు ఎంతో మధురంగా, భావోద్వేగంగా ఉన్నాయి'' అని ఆమె పేర్కొన్నారు.
రామ్ చరణ్, ఉపాసన వివాహం జూన్ 14, 2012న జరిగింది. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల సమక్షంలో వివాహ వేడుక వైభవంగా జరిగింది. పెళ్ళైన పదేళ్ళకు వాళ్ళు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ మధ్యలో చాలా సార్లు 'పిల్లల్ని ఎందుకు కనడం లేదు?' ప్రశ్న ఎదుర్కొన్నారు. మధ్యలో కొన్ని విమర్శలు, పుకార్లు కూడా వచ్చాయి. వాటికి ఓపిగ్గా సమాధానాలు చెప్పారు ఉపాసన. ఎప్పుడూ సహనాన్ని కోల్పోలేదు.
గతంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో సద్గురు పాల్గొనగా... ఆ ఈవెంట్‌ను ఉపాసన హోస్ట్ చేశారు. ఆ వీడియో క్లిప్స్ షేర్ చేస్తూ... కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఉపాసన, రామ్ చరణ్ పాపులేషన్ ను కంట్రోల్ చేయడానికి పిల్లలను కనడం లేదంటూ థంబ్ నెయిల్స్ పెట్టాయి. నిజానికి, ఆ వీడియోలో ఎబిలిటీ టూ రీ ప్రొడ్యూస్ (పిల్లలను కనడం) అనే విషయం గురించి ఉపాసన ప్రస్తావించారు. అప్పుడు సద్గురు మనుషుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని... అంతరించే జాతి కాదు కాబట్టి, పిల్లలను కనకుండా ఉండటమే అందరూ చేసే సాయమన్నారు. ఆ మాటలను అప్పట్లో కొందరు వక్రీకరించారు. దాంతో స్పందించిన ఉపాసన... ''ఓ మై గాడ్! ఈ వార్తల్లో నిజం లేదు. దయచేసి వీడియో మొత్తం చూడండి. నా కాపీ చూశాక మీకు అర్ధమవుతుంది'' అంటూ వివరించారు.