News
News
X

Trivikram Funny Incidents : వంటింట్లోకి రావొద్దు - త్రివిక్రమ్‌కు వైఫ్ ఆర్డర్! ఎందుకంటే?

Sir Movie Review In Telugu : వంటింట్లోకి రావద్దని త్రివిక్రమ్‌తో ఆయన వైఫ్ క్లారిటీగా చెప్పేశారు. ఒక విధంగా అది ఆర్డర్ లాంటిది. ఎందుకు? అనేది తెలుసుకోవాలంటే న్యూస్ పూర్తిగా చదవాలి.

FOLLOW US: 
Share:

త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) సినిమాలు, వాటిలో డైలాగులకు మాత్రమే కాదు... స్టేజి మీద ఆయన మాటలకూ అభిమానులు ఉన్నారు. ఆయన ఎంత సేపు మైక్ పట్టుకుని చెబుతున్నా సరే ప్రేక్షకులు వింటూనే ఉంటారు. అందుకు కారణం మధ్య మధ్యలో ఆయన వేసే చమక్కులు! 'సార్' ప్రీ రిలీజ్ వేడుకలో కూడా ఆయన స్పీచ్ మధ్యలో వంటింటి ప్రస్తావన ఎక్కువ మందిని ఆకట్టుకుంది. యాంకర్ సుమ కానుకలను అవాక్కు అయ్యేలా చేసింది. అసలు వివరాల్లోకి వెళితే... 

సాయంత్రం వంట నేనే చేస్తా కానీ...
ధనుష్ కథానాయకుడిగా నటించిన 'సార్' సినిమా నిర్మాతల్లో త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య ఒకరు. ఆవిడ ప్రీ రిలీజ్ వేడుకకు రాలేదు. ఆమె బదులు త్రివిక్రమ్ వచ్చారు. సాయి సౌజన్య ఎందుకు రాలేదని ఎవరూ అడగలేదు. కానీ, త్రివిక్రమ్ మాటల మధ్యలో ''సాధారణంగా సాయంత్రం మా ఇంట్లో వంట నేనే చేస్తాను. కానీ, ఈ రోజు ఫంక్షన్ ఉందని మా ఆవిడ చేస్తోంది. అందుకని, ఈ ప్రీ రిలీజ్ వేడుకకు రాలేకపోయారు. మీ అందరి శుభాకాంక్షలు నేను ఆవిడకు అందజేస్తాను'' అని చెప్పారు. ఈ మాట ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించింది.
 
వంటింట్లో ఫిజిక్స్ ఏంటి?
నువ్వు ఇటు రావద్దని...
త్రివిక్రమ్ నిజంగా రోజూ ఇంట్లో వంట చేస్తారని ప్రేక్షకులు భావించారు. అయితే, అది నిజం కాదు అని... సరదాగా చెప్పిన మాట అని అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. సుమ కనకాల కూడా ఈవెనింగ్ ఫంక్షన్స్, యాంకరింగ్ అని బిజీగా స్టేజి మీద ఉండటంతో వాళ్ళింట్లో రాజీవ్ కనకాల వంట చేస్తారని త్రివిక్రమ్ అన్నారు. అప్పుడు సుమ ''ఈ రోజు నన్ను ఎక్కువ అవాక్కు అయ్యేలా చేసింది మీరు వంట చేసిన విషయమే! నేను ఇంటికి వెళ్లి ప్రస్తావించాలని అనుకుంటున్నా'' అని చెప్పారు. అప్పుడు అసలు విషయం బయట పెట్టారు త్రివిక్రమ్. 

''ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నా ప్రస్తావన ఎలా ఉంటుందని నేను ఆలోచిస్తున్నా. ఎందుకు అంటే... ఒకసారి మా ఇంట్లో గ్యాస్ స్టవ్ హై లో ఉంది. మా ఆవిడ తగ్గించమని అడిగింది. నేను కిచెన్‌లోకి వెళ్ళి 'క్లాక్ వైజ్ ఆ? యాంటీ క్లాక్ వైజ్ ఆ?' అని అడిగా.  మా ఆవిడ అప్పటి నుంచి వంటింట్లోకి రావద్దని చెప్పింది. 'నువ్వు ఇక్కడ కూడా ఫిజిక్స్ వాడితే ఎలాగ? కుడి వైపా? ఎడమ వైపా? అని అడిగారా బాబు' అంది. అప్పటి నుంచి ఇంట్లో ఎవరూ నన్ను పిలవరు'' అని త్రివిక్రమ్ వివరించారు. అదీ సంగతి. 

Also Read : మళ్ళీ తల్లి కానున్న సింగర్ సునీత - ఆవిడ ఏం చెప్పారో తెలుసా?

ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మాణంలో 'సార్' సినిమా రూపొందింది. ఇది తమిళంలో 'వాతి'గా విడుదల కానుంది. ఫిబ్రవరి 17న (శుక్రవారం, రేపే) ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు 'తొలిప్రేమ', 'మిస్టర్ మజ్ను', 'రంగ్ దే' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇందులో సంయుక్తా మీనన్ హీరోయిన్. 

Also Read : ప్రేమికుల రోజున స్టార్ హీరోయిన్లు ఎక్కడ ఉన్నారు? ఎవరితో ఉన్నారంటే? 

Published at : 16 Feb 2023 09:36 AM (IST) Tags: Trivikram Sai Soujanya Dhanush Sir Movie Review Trivikram On Wife

సంబంధిత కథనాలు

Sobhita On Samantha Wedding : శోభిత చేతుల మీదుగా సమంత పెళ్లి - గ్రాండ్‌గా మెహందీ ఫంక్షన్

Sobhita On Samantha Wedding : శోభిత చేతుల మీదుగా సమంత పెళ్లి - గ్రాండ్‌గా మెహందీ ఫంక్షన్

Naveen Polishetty New Movie : అనుష్క తర్వాత మరో శెట్టితో నవీన్ పోలిశెట్టి - కొత్త సినిమాలో హీరోయిన్స్ ఫిక్స్

Naveen Polishetty New Movie : అనుష్క తర్వాత మరో శెట్టితో నవీన్ పోలిశెట్టి - కొత్త సినిమాలో హీరోయిన్స్ ఫిక్స్

Anausya On Aunty Comments: ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు – అనసూయ

Anausya On Aunty Comments: ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు – అనసూయ

NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్

NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్

Dasara Movie Controversy : వివాదంలో ‘దసరా’ మూవీ, ఆ సీన్లు తొలగించాలంటూ అంగన్ వాడీల ఆందోళన

Dasara Movie Controversy : వివాదంలో ‘దసరా’ మూవీ, ఆ సీన్లు తొలగించాలంటూ అంగన్ వాడీల ఆందోళన

టాప్ స్టోరీస్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

SRH Vs RR: టాస్ రైజర్స్‌దే - బౌలింగ్‌కు మొగ్గు చూపిన భువీ!

SRH Vs RR: టాస్ రైజర్స్‌దే - బౌలింగ్‌కు మొగ్గు చూపిన భువీ!

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం