అన్వేషించండి

Pan India Movies: మనదే ఇదంతా - నార్త్‌లో పాన్ ఇండియా సినిమాల హవా, థియేట్రికల్ రైట్స్.. సరికొత్త రికార్డ్స్

Pan India Movies: టాలీవుడ్ నుండి పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాలకు నార్త్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అందుకే ఈ చిత్రాలన్నీ అక్కడ థియేట్రికల్ రైట్స్ విషయంలో రికార్డులు సృష్టిస్తున్నాయి.

North India Theatrical Rights For Pan India Movies: ప్రస్తుతం నార్త్ ఇండియాలో తెలుగు సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఒకప్పుడు తెలుగు సినిమాలు.. హిందీలో డబ్బింగ్ అయ్యి ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మాత్రమే వాటిని చూసేవారు బాలీవుడ్ ప్రేక్షకులు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. స్ట్రెయిట్ హిందీ సినిమా కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారో.. తెలుగు చిత్రాలను థియేటర్లలో చూడడానికి కూడా అదే విధంగా ఎదురుచూడడం మొదలుపెట్టారు. అందుకే ప్రస్తుతం టాలీవుడ్ నుండి లైన్‌లో ఉన్న ప్యాన్ ఇండియా సినిమాల అన్నింటికి నార్త్ ఇండియాలో థియేట్రికల్ రైట్స్ కోసం విపరీతమైన పోటీ పెరిగిపోయింది.

బాలీవుడ్ స్టార్లకు సమానంగా..

తాజాగా సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’ థియేట్రికల్ రైట్స్ కోసం రూ.1000 కోట్లు ఖర్చు పెట్టారని వార్తలు వినిపిస్తుండగా.. మిగతా సినిమాల థియేట్రికల్ రైట్స్ కూడా దాదాపుగా ఇదే రేంజ్‌లో అమ్ముడుపోయాయి. మిగిలిన చిత్రాలతో పోలిస్తే.. నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ విషయంలో ‘పుష్ప 2’నే రికార్డ్ ప్రైజ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే అడ్వాన్స్ కింద రూ.200 కోట్లను అందుకున్నారు ‘పుష్ప 2’ మేకర్స్. దీన్ని బట్టి చూస్తుంటే బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ సినిమాలకు ఏ రేంజ్‌లో హైప్ ఉందో.. అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప 2’ కూడా అదే రేంజ్‌లో హైప్ క్రియేట్ అయ్యిందని అర్థమవుతోంది.

వెనక్కి తగ్గిన ‘కల్కి’..

‘పుష్ప 2’ తర్వాత రికార్డ్ స్థాయి అడ్వాన్స్ దక్కించుకున్న మూవీ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి’. ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ విషయంలో ‘కల్కి’కి రెండో స్థానం దక్కింది. ఇప్పటికే ఈ సినిమా నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్‌లో భాగంగా మేకర్స్‌కు రూ.100 కోట్ల అడ్వాన్స్ దక్కినట్టు సమాచారం. ‘పుష్ప 2’, ‘కల్కి’ తర్వాత టాప్ 3 స్థానాన్ని ‘గేమ్ ఛేంజర్’ దక్కించుకుంది. ఇప్పటికీ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ గురించి ఎలాంటి అప్డేట్ లేకపోయినా.. అప్పుడే నార్త్ ఇండియాలో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ కోసం పోటీ మొదలయిపోయింది.

చివరి స్థానంలో ‘ఇండియన్ 2’..

శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’కు ఇప్పటికే నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్‌లో భాగంగా రూ.75 కోట్లు అడ్వాన్స్‌గా అందినట్టు తెలుస్తోంది. ‘గేమ్ ఛేంజర్’ తర్వాత స్థానంలో ఎన్‌టీఆర్ ‘దేవర’ ఉంది. వరుసగా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ అవుతూ ఉండడం ‘దేవర’కు నష్టాన్ని కలిగిస్తోంది. అందుకే నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ లిస్ట్‌లోని తెలుగు సినిమాల్లో ‘దేవర’కే చివరి స్థానం దక్కింది. ఇక ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌లో భాగంగా.. మేకర్స్ రూ.45 కోట్లు అడ్వాన్స్ అందుకున్నారు. ఇక నార్త్ ఇండియాలో తెలుగు సినిమాలకు ఉన్నంత డిమాండ్ తమిళ చిత్రాలకు లేదని అనిపిస్తోంది. దీనికి ‘ఇండియన్ 2’ కేవలం రూ.30 కోట్లే థియేట్రికల్ రైట్స్ అడ్వాన్స్ అందుకోవడమే ఉదాహరణ.

Also Read: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP vs Janasena: టీడీపీ, జనసేన నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు - చంద్రబాబు, పవన్ ఏం చేస్తున్నారో!
టీడీపీ, జనసేన నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు - చంద్రబాబు, పవన్ ఏం చేస్తున్నారో!
Telangana Politics: రేవంత్‌ను  మార్చేస్తారా ?  బీజేపీ ఎల్పీ నేతకే ఆ సీక్రెట్ ఎలా తెలిసింది ?
రేవంత్‌ను మార్చేస్తారా ? బీజేపీ ఎల్పీ నేతకే ఆ సీక్రెట్ ఎలా తెలిసింది ?
RedBook Third Chapter: రెడ్‌బుక్ పేరుతో లోకేష్ మైండ్ గేమ్ ఆడుతున్నారా ? మూడో చాప్టర్ సరే రెండు చాప్టర్లలో ఎవరిని శిక్షించారు ?
రెడ్‌బుక్ పేరుతో లోకేష్ మైండ్ గేమ్ ఆడుతున్నారా ? మూడో చాప్టర్ సరే రెండు చాప్టర్లలో ఎవరిని శిక్షించారు ?
TamilNadu Politics: విజయ్‌తో పొత్తు కోసం అన్నాడీఎంకే రెడీ - కొత్త  పొలిటికల్ స్టార్ నిర్ణయం ఎలా ఉంటుంది?
విజయ్‌తో పొత్తు కోసం అన్నాడీఎంకే రెడీ - కొత్త పొలిటికల్ స్టార్ నిర్ణయం ఎలా ఉంటుంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP DesamEngland Players Not Retained by IPL Franchises | ఇంగ్లండ్ ప్లేయర్లకు ఫ్రాంచైజీలు ఝలక్ | ABP Desamఇజ్రాయేల్‌లో భారీ సైరన్‌ల మోత, వెంటనే పేలుళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP vs Janasena: టీడీపీ, జనసేన నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు - చంద్రబాబు, పవన్ ఏం చేస్తున్నారో!
టీడీపీ, జనసేన నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు - చంద్రబాబు, పవన్ ఏం చేస్తున్నారో!
Telangana Politics: రేవంత్‌ను  మార్చేస్తారా ?  బీజేపీ ఎల్పీ నేతకే ఆ సీక్రెట్ ఎలా తెలిసింది ?
రేవంత్‌ను మార్చేస్తారా ? బీజేపీ ఎల్పీ నేతకే ఆ సీక్రెట్ ఎలా తెలిసింది ?
RedBook Third Chapter: రెడ్‌బుక్ పేరుతో లోకేష్ మైండ్ గేమ్ ఆడుతున్నారా ? మూడో చాప్టర్ సరే రెండు చాప్టర్లలో ఎవరిని శిక్షించారు ?
రెడ్‌బుక్ పేరుతో లోకేష్ మైండ్ గేమ్ ఆడుతున్నారా ? మూడో చాప్టర్ సరే రెండు చాప్టర్లలో ఎవరిని శిక్షించారు ?
TamilNadu Politics: విజయ్‌తో పొత్తు కోసం అన్నాడీఎంకే రెడీ - కొత్త  పొలిటికల్ స్టార్ నిర్ణయం ఎలా ఉంటుంది?
విజయ్‌తో పొత్తు కోసం అన్నాడీఎంకే రెడీ - కొత్త పొలిటికల్ స్టార్ నిర్ణయం ఎలా ఉంటుంది?
Traffic Diverts For Sadar Sammelan: సదర్ ఉత్సవాలకు సిద్ధమైన హైదరాబాద్‌-  ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు
సదర్ ఉత్సవాలకు సిద్ధమైన హైదరాబాద్‌- ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు
Gangavva: చాలు బిగ్ బాస్, ఇక చాలు... గంగవ్వను పంపేయడం బెటర్ - జనాల అభిప్రాయం మీకు అర్థమవుతోందా?
చాలు బిగ్ బాస్, ఇక చాలు... గంగవ్వను పంపేయడం బెటర్ - జనాల అభిప్రాయం మీకు అర్థమవుతోందా?
TDP: ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
Srisailam Tour Package: కొండల మధ్య కృష్ణమ్మ ప్రవాహంలో లాంచీ ప్ర‌యాణం షురూ - టికెట్ల ధరలు ఇలా
కొండల మధ్య కృష్ణమ్మ ప్రవాహంలో లాంచీ ప్ర‌యాణం షురూ - టికెట్ల ధరలు ఇలా
Embed widget