అన్వేషించండి

'ఆదిపురుష్' మేకర్స్ కు మరో తలనొప్పి.. త్వరలోనే ఓటీటీలో రిలీజ్ చేస్తారా..?

ప్రభాస్, కృతిసనన్ నటించిన 'ఆదిపురుష్' కు మరో తలనొప్పి మొదలైంది. ఈ మూవీ హెచ్డీ వెర్షన్ ఓటీటీలో రిలీజ్ కంటే ముందుగానే కావండంతో.. మేకర్స్ షాక్ కు గురవుతున్నారు. దీంతో త్వరలోనే ఓటీటీలోకి వస్తుందంటున్నారు.

Adipurush HD Version Leak : ఓం రౌత్ దర్శకత్వం వహించిన 'ఆదిపురుష్' భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఈ చిత్రానికి నెగెటివ్ రివ్యూస్ రావడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. డైలాగులు, ఇతర సన్నివేశాలను తీసివేయాలంటూ మేకర్స్‌పై ఒత్తిడి నెలకొంది. తాజాగా వారికి మరో తలనొప్పి వచ్చి పడింది. అసలే కలెక్షన్స్ లేక విలవిల్లాడుతున్న నిర్మాతలను పైరసీ భయపెడుతోంది. ఓటీటీలోకి రిలీజ్ అవ్వడానికి ముందే.. HD (హై డెఫినిషన్) వెర్షన్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది. దీంతో ఇంటర్నెట్‌లో ఈ అంశంపై మీమ్స్, ట్వీట్‌లు తెగ వైరల్ అవుతున్నాయి.

జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజైన 'ఆదిపురుష్' పేలవమైన విజువల్ ఎఫెక్ట్స్, డైలాగులు, పాత్రలపై ట్రోలింగ్ జరిగింది. భారీ అంచనాలతో విడుదల కావడం వల్ల ఓపెనింగ్స్ బాగున్నాయి. తొలి రోజే రూ.140 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది. మూడు రోజుల పాటు బాక్సాఫీస్ ను ఏలింది. కానీ అంతలోనే మూవీకి నెగటివ్ టాక్ రావడంతో నాలుగో రోజు నుంచి మూవీ డౌన్‌ఫాల్ మొదలైంది. చివరికి బ్రేక్ ఈవెన్ సాధించడానికి కూడా ఈ మూవీ నానా తంటాలు పడాల్సి వచ్చింది. రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన మూవీ.. ప్రీరిలీజ్ బిజినెస్ ప్రకారం రూ.282 కోట్లను బ్రేక్ ఈవెన్ ను సాధించాలి. కానీ 'ఆదిపురుష్' రిలీజైన 12 రోజుల తర్వాత కూడా దాన్నిఅందుకోలేకపోయింది.

వాస్తవంగా 'ఆదిపురుష్'ను ఆగస్ట్ వరకు ఓటీటీలోకి తీసుకురాకూడదని మేకర్స్ అనుకున్నారు. కానీ ఇప్పుడీ లీక్ తో ముందుగానే అంటే జూలై నెలలో సినిమాను డిజిటల్ ప్లాట్‌ఫామ్ పైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు. కాగా దీనిపై త్వరలోనే మేకర్స్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

'ఆదిపురుష్' లో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించారు. అయితే ఈ సినిమా రామాయణాన్ని దారుణంగా అవమానించిందని, అపహాస్యం చేసిందని మూవీపై విమర్శలు ఉన్నాయి. పాత్రలను చూపించే విధానంలోనూ మేకర్స్ ఎన్నో వివాదాలను ఎదుర్కోవల్సి వచ్చింది. చివరకు కోర్టులు కూడా ఈ చిత్ర నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. 

టెలివిజన్ ధారావాహిక 'రామాయణం'లో హనుమంతుడిగా ప్రసిద్ధి చెందిన దివంగత నటుడు దారా సింగ్ కుమారుడు విందు దారా సింగ్ 'ఆదిపురుష్' లోని పాత్రలపై స్పందించారు. థోర్, మార్వెల్ వంటి సినిమాలను చూసి యువతరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ సినిమా చేశారు కావచ్చని ఆయన వ్యాఖ్యానించారు. "రామాయణం తీయాలనే ఆలోచనలో ఉంటే కథకు కట్టుబడి ఉండాల్సింది. మందు తాగి వచ్చారో.. ఏం చేశారో తెలియదు. ఏం ఆలోచించి తీశారో. ఇంత భారీ బడ్జెట్‌తో ఇంత అద్భుతమైన సినిమా తీసే గోల్డెన్ ఛాన్స్ వస్తే దాన్ని నాశనం చేశారు. మేకర్స్ ఈ కథలో డ్రాగన్‌లను పరిచయం చేశారు. తమాషా పనులు చేస్తూ కథతో ఆడుకున్నారు. ఇది తీవ్రంగా నిరాశపరిచింది" అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

Read Also : Jailer: తమన్నా మూడ్‌తో రానున్న ‘కావాలా’ - ఫన్నీగా రజినీకాంత్ ‘జైలర్’ ఫస్ట్ సింగిల్ ప్రోమో!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget