Adipurush Update : వైష్ణో దేవి ఆశీస్సులు తీసుకున్న 'ఆదిపురుష్' దర్శక, నిర్మాతలు - ప్రభాస్ సినిమాకు నయా ప్లాన్
Adipurush Release Date : ప్రభాస్ కథానాయకుడిగా నటించిన 'ఆదిపురుష్' దర్శక, నిర్మాతలు ఓం రౌత్, భూషణ్ కుమార్ వైష్ణో దేవి ఆలయానికి వెళ్లారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.
పాన్ ఇండియా సినిమా అంటే ప్రమోషన్ ఏ స్థాయిలో ఉండాలి? ఇండియా అంతా సినిమా పేరు వినబడాలి, ఎక్కడ చూసిన ఆ సినిమా స్టార్స్ కనపడాలి. సినిమా గురించి చెబుతూ రావాలి. అందులోనూ 'బాహుబలి', 'సాహో' సినిమాలతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్ సినిమా మరో మూడు నెలల్లో వస్తుందంటే ఆ హడావిడి ఎలా ఉండాలి? పైగా, శ్రీరాముడి మీద తీసిన సినిమా అంటే ఎలా ఉండాలి? ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేయడం లేదేంటి? అని రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళకు ఓ గుడ్ న్యూస్!
వైష్ణో దేవి ఆశీస్సులతో...
'ఆదిపురుష్' దర్శకుడు ఓం రౌత్, టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్... ఇద్దరూ వైష్ణో దేవి (Vaishno Devi Temple) ఆలయానికి వెళ్ళారు. అక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. శుభప్రదమైన ఆరంభానికి శ్రీకారం చుడుతున్నామని పేర్కొన్నారు.
జూన్ 16న థియేటర్లలోకి 'ఆదిపురుష్'
'ఆదిపురుష్' సినిమా జూన్ 16న థియేటర్లలో విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. శ్రీరాముడి అంటే హిందువులలో ఉన్న భక్తి, ప్రభాస్ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని భారీ సంఖ్యలో షోస్ వేయాలని ప్లాన్ చేస్తున్నారు. అదీ సంగతి!
Also Read : ఉపాసన బేబీ బంప్ అదిగో - ఇంకా ఎనీ డౌట్స్?
View this post on Instagram
వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేసేలా...
వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో షోలు వేసేలా 'ఆదిపురుష్' టీమ్ ప్లాన్ చేసిందట ఇండియా మొత్తం మీద సుమారు 9,500 అని చెప్పాలి. అందులో ఆరున్నర వేలు సింగిల్ స్క్రీన్ థియేటర్లు! మిగతావి మల్టీప్లెక్స్ స్క్రీన్‌లు. వాటిలో వీలైనన్ని స్క్రీన్లలో 'ఆదిపురుష్' సినిమా ప్రదర్శించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని వినికిడి.
ఒక్కో థియేటర్‌లో రోజుకు నాలుగు ఆటలు ప్రదరిస్తారు. ఐదు షోలు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో... రోజుకు 40,000 షోస్ వేయొచ్చు. వెయ్యి , పదిహేను వందల థియేటర్లు వేరే సినిమాలకు వదిలేసినా... ఎనిమిది వేల థియేటర్లలో 'ఆదిపురుష్' విడుదల చేస్తే? కొన్ని థియేటర్లలో నాలుగు షోలు, కొన్ని థియేటర్లలో ఐదు షోలు వేస్తే? రోజుకు సుమారు 35,000 కంటే ఎక్కువ షోస్ పడే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ ఇన్‌సైడ్ టాక్.
రాముడి కథ కావడంతో బీజేపీ అండ...
రామాయణం ఆధారంగా 'ఆదిపురుష్' రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభు శ్రీరామ్ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. హిందూ సంస్కృతి, శ్రీరాముని గొప్పతనం గురించి వివరించే సినిమా కావడంతో పరోక్షంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అండ కూడా 'ఆదిపురుష్' కూడా ఉండవచ్చని అంచనా. 'ది కశ్మీర్ ఫైల్స్', 'కార్తికేయ 2' సినిమాలకు ఉత్తరాదిలో ఆర్ఎస్ఎస్ నుంచి అండ దండలు లభించాయని టాక్. శ్రీరాముని సినిమా కావడంతో ప్రభాస్‌కు ఇంకొంచెం ఎక్కువ సపోర్ట్ లభించవచ్చు. పైగా... హిందూ సంస్కృతి, దేవుళ్ళ గురించి చెప్పే సినిమాలకు ఉత్తరాది ప్రేక్షకుల నుంచి ఆదరణ బావుంటోంది.
'ఆదిపురుష్'లో ప్రభాస్ సరసన సీత పాత్రలో కృతి సనన్ (Kriti Sanon), లక్ష్మణుడిగా సన్నీ సింగ్ (Sunny Singh), లంకేశ్ పాత్రలో హిందీ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) నటించారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. సుమారు 500 కోట్ల రూపాయల భారీ నిర్మాణ వ్యయంతో సినిమా రూపొందుతోంది.
Also Read : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా