అన్వేషించండి

Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా 

NTR 30 Movie Update : యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా సినిమాలో నటీనటులకు సంబంధించి ఈ రోజు కీలకమైన అప్ డేట్ ఇచ్చారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులకు ఓ గుడ్ న్యూస్. ప్రస్తుతం కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా ఓ పాన్ ఇండియా సినిమా రూపొందుతోంది. ఈ సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ జోడీగా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కథానాయికగా సందడి చేయనున్నారు. ఆ సంగతి కూడా తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే...

ఎన్టీఆర్ 30కి బ్రాడ్ మినించ్!
ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ ను తీసుకు వచ్చారు. 'ఆక్వా మాన్', 'జస్టిస్ లీగ్', 'బ్రాడ్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్' సినిమాలకు వర్క్ చేసిన బ్రాడ్ మినించ్ NTR 30లో కొన్ని కీలకమైన సన్నివేశాలకు వీఎఫ్ఎక్స్ సూపర్ విజన్ చేస్తారని ఈ రోజు టీమ్ తెలియజేసింది.

నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థపై కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె NTR 30 Movie ని నిర్మిస్తున్నారు. దీనికి యువ సంగీత సంచలన అనిరుధ్  రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కొంత గ్యాప్ తర్వాత తెలుగులో ఆయన సంగీతం అందిస్తున్న చిత్రమిది.

Also Read : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?

View this post on Instagram
 
A post shared by NTR Arts (@ntrartsoffl)

ఎన్టీఆర్ సినిమాకు కెన్నీ బేట్స్!
హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ సూపర్ హిట్ ఫ్రాంఛైజీల్లో ఒకటైన 'మిషన్ ఇంపాజిబుల్', 'ట్రాన్స్‌ఫార్మర్స్', 'రాంబో 3' తదితర హాలీవుడ్ సినిమాలకు పని చేసిన స్టంట్ డైరెక్టర్ కెన్నీ బాట్స్ ఎన్టీఆర్ 30 సినిమాకు పని చేయనున్నారు. తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ 'సాహో' సినిమాకు కూడా ఆయన పని చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల, సినిమాటోగ్రాఫర్ రత్నవేలుతో కెన్నీ బేట్స్ డిస్కస్ చేస్తున్న ఫోటో విడుదల చేశారు. అది చూస్తే... షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ అని తెలుస్తుంది. సినిమాలో మెజారిటీ ఫైట్స్ ఆయనే చేస్తారని ఎన్టీఆర్ 30 బృందం తెలిపింది.  

మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్!
ఎన్టీఆర్ 30 సినిమా ప్రారంభోత్సవంలో కథ, హీరో క్యారెక్టర్ గురించి కొరటాల శివ క్లారిటీగా చెప్పేశారు. స్టోరీ రివీల్ చేసేశారు. ''అనగనగా సముద్ర తీర ప్రాంతం! మనం మర్చిపోయిన భూభాగం! ఆ ప్రాంతంలో మనుషుల కంటే ఎక్కువ మృగాలు ఉంటాయి (మృగాలు లాంటి మనుషులు అన్నమాట). భయం అంటే ఏమిటో తెలియని మృగాలు అవి. దేవుడు అంటే భయం లేదు. చావు అన్నా భయం లేదు. కానీ, ఒక్కటి అంటే భయం. ఆ భయం (ఎన్టీఆర్ పాత్రను ఉద్దేశిస్తూ...) ఏమిటో మీకు తెలిసే ఉంటుంది. ఇదీ కథా నేపథ్యం'' అని కొరటాల చెప్పారు. 

Also Read ఏపీ ఎన్నికలే టార్గెట్‌గా బాలకృష్ణతో బోయపాటి పొలిటికల్ ఫిల్మ్?

మృగాలు వంటి మనుషులను భయపెట్టే మగాడిగా, చాలా శక్తివంతంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ ఉంటుందని పరోక్షంగా ఆయన చెప్పేశారు. ''భయం ఉండాలి, భయం అవసరం కూడా! భయపెట్టడానికి సినిమాలో ప్రధాన పాత్ర (హీరో) ఏ స్థాయికి వెళతాడనేది ఎమోషనల్ రైడ్. ఇది నా బెస్ట్ సినిమా అని ప్రామిస్ చేస్తున్నాను'' అని కొరటాల శివ వివరించారు. ఎన్టీఆర్ తనకు సోదరుడు లాంటి వాడు అని, ఆయనతో రెండోసారి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget