OG Box Office Collections Day 1: 'OG' కోసం రికార్డులు వెయిటింగ్ - వరల్డ్ వైడ్‌గా ఫస్ట్ డే కలెక్షన్స్ కుమ్మేశాయంతే... ఇట్స్ అఫీషియల్
OG Collections: పవన్ కల్యాణ్ 'OG' బాక్సాఫీస్ వద్ద రికార్డుల ఊచకోత సృష్టిస్తోంది. ఫస్ట్ డే ప్రీమియర్లతో పాటు వరల్డ్ వైడ్‌గా రూ.150 కోట్లను దాటి కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

Pawan Kalyan OG First Day Collections In Worldwide: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'OG' బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత ఉంటాయనే దానిపై అటు ఫ్యాన్స్, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. సాధారణంగా పవన్ మూవీకి సంబంధించి కలెక్షన్స్‌పై ఇంతకు ముందు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్ రాలేదు. కానీ 'OG' విషయంలో ఓవర్సీస్‌లో ప్రీమియర్ లెక్కలను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అంచనాల ప్రకారం కలెక్షన్స్ పరంగా రికార్డులు 'ఓజీ' కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
ఫస్ట్ డే ప్రీమియర్స్‌తో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ.154 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'ఇది పవన్ కల్యాణ్ సినిమా. OG ఎరేసెస్ హిస్టరీ.' అంటూ క్యాప్షన్ ఇస్తూనే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక ఇండియావ్యాప్తంగా రూ.91.25 కోట్ల నెట్ వసూళ్లు చేసినట్లు ట్రేడ్ అనలిస్ట్ సాక్నిల్క్ తెలిపింది. ప్రీమియర్ షోలకు రూ.20 కోట్లు రాగా ఫస్ట్ డే షోలకు రూ.70 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ నార్త్ అమెరికాలో కేవలం ప్రీమియర్ షోల్లోనే 3 మిలియన్ డాలర్లకు (రూ.26 కోట్లు) పైగా కలెక్షన్స్ సాధించినట్లు మూవీ టీం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది.
తెలుగులో 69.35 శాతం ఆక్యుపెన్సీ ఉండగా... తమిళ్‌లో 18.36 శాతం, హిందీలో 10.37 శాతం ఆక్యుపెన్సీ నమోదైనట్లు సాక్నిల్క్ పేర్కొంది. ప్రాంతాల వారీగా నైజాం విషయానికొస్తే ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్‌తో దుమ్ము రేపినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏకంగా రూ.24 కోట్ల షేర్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కలు చూస్తుంటే పవన్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ రేంజ్ వసూళ్లు దాటొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీకెండ్స్ వస్తుండడంతో కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram
Also Read: 'OG' సీక్వెల్‌లో అకీరా నందన్ - సుజీత్ రియాక్షన్ ఇదే... నెక్స్ట్ మూవీపై క్లారిటీ ఇచ్చేశారుగా...
'సాహో' ఫేం సుజీత్ దర్శకత్వం వహించిన 'ఓజీ' మూవీలో పవన్ సరసన ప్రియాంక్ మోహన్ హీరోయిన్‌గా నటించారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేయగా... ప్రకాష్ రాజ్, శ్రియారెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ మూవీని నిర్మించారు.
చాలా రోజుల తర్వాత పవన్‌ను గ్యాంగ్ స్టర్ డ్రామాలో చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. పవన్ అభిమానిగా ఆయన్ను సిల్వర్ స్క్రీన్‌పై ఎలా అయితే ఫ్యాన్స్ చూడాలనుకున్నారో అలానే స్టైలిష్, మాస్ లుక్‌లో ప్రెజెంట్ చేశారు సుజీత్. భారీ యాక్షన్ సీక్వెన్స్, మాస్ ఎలివేషన్స్ వేరే లెవల్‌లో ఉండడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. తమన్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. థియేటర్ల వద్దకు జనాలు క్యూ కడుతున్నారు.





















