Jr NTR Injuried: గాయంతోనే 'దేవర' షూటింగ్ - జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదంపై క్లారిటీ ఇచ్చిన టీం
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కి ప్రమాదం జరిగిందంటూ ఒక్కసారి వార్తలు గుప్పుమన్నాయి. నిన్నే దేవర షూటింగ్ పూర్తి చేసుకున్న ఆయనపై ఈ వార్తలు రావడంలో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో..
![Jr NTR Injuried: గాయంతోనే 'దేవర' షూటింగ్ - జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదంపై క్లారిటీ ఇచ్చిన టీం NTR Office Announced Jr NTR Injuries Minor Wrist in Gym now Sustain Jr NTR Injuried: గాయంతోనే 'దేవర' షూటింగ్ - జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదంపై క్లారిటీ ఇచ్చిన టీం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/14/e5ae7396a3bf646320cb5d261e7184fd1723630433899929_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Jr NTR Injured in GYM: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురయ్యారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై ఆయన టీం స్పందించింది. ఈ మేరకు ఎన్టీఆర్ ఆఫీసు ప్రకటన విడుదల చేసింది. "జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల జిమ్ చేస్తుండగా ఆయన ఎడమ చేతి మణికట్టు బెణికింది. అదే గాయంతో ఆయన దేవర పార్ట్ షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన గాయం నుంచి కోలుకుంటున్నారు. రెండు వారాల తర్వాత తిరిగి ఆయన షూటింగ్‌లో పాల్గొంటారు. అప్పటి వరకు దేవర షూటింగ్ నిలిపివేయడం అయ్యింది. త్వరలోనే ఆయన తిరిగి షూటింగ్‌లో పాల్గొంటారు" అంటూ ఆయన టీం ప్రకటనలో పేర్కొంది. దీంతో ఆయన ఫ్యాన్స్ అంతా ఊపిరి పిల్చుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన చేతికి బ్యాండేజ్ ఉన్న ఫోటోను కూడా టీం షేర్ చేసింది.
Have been seeing your enthusiasm about this film from the day it started till today @NarneNithiin…. Looking forward to watching it. Wishing you and the entire team of #AAYmovie all the best for tomorrow's release!
— Jr NTR (@tarak9999) August 14, 2024
కాగా నిన్న రాత్రి ఎన్టీఆర్ దేవరలో పార్ట్ వన్‌లోని చివరి సీన్ షూటింగ్‌ని పూర్తి చేసుకున్నానని చెప్పారు. ఈ మేరకు ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఇంతకు ముందే దేవర పార్ట్ 1 షూటింగ్‌లోని చివరి షాట్‌ను పూర్తి చేసుకున్నాను. దేవర జర్నీ ఒక అద్భుతం అద్భుతమైన టీం, వారి సముద్రమంత ప్రేమను మిస్ అవుతాను. సెప్టెంబర్ 27న శివను ప్రతి ఒక్కరు కలుకునేవరకు వేచి ఉండలేకపోతున్నా" అంటూ అప్‌డేట్ ఇచ్చారు.
కాగా జనతా గ్యారేజ్ వంటి హిట్ మూవీ తర్వాత కొరటాల శివ-జూనియర్ ఎన్టీఆర్‌లు కాంబినేషన్‌లో వస్తున్న దేవర మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. విస్మరణక గురైన తీర ప్రాంతం నేపథ్యంలో యాక్షన్, రివేంజ్ డ్రామాగా దేవరను పాన్ ఇండియా స్థాయిలో తెరెక్కిస్తున్నాడు కొరటాల. ఇందులో ఎన్టీఆర్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె దేవరను నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్‌లు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నట్టు సమాచారం.
ఈ సినిమాను ఎండు పార్టులుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం పోషిస్తున్నట్టు టాక్. దీనిపై అధికారిక ప్రకటన లేదు. కానీ, మూవీ అప్‌డేట్స్ చూస్తుంటే మాత్రమే తారక్ డ్యుయెల్ రోల్లో కనిపించనున్నాడని స్పష్టం అవుతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన రొమాంటిక్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ అందుకుంది. చుట్టమల్లే అంటూ సాగే ఈ పాట జాన్వీ-ఎన్టీఆర్ కెమిస్ట్రీ చాలా బాగా కుదురిందని, వీరిద్దరి జోడి చాలా బాగుందంటూ పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)