అన్వేషించండి

Samantha: ఆ డైరెక్టర్‌తో సమంత రిలేషన్‌లో ఉందా? - నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్‌తో వైరల్‌ అవుతున్న సామ్‌ డేటింగ్‌ రూమర్స్‌!

Samantha Dating Rumours: స్టార్‌ హీరోయిన్‌ సమంత ఆ డైరెక్టర్‌తో డేటింగ్‌లో ఉందంటూ బాలీవుడ్‌ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. నాగ చైతన్య-శోభిత ఎంగేజ్‌మెంట్‌తో సామ్‌ డేటింగ్‌ రూమర్స్‌ బయటకు రావడం గమనార్హం.

Samantha Dating Rumours Goes Viral: నాగ చైతన్య-శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్‌ ఇప్పటికీ చర్చనీయాంశం అవుతుంది. వీరి నిశ్చితార్థం జరిగి వారం అవుతున్న ఇప్పటికీ అంతా వీరి గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక చైతో నిశ్చితార్థం తర్వాత శోభిత హాట్‌టాపిక్‌ అవుతుంది. ఈ దెబ్బతో అంతేకాదు సమంత కూడా వార్తల్లో నిలుస్తుంది. వీరికి సంబంధించిన రీల్స్‌, చైతూ-సమంత పాత వీడియోలు, ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. అయితే ఇప్పుడు సమంతకి సంబంధించిన ఓ షాకింగ్‌ న్యూస్‌ వైరల్‌ అవుతుంది. సమంత ఓ డైరెక్టర్‌ డేటింగ్‌ చేస్తుందంటూ బాలీవుడ్‌ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. 

చై ఎంగేజ్‌మెంట్‌తో వార్తల్లో నిలిచిన సమంత

నిజానికి నాగ చైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్‌ తర్వాత అంతా సమంత పై దృష్టి పెట్టారు. ఆమె నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుందా? మాజీ భర్త పెళ్లిపై ఎలా స్పందిస్తో అని ఆమె రియాక్షన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. అంతేకాదు పోస్ట్స్‌తో అయినా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుందేమో అని అంతా ఆమె సోషల్‌ మీడియా ఖాతాలను ఎప్పటికప్పుడు చెక్‌ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో సామ్‌ మాత్రం చాలా సైలెంట్‌గా ఉంది. విడాకులు తర్వాత ఇన్‌డైరెక్ట్‌ పోస్ట్స్‌తో తన ఆవేదనను పంచుకున్న ఆమె శోభిత-చైల ఎంగేజ్‌మెంట్‌పై ఎలాంటి కామెంట్స్‌ చేయడం లేదు. కానీ, సమంత మాత్రం గత వారంలో రోజులుగా ట్రెండ్‌ అవుతూనే ఉంది. 

సిటాడెల్ డైరెక్టర్ తో డేటింగ్!

ఈ క్రమంలో ఆమె 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్‌ సిరీస్‌ డైరెక్టర్లలో ఒకరైన రాజ్‌ నిడిమోరుతో రిలేషన్‌లో ఉందంటూ వార్తలు రావడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా నిలిచింది. పైగా ఇప్పటికే ఆయనకు పెళ్లై భార్య, పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి ఆయనతో సమంత డేటింగ్‌ రూమర్స్‌ రావడం చర్చనీయాంశం అవుతుంది. బాలీవుడ్‌ కథనాల ప్రకారం.. సమంత మరోసారి ప్రేమలో పడిందంటున్నారు. బాలీవుడ్‌ డైరెక్టర్‌, ఫ్యామిలీ మ్యాన్‌-సిటాడెల్‌ దర్శకుల్లో ఒకరైన రాజ్‌ నిడిమోరుతో ఆమె డేటింగ్‌ చేస్తుందంటూ బి-టౌన్‌లో వరుసగా కథనాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై సమంత స్పందించకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఆయన సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌లో తెరకెక్కించారు. గతంలో సమంత 'ఫ్యామిలీ మ్యాన్‌ 2' సిరీస్‌ తెరకెక్కించారు.

ఇప్పుడు ఆమెతో సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నారు. అంతేకాదు భవిష్యత్తులో నెట్‌ఫ్లిక్స్‌ తో కలిసి 'రక్త్‌ బ్రహ్మాండ్‌' అనే వెబ్‌ సిరీస్‌ ప్రకటించారు. ఇందులో సమంత నటించే అవకాశాలు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే గతంలో సమంత నటించి 'ఫ్యామిలీ మ్యాన్‌ 2' సిరీస్‌ నుంచే చై-సామ్‌కు మనస్పర్థలు వచ్చాయని, వీరి విడాకులు ఇది కారణమనేది అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే వెబ్‌ సిరీస్ తీసిన దర్శకుల్లో ఒకరైన రాజ్‌ నిడిమోరుతో సమంత డేటింగ్‌ పుకార్లు బయటకు రావడం గమనార్హం. దీనిపై సమంత ఎలాంటి క్లారిటీ ఇస్తుంది, ఈ రూమర్లకు ఆమె ఎలాంటి చెక్‌ పెడుతుందో చూడాలి. అయితే ఈ వార్తలను మాత్రం సామ్ ఫ్యాన్స్‌ కొట్టిపారేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సామ్‌ తప్పుడు వార్తలు పచారం చేయడం కరెక్ట్‌ కాదంటూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. 

Also Read: కష్టాల్లో ఉండే స్నేహితుడి కోసం నిలబడే ఏకైక వ్యక్తి అల్లు అర్జున్‌ - నిర్మాత బన్నీవాసు ఎమోషనల్‌ కామెంట్స్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu News: చంద్రబాబును ఆకాశానికెత్తేసిన నార్వే మాజీ మంత్రి - సీఎం రిప్లై ఏంటంటే
చంద్రబాబును ఆకాశానికెత్తేసిన నార్వే మాజీ మంత్రి - సీఎం రిప్లై ఏంటంటే
Poonam Kaur: త్రివిక్రమ్‌పై మా అసోసియేషన్‌కు పూనమ్‌ ఫిర్యాదు - గురూజీని ప్రశ్నించండి... సినీ పెద్దలకు నటి రిక్వెస్ట్‌
త్రివిక్రమ్‌పై మా అసోసియేషన్‌కు పూనమ్ ఫిర్యాదు - గురూజీని ప్రశ్నించండి... సినీ పెద్దలకు నటి రిక్వెస్ట్‌
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామా - లెఫ్టినెంట్ గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పణ
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామా - లెఫ్టినెంట్ గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పణ
Fake News on Minister Birthday : శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ - లోకేష్ వార్నింగ్ - ఏం జరిగిందంటే ?
శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ - లోకేష్ వార్నింగ్ - ఏం జరిగిందంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నిజాం రాజ్యం ఇండియాలో విలీనమయ్యాక ఖాసిం రజ్వీ ఏమయ్యాడు?Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desamసింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu News: చంద్రబాబును ఆకాశానికెత్తేసిన నార్వే మాజీ మంత్రి - సీఎం రిప్లై ఏంటంటే
చంద్రబాబును ఆకాశానికెత్తేసిన నార్వే మాజీ మంత్రి - సీఎం రిప్లై ఏంటంటే
Poonam Kaur: త్రివిక్రమ్‌పై మా అసోసియేషన్‌కు పూనమ్‌ ఫిర్యాదు - గురూజీని ప్రశ్నించండి... సినీ పెద్దలకు నటి రిక్వెస్ట్‌
త్రివిక్రమ్‌పై మా అసోసియేషన్‌కు పూనమ్ ఫిర్యాదు - గురూజీని ప్రశ్నించండి... సినీ పెద్దలకు నటి రిక్వెస్ట్‌
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామా - లెఫ్టినెంట్ గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పణ
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామా - లెఫ్టినెంట్ గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పణ
Fake News on Minister Birthday : శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ - లోకేష్ వార్నింగ్ - ఏం జరిగిందంటే ?
శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ - లోకేష్ వార్నింగ్ - ఏం జరిగిందంటే ?
Viral News: దొంగకు దేహశుద్ధి చేసి పులిహోర తినిపించారు - నల్గొండ జిల్లాలో ఘటన, వైరల్ దృశ్యాలు
దొంగకు దేహశుద్ధి చేసి పులిహోర తినిపించారు - నల్గొండ జిల్లాలో ఘటన, వైరల్ దృశ్యాలు
What is Kejriwal strategy : రాజీనామాతో కేజ్రీవాల్ మరోసారి తప్పిదం చేస్తున్నారా ? రాజకీంగా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారా ?
రాజీనామాతో కేజ్రీవాల్ మరోసారి తప్పిదం చేస్తున్నారా ? రాజకీంగా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారా ?
Devara: దేవర మేనియా - అక్కడ భారీగా మిడ్‌నైట్ బెనిఫిట్‌ షోలకు ప్లాన్‌, టికెట్‌ రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే!
దేవర మేనియా - అక్కడ భారీగా మిడ్‌నైట్ బెనిఫిట్‌ షోలకు ప్లాన్‌, టికెట్‌ రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే!
Telugu News: మేకపాటి విరాళానికి రాజకీయం అడ్డంకి- చంద్రబాబుకు స్పీడ్ పోస్టు- తెలంగాణలో మాత్రం నేరుగా అందజేత!
మేకపాటి విరాళానికి రాజకీయం అడ్డంకి- చంద్రబాబుకు స్పీడ్ పోస్టు- తెలంగాణలో మాత్రం నేరుగా అందజేత!
Embed widget