అన్వేషించండి
Advertisement
National Film Awards: కమల్, రజనీ, చిరు, ఆమిర్ కాదు... నేషనల్ అవార్డు ఎక్కువ సార్లు గెలుచుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
70వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం ఈరోజు రాష్ట్రపతి చేతుల మీదుగా జరగబోతోంది. ఈ సందర్భంగా నేషనల్ అవార్డు చరిత్ర, ఎక్కువ సార్లు అవార్డును గెలుచుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసుకుందాం.
70వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం 2024 అక్టోబర్ 08 మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మొదలైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ ఏడాది పలువురు సినీ ప్రముఖులు వరుసగా ఈ నేషనల్ అవార్డులను అందుకోబోతున్నారు. అయితే అసలు ఈ నేషనల్ అవార్డుల చరిత్ర ఏంటి? ఎందుకు ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నారు? ఎక్కువసార్లు ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్న స్టార్ హీరో, హీరోయిన్ ఎవరు ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
- జాతీయ చలనచిత్ర అవార్డులను 1954 నుండి ప్రదానం చేస్తున్నారు. భారత చలనచిత్ర పరిశ్రమను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 1953 లో మన దేశంలో నిర్మించిన వివిధ భాషల్లోని బెస్ట్ సినిమాలను సెలీకట చేసి, 1954 లో అవార్డులను అందించారు. అయితే అప్పట్లో ఈ పురస్కారాలను 'స్టేట్ అవార్డ్స్ ఫర్ ఫిల్మ్స్' అని పిలిచేవారట.
- అయితే కేంద్ర ప్రభుత్వ ఫిల్మ్ ఫెస్టివల్ ఆర్గనైజేషన్ పర్యవేక్షణలో 1973 నుంచి జాతీయ అవార్డును అందజేస్తున్నారు.
- భారతదేశంలోని ఉత్తమ చిత్రాలకు, ఉత్తమ కళాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ఈ నేషనల్ అవార్డు.
- జాతీయ అవార్డులను మూడు విభాగాలుగా విభజించారు. ఫీచర్ ఫిల్మ్, నాన్-ఫీచర్ ఫిల్మ్, ఫిల్మ్ రైటింగ్ విభాగాలలో పోటీ పడి విన్నర్ గా నిలిచిన ప్రముఖులనే ఈ అవార్డు వరిస్తుంది.
- ఒక్కో కేటగిరీలో 100 చిత్రాలను ఎంపిక చేసి, వాటిలోనూ బెస్ట్ అన్పించే సినిమాలను స్పెషల్ కమిటీ సెలెక్ట్ చేశాక, అనౌన్స్ చేసి, రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను అందజేస్తారు.
- జాతీయ అవార్డు గెలుచుకున్న కళాకారులకు సర్టిఫికేట్, నగదు బహుమతి, పతకాన్ని కూడా అందజేస్తారు.
- బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డు అందుకునే సినిమాలకు ఒక్కో దానికి రూ.2,00,000 నుంచి రూ.3,00,000 లక్షల ప్రైజ్ మనీ ఉంటుంది.
ఫీచర్ ఫిల్మ్ విభాగంలో విన్నర్స్ గా నిలిచిన టాప్ 6 సినిమాలకు గోల్డ్ మెడల్, నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో 2 చిత్రాలకు, అదేవిధంగా ఇతర విభాగాల్లో గెలుపొందిన కళాకారులకు రజత పతకం అందజేస్తారు. - దర్శకుడు సత్యజిత్ రే 6 సార్లు ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకోగా, అదూర్ గోపాలకృష్ణన్ ను 5 సార్లు జాతీయ అవార్డు వరించింది.
- ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ఉత్తమ నటుడిగా అత్యధిక జాతీయ అవార్డును అందుకున్న నటుడిగా చరిత్రను సృష్టించారు. ఆయన ఇప్పటిదాకా 5 సార్లు నేషనల్ అవార్డును గెలుచుకున్నాడు.
- విశ్వనటుడిగా పేరు పొందిన కమల్ హాసన్ తన కెరీర్‌లో ఇప్పటివరకూ మూడుసార్లు జాతీయ పురస్కారాలను తన ఖాతాలో వేసుకున్నారు.
- తెలుగులో ఇప్పటివరకూ ఉత్తమ నటుడి నేషనల్ అవార్డును అందుకున్న స్టార్స్ లిస్ట్ పెద్దగా లేదు. ఆ అవార్డును అందుకున్న ఏకైక నటుడిగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించారు. 'పుష్ప' సినిమాకుగానూ అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడిగా 2023లో ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు.
- ఇక హీరోయిన్లలో షబానా అజ్మీ ఉత్తమ నటిగా 5 సార్లు నేషనల్ అవార్డును అందుకుని, అరుదైన రికార్డును క్రియేట్ చేసింది.
- ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో కంగనా రనౌత్ ఏకంగా 3 సార్లు జాతీయ అవార్డును గెలుచుకున్న హీరోయిన్ గా నిలిచింది.
- అత్యధిక జాతీయ అవార్డులు గెలుచుకున్న సంగీత స్వరకర్తలలో ఏఆర్ రెహమాన్, ఇళయరాజా సమానంగా ఉన్నారు. రెహమాన్ 4 సార్లు, ఇళయరాజా కూడా 4 సార్లు ఈ నేషనల్ అవార్డును అందుకున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
ఎంటర్టైన్మెంట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement