అన్వేషించండి

Tollywood: టాలీవుడ్‌లో ఎవరికి వారే - ఆ నలుగురిపై అందరి వ్యతిరేకత - వారిలోనూ ఐక్యత లేదా?

Movies: టాలీవుడ్ ఐక్యత లేదు. ఆధిపత్య పోరాటం పెరుగుతోంది. ఫలితంగా ఇండస్ట్రీని సమస్యల్లోకి నెట్టుకుంటున్నారు.

No unity in Tollywood: టాలీవుడ్ కు చెందిన సినిమాలు గ్లోబల్ గా సంచలన విజయాలు సాధిస్తున్నాయి కానీ ఇక్కడ పరిశ్రమ మాత్రం కొంత మందిచేతుల్లో నలిగిపోతోంది. ఆ నలుగురు పేరుతో కొంత మంది ఇండస్ట్రీని శాసిస్తున్నారు. పోనీ వారి మధ్య అయినా ఐక్యత ఉందా అంటే అదీ లేదు. ఈ కారణంగా టాలీవుడ్ వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. ప్రభుత్వాల ఆగ్రహానికి గురవుతోంది. 

సినీ పరిశ్రమను గుప్పిట పట్టిన ఆ నలుగురు                                     

టాలీవుడ్ లో చాలా మంది నిర్మాతలు ఉంటారు.కానీ పేరుకే చాలా మంది నిర్మాతలు. వారిలో కొంత మంది సినిమాలు తీస్తారు. చాలా మంది తీయరు. ఇతర సీనియర్ నిర్మాతలు సినిమాలు తీయడం కన్నా.. ఇండస్ట్రీలో ఇతర వ్యాపారాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ధియేటర్లు లీజుకు తీసుకోవడం.  క్యూబ్ , యూఎఫ్‌వో లాంటి వాటికి లైసెన్సులు తీసుకోవడం, ఓటీటీలు రన్ చేయడం సహా చాలా ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. వారే ఇండస్ట్రీని  శాసిస్తున్నారు.  కానీ వారిలో వారే ఆధిపత్య పోరాటం కోసం ప్రయత్నిస్తూ ఉండటంతో మొత్తం వివాదం ప్రారంభమవుతోంది. 

ఆ నలుగురి మధ్య కూడా లేని ఐక్యత                 

ఇప్పుడు టాలీవుడ్ లో సినిమాలు తీసేవాళ్లు, డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్లు, ఎగ్జిబిటర్లు సహా వివిధ రకాల ఆదాయవనరులు ఉన్న చోట్ల కేవలం నలుగురు, ఐదుగురి ముద్రే కనిపిస్తోంది. ఆ కొద్ది మంది కూడా తమలో తాము ఆధిపత్య పోరాటం చేసుకుంటున్నారు. కుట్రలు చేసుకుంటున్నారు. ఒకరి సినిమాలు మరొకరు పైరసీ చేసుకుంటున్నారు. తన గేమ్ ఛేంజర్ మొదటి రోజునే హెచ్ డీ ప్రింట్ బయటకు వచ్చిందని దానికి.. మరో నిర్మాత కారణం కావొచ్చని దిల్ రాజు పరోక్షంగా తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు. అంటే వారి మధ్య కూడా స్పష్టత.. సఖ్యత లేదని అర్థమవుతుంది. 

ఇండస్ట్రీని ఏం చేయాలనుకుంటున్నారు ?                 

ఈ నలుగురిలో కొంత మంది రాజకీయ అవసరాల కోసం ఇతర పార్టీలతో కలుస్తున్నారు. వారి వ్యూహాన్ని అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. భారీగా సినిమాలు రిలీజవుతున్న సమయంలో ధియేటర్ల బంద్ అనే నినాదం తీసుకు రావడం వెనుక  ఆ నలుగురిలో ఓ వ్యక్తి కీలకంగా వ్యవహరించారని..ఆయన ఏపీలో ఓ పార్టీకి సన్నిహితంగా ఉంటారని చెబుతున్నారు. ఈ వ్యవహారాలు మొత్తం వివాదాస్పదమవుతున్నాయి. టాలీవుడ్ లో ఒకరిపై ఒకరు కుట్రలు చేసుకుంటున్నారు. ఒకరి సినిమా ఫ్లాప్ కావడానికి మరొకరు ప్రయత్నిస్తున్నారు. 

రాజకీయ ఎజెండాలను కూడా అమలు చేస్తూండటంతో మొత్తంగా రెండు తెలుగు ప్రభుత్వాలకూ టాలీవుడ్ దూరం అయింది. ఇప్పుడు ఆధిపత్య పోరాటం కూడా బహిరంగంగానే కనిపిస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ ఇక ఏకతాటిపైకి రావడం అసాధ్యంగా కనిపిస్తోంది.  

టాప్ హెడ్ లైన్స్

Anupama Parameswaran : అనుపమకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే - పర్సనల్ లైఫ్ కామెంట్స్‌పై హీరోయిన్ అదితి శంకర్ రియాక్షన్
అనుపమకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే - పర్సనల్ లైఫ్ కామెంట్స్‌పై హీరోయిన్ అదితి శంకర్ రియాక్షన్
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత - ఐసీయూలో ట్రీట్మెంట్
సీనియర్ నటి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత - ఐసీయూలో ట్రీట్మెంట్
Modern Missamma Lyrics - మిస్సమ్మ లిరిక్స్... ట్రెండీగా 'మోడ్రన్ మిస్సమ్మ' టైటిల్ సాంగ్... గోపీసుందర్ ట్యూన్, కిట్టు లిరిక్స్ ఎలా ఉన్నాయంటే?
మిస్సమ్మ లిరిక్స్... ట్రెండీగా 'మోడ్రన్ మిస్సమ్మ' టైటిల్ సాంగ్... గోపీసుందర్ ట్యూన్, కిట్టు లిరిక్స్ ఎలా ఉన్నాయంటే?
Aakali Rajyam OTT : మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Embed widget