Vanda Devullu OTT : ఓటీటీలోకి వంద దేవుళ్లు - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Vanda Devullu OTT Platform : విజయ్ ఆంటోని, బిచ్చగాడు మూవీ కాంబోలో వచ్చిన రీసెంట్ ఫ్యామిలీ డ్రామా వంద దేవుళ్లు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Vijay Antony's Vanda Devullu OTT Release Date : బిచ్చగాడుతో టాలీవుడ్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు కోలీవుడ్ స్టార్ విజయ్ ఆంటోని. ఈ మూవీకి శశి దర్శకత్వం వహించగా... రీసెంట్‌గా అదే కాంబోలో వచ్చిన సినిమా వంద దేవుళ్లు (Vanda Devullu). తమిళ మూవీ 'నూరు సామి'కి డబ్బింగ్ ఇది. జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ ఓటీటీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
'వంద దేవుళ్లు' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ZEE5 సొంతం చేసుకోగా... త్వరలోనే ఓటీటీలోకి రానుంది. విజయ్ ఆంటోని బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. జులై చివరి వారంలో కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో కానీ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. త్వరలోనే అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. ఈ మూవీకి శశి దర్శకత్వం వహించగా... విజయ్ ఆంటోని, శ్వాసిక, అజయ్ దిషాన్, లిజోమోల్ జోసే, శక్తి, కావ్య అనిల్, కరుణాస్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, సర్వంత రామ్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై విజయ్ ఆంటోని, రామాంజనేయులు జువ్వాజి నిర్మించారు. థియేటర్లలో అంతంత మాత్రం రెస్పాన్స్ అందుకున్న సినిమా ఓటీటీలో మంచి రెస్పాన్స్ అందుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు.
స్టోరీ ఏంటంటే?
ఊరిలో ఉండే వాసుకి (శ్వాసిక విజయ్)కి 26 ఏళ్ల వయసులో భర్త మరణిస్తాడు. చిన్న వయసులోనే భర్త చనిపోవడంతో తన పిల్లలకు అన్నీ తానై చూసుకోవాలని అనుకుంటుంది. సొంత కుటుంబం నుంచి కూడా ఆసరా దక్కదు. మగ దిక్కు లేదనే అలుసుతో సమాజంలో నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడుతుంటారు. వంకర బుద్ధి ఉన్న మగాళ్ల చూపు ఆమెపై పడుతుంది. అన్నింటినీ దాటుకుని అవమానాలను పంటి బిగువున పెట్టుకుని తన పిల్లలను పెంచి పెద్ద చేస్తుంది.
ఊరి వారి సూటి పోటి మాటలు భరించలేక పెళ్లి చేసుకోడమే దీనికి పరిష్కారం అని భావించి తన పిల్లలకు ఈ విషయం చెబుతుంది. కొడుకు కోప్పడడంతో ఆ విషయం పక్కన పెట్టేస్తుంది. అయితే, చదువు పూర్తై కంపెనీ పెట్టిన తర్వాత ఆమె పెద్ద కొడుకు వాసుకికి పెళ్లి చేయాలనుకుంటాడు. ఒకప్పుడు పెళ్లంటే కోప్పడిన కొడుకు ఇప్పుడెందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు? కొడుకు నిర్ణయానికి వాసుకు ఎలా రియాక్ట్ అయ్యింది? ఏడుకొండలు (విజయ్ ఆంటోని) సంబంధం ఎవరు తెచ్చారు? వందన (కావ్య అనిల్)తో వాసుకి కొడుకు పెళ్లి చూపుల కథ ఏంటి? వాసుకి పెళ్లంటే ఊరి జనాలు ఏం చేశారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read : Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Before You Go
Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























