విజయ్ జన నాయగన్ మూవీకి సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ ఇచ్చింది. దాదాపు 12 మార్పులు సూచించింది బోర్డు. 3 గంటల 3 నిమిషాల రన్ టైంతో రానుంది.

Published by: Ganesh Guptha

విజయ్ నేతృత్వంలో పొలిటికల్ పార్టీ TVK ప్రస్తావన ఉన్న డైలాగ్ తొలగించి... అంబేడ్కర్ చట్టం అనే డైలాగ్ TVK చట్టంగా మార్చాలి.

ఓ సీన్‌లో పుస్తకం కవర్‌పై ఉన్న అంబేడ్కర్ ఉన్న విజువల్స్‌ను సవరణ చేయాలి. జాతీయ జెండా కింద పడుతున్నట్లు ఉన్న షాట్ డిలీట్ చేయాలి.

సినిమాలో రంగనాథన్, ఓం, ఆపరేషన్ మేలుహా వివరణలో వచ్చే 'న్యూ ఇండియా' అనే పదాన్ని మ్యూట్ చేయాలి.

ఓ సీన్‌లో చిన్నారిని తగలబెడుతున్నట్లుగా ఉన్న విజువల్స్ డిలీట్ చేసి వేరే విజువల్స్ రీప్లేస్ చేయాలి. 'షీలా రాణి' పేరు ఎక్కడ వచ్చినా మార్చాలి.

సద్దాం హుస్సేన్ ఉరి తీతకు సంబంధించి డైలాగ్‌ మ్యూట్ లేదా రీప్లేస్ చేయాలి. అలాగే, కొన్ని సీన్లలో వచ్చే పదాలను మ్యూట్ చేయాలి.

ఇలా దాదాపు 12 కట్స్ సూచించింది సెన్సార్ బోర్డు. దీంతో జన నాయగన్‌లో పొలిటికల్ అంశాలతో మాస్ యాక్షన్ అంశాలు ఉండనున్నట్లు తెలుస్తోంది.

హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన సినిమాలో... మమితా బైజు, పూజా హెగ్డే, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, బాబీ డియోల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన మూవీ సెన్సార్ వివాదాలతో వాయిదా పడింది. ఈలోపే ఆన్ లైన్‌లో లీక్ కావడం మరింత ఆందోళన కలిగించింది.

ఎట్టకేలకు ఈ నెల 24న జన నాయగన్‌ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో దళపతి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.