Savitri Classics : మహానటి సావిత్రి అద్భుతాలకే అద్భుతం - వారికి మరణం ఉండదన్న బ్రహ్మానందం... సావిత్రి క్లాసిక్స్ ఇంగ్లీష్ బుక్ లాంచ్
Savitri Classics English Book : మహానటి సావిత్రి ఈ గడ్డపై జన్మించడం మన అదృష్టమని అన్నారు ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం. సావిత్రి క్లాసిక్స్ ఇంగ్లీష్ బుక్ లాంచింగ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు.

Brahmanandam Launched Savitri Classics Book : సిల్వర్ స్క్రీన్ అలనాటి ధ్రువతార, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు మహానటి సావిత్రి. ఆమె 90వ జయంతి సందర్భంగా సంజయ్ కిషోర్ రచించిన 'సావిత్రి క్లాసిక్స్' (Savitri Classics) ఇంగ్లీష్ పుస్తకాన్ని శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు.
ఈ కార్యక్రమానికి సీనియర్ నటి జయప్రద, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఫేమస్ హాస్యనటుడు బ్రహ్మానందం, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జయప్రద ఈ బుక్ ఆవిష్కరించి, ఫస్ట్ కాపీని రఘురామ కృష్ణంరాజు, బ్రహ్మానందం, ఇతర అతిథులకి అందజేశారు.
'అద్భుతాలకే అద్భుతం'
సావిత్రి ప్రాత:స్మరణీయులు కారని... చిరస్మరణీయులని కొనియాడారు బ్రహ్మానందం. 'దేవుడు పుట్టించిన కారణజన్ముల్లో సావిత్రి గారు ఒకరు. ఎంతోమంది మహానుభావులు జన్మించిన ఈ గడ్డపై సావిత్రి జన్మించడం మన అదృష్ణం. సావిత్రి గారు గంధర్వుల్లాంటి వారు. అలాంటి వారికి మరణం ఉండదు. ఇక్కడ విధి నిర్వహణ అయ్యాక.. ఇంకో ప్లానెట్‌కి వెళ్లి విధిని నిర్వర్తిస్తుంటారు. ఆమెతో నటించే భాగ్యం నాకు దక్కలేదు. సావిత్రి గారిని స్మరించుకోని తెలుగు వారు, తెలుగు జాతి ఉండదు. ఒక్క సెకనులో మూడు రకాల ఎక్స్‌ప్రెషన్స్‌లో ఇచ్చే మహానటి సావిత్రి.
ఆవిడ అద్భుతాలకే అద్భుతం. అలాంటి సావిత్రి గారి మీద బుక్స్ రాస్తున్న కిషోర్ గారికి ధన్యవాదాలు. ఇలాంటి (సంజయ్ కిషోర్) కళా జీవుల వల్లే సావిత్రి వంటి వారు ఏళ్లపాటుగా జీవించి ఉంటున్నారు. తల్లి రుణాన్ని తీర్చుకుంటున్న చాముండేశ్వరి గారి జీవితం చరితార్థం అవుతుంది. ఈ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉంది.' అని అన్నారు.
Also Read : Horror Thriller OTT : రెండు రోజుల్లోనే మూడు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్ - ఎందుకు చూడాలంటే?
'అది నా అదృష్టం'
ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి స్టేజ్‌పై నిలబడగలమని చెప్పారు సీనియర్ నటి జయప్రద. ''సావిత్రి క్లాసిక్స్' ఇంగ్లీష్ ఎడిషన్ బుక్ రిలీజ్ చేయడం నా అదృష్టం. తెలుగు వెర్షెన్‌ని మెగాస్టార్ చిరంజీవి గారు రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ అదృష్టం నాకు దక్కింది. చాముండేశ్వరి గారిని చూస్తే నాకు సావిత్రమ్మ గారే మా ఇంటికి వచ్చినట్టు అనిపించింది. సావిత్రి సినిమాల్ని చూస్తూ నేను పెరిగాను. ఆమె ఒక అద్భుతం.
ఎన్టీఆర్, ఏఎన్నార్‌లాంటి వారితో ధీటుగా నటించారు. అందుకే ఆమెకు మహానటి అని బిరుదునిచ్చారు. 'మిస్సమ్మ', 'నర్తనశాల'లో సావిత్రి చేసిన పాత్రలు చేయాలనే కోరిక ఉండేది. ఈ తరానికి సావిత్రమ్మను పరిచయం చేయాలని ఇంగ్లీష్ ఎడిషన్‌లో పుస్తకాన్ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ మహానటి మన సావిత్రి. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.' అని అన్నారు.
అమ్మ జ్ఞాపకాలు ఎప్పటికీ భద్రపరచాలని సంజయ్ కిశోర్‌ను సంప్రదించినట్లు తెలిపారు సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి. 'తెలుగులో ఈ బుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంగ్లీష్‌లో అనువదిస్తే మరింత మందికి రీచ్ అవుతుందని ఎడిషన్ రిలీజ్ చేస్తున్నాం. అక్కినేని మామయ్య గారి కూతురు సుశీల ఇక్కడకు రావడం ఆనందంగా ఉంది. మన ఫంక్షన్ కదా.. వస్తాను అని తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అన్నారు. బ్రహ్మానందం గారి వద్ద శిష్యరికం చేయాలని నేను అనుకునేదాన్ని. పిలవగానే వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్.' అని అన్నారు.
Also Read : Akhil Akkineni : తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
Before You Go
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
ట్రెండింగ్ వార్తలు






















