అన్వేషించండి

Nivetha Pethuraj: ఆ సినిమాలో విశ్వక్ సేన్ ఉన్నాడని నాకు తెలియదు, సీక్వెల్‌పై క్లారిటీ లేదు - నివేదా పేతురాజ్

Nivetha Pethuraj: టాలీవుడ్‌లో హిట్ పెయిర్స్ అనిపించుకున్న వారిలో నివేదా పేతురాజ్, విశ్వక్ సేన్ కూడా ఒకరు. తాజాగా విశ్వక్‌తో మళ్లీ సినిమా ఎప్పుడు అనే ప్రశ్నకు నివేదా స్పందించింది.

Nivetha Pethuraj About Vishwak Sen: ఒక హీరో, హీరోయిన్ కలిసి ఎక్కువ సినిమాలు చేస్తే వారిద్దరి మధ్య ఏదో ఉందని ప్రేక్షకులు దాదాపుగా ఫిక్స్ అయిపోతారు. వారి ఆఫ్ స్క్రీన్ కలిసి కనిపించినా కనిపించకపోయినా.. ఆన్ స్క్రీన్ వారి కెమిస్ట్రీ బాగుంటే మాత్రం వారిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని రూమర్స్ వైరల్ అయిపోతాయి. టాలీవుడ్‌లో కూడా అలాంటి జంటలు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి నివేదా పేతురాజ్, విశ్వక్ సేన్. నివేదా పేతురాజ్.. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే. అందులో చాలావరకు విశ్వక్ సేన్‌తోనే నటించింది. తాజాగా విశ్వక్‌తో నెక్స్‌ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు అనేది క్లారిటీ ఇచ్చింది నివేదా పేతురాజ్.

నాకు తెలియదు..

విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘పాగల్’, ‘దాస్ కా ధమ్కీ’లో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించింది. అలా వీరు కలిసి నటించిన రెండు సినిమాలు హిట్ అవ్వడంతో వీరికి హిట్ పెయిర్‌గా గుర్తింపు లభించింది. ముఖ్యంగా వీరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఇవి మాత్రమే కాకుండా వీరిద్దరూ ‘బూ’ అనే మూవీలో కూడా నటించారు. కానీ ఆ సినిమాలో వీరు కలిసి చేసే సీన్స్ ఏమీ లేవు. తాజాగా అసలు ఆ మూవీలో విశ్వక్ సేన్ ఉన్నాడనే తనకు తెలియదని షాకింగ్ విషయం బయటపెట్టింది నివేదా. ‘‘బూ సినిమాలో అసలు నేను విశ్వక్ సేన్‌ను చూడలేదు. అంటే మేము కలిసి చేసే సీన్స్ లేవు. అసలైతే తను ఆ సినిమాలో ఉన్నాడని కూడా నాకు తెలియదు’’ అని తెలిపింది.

సీక్వెల్ గురించి తెలియదు..

విశ్వక్ సేన్‌తో తర్వాత మూవీ ఎప్పుడు అనే విషయంపై నివేదా పేతురాజ్ స్పందించింది. మళ్లీ ఎప్పుడు కలిసి నటిస్తామో తెలియదని చెప్పింది. ‘దాస్ కా ధమ్కీ’ సీక్వెల్ గురించి అడగగా.. దాని గురించి తనకు ఏమీ తెలియదని క్లారిటీ ఇచ్చింది. 2023లో విడుదలయిన ‘దాస్ కా ధమ్కీ’లో చివరిగా కలిసి కనిపించారు విశ్వక్, నివేదా. ఆ సినిమాలో నటించడంతో పాటు విశ్వక్ దానిని డైరెక్ట్ చేశాడు కూడా. ఇక ఆ మూవీ చివర్లో దానికి సీక్వెల్ కూడా ఉంటుందనే పాయింట్‌తో ముగించాడు. దీంతో విశ్వక్ సేన్ డైరెక్షన్‌ను ఇష్టపడిన చాలామంది ప్రేక్షకులు.. ఈ సినిమా సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ నివేదాకు మాత్రం ఈ సీక్వెల్ గురించి ఏమీ తెలియదని స్టేట్‌మెంట్ ఇచ్చింది.

అదే చివరి సినిమా..

తెలుగులో ‘దాస్ కా ధమ్కీ’ అనే హీరోయిన్‌గా నివేదా పేతురాజ్ చివరి సినిమా. ఇక తాజాగా తను ‘పరువు’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించింది. ఈ సిరీస్.. జీ5లో విడుదల అవ్వకముందే దీనిపై హైప్ క్రియేట్ చేయడం కోసం టీమ్ అంతా చాలా ప్రమోషన్స్ చేసింది. పైగా ఈ సిరీస్ ట్రైలర్ కూడా ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే ‘పరువు’ విడుదలయిన కొన్ని గంటల్లోనే దీనిని పూర్తిగా చూసిన ప్రేక్షకులు కూడా ఉన్నారు. ఇందులో పల్లవి పాత్రలో నివేదా యాక్టింగ్ చాలా బాగుందని వారు ప్రశంసిస్తున్నారు. ఇందులో నివేదా పేతురాజ్‌తో పాటు నరేశ్ అగస్త్య లీడ్ రోల్‌లో నటించాడు. ఇది కాకుండా నివేదా అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌పై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.

Also Read: చిక్కుల్లో రకుల్ ప్రీత్ సింగ్ - ఉద్యోగుల తొలగింపు, అమ్మకానికి ఆఫీస్.. అసలు ఏమైంది?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Embed widget