ట్రెడీషినల్ వేర్ ధరించినప్పుడు ఎలాంటి హెయిర్ స్టైల్స్ బాగుంటాయో ఈ నివేదా పేతురాజ్ ఫోటోలు చూస్తే అర్థమయిపోతుంది. లూజ్ హెయిర్ లుక్ అనేది డ్రెస్సులకు మాత్రమే కాదు.. చీరలకు కూడా సెట్ అయిపోతుంది. లెహెంగా, చీరలు ధరించినప్పుడు పోనీటెయిల్ వేసుకుంటే స్టైలిష్ టచ్ యాడ్ అవుతుంది. సింపుల్ లుక్ కావాలంటే ఇలా చిన్న క్లిప్ పెట్టి వదిలేసినా సరిపోతుంది. చీరపై కొప్పు అనేది ఎప్పటికీ ఔట్‌డేటెడ్ కాదు. ఇంక దానికి మల్లెపూలు పెడితే ఆ లుక్‌కు వచ్చే అందమే వేరు. లెహెంగాపై వాలు జడా, పువ్వులు.. ఎప్పటికీ బోర్ కొట్టని కాంబినేషన్. చాలామంది అమ్మాయిలు ఇష్టపడే హెయిర్ స్టైల్‌లో ఇది కూడా ఒకటి. ట్రెడీషినల్ వేర్‌పై ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. పట్టుచీరపై ఇలాంటి హెయిర్ స్టైల్ స్టైలిష్ లుక్‌ను యాడ్ చేస్తుంది. లంగా ఓణిపై జడ వేసి పువ్వులు పెడితే చాలు.. ఏ అమ్మాయిలో అయినా తెలుగుదనం ఉట్టిపడుతుంది. All Images Credit: Nivetha Pethuraj/Instagram