అన్వేషించండి

Nikhil Siddhartha: అలా చేయకపోతే వరుణ్ సందేశ్‌ను కొడతా, నా కొడుకు పేరు అదే - ‘నింద’ ప్రెస్ మీట్‌లో హీరో నిఖిల్

Nikhil Siddhartha: తన ఫ్రెండ్ అయిన వరుణ్ సందేశ్‌ను సపోర్ట్ చేయడానికి హీరో నిఖిల్ ముందుకొచ్చాడు. తన అప్‌కమింగ్ ‘నింద’ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న నిఖిల్.. అక్కడే తన కొడుకు పేరును బయటపెట్టాడు.

Nikhil Siddhartha Reveals Son Name: శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ‘హ్యాపీ డేస్’ సినిమాతో ఎంతోమంది నటీనటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అందులో కొందరు మాత్రమే ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తున్నారు. మరికొందరు మాత్రం ఇంకా సక్సెస్ కోసం కష్టపడుతున్నారు. అలాంటి వారిలో వరుణ్ సందేశ్ కూడా ఒకడు. అందుకే వరుణ్ సందేశ్ అప్‌కమింగ్ మూవీ ‘నింద’ను ప్రమోట్ చేయడానికి హీరో నిఖిల్ ముందుకొచ్చాడు. తాజాగా జరిగిన ఈ మూవీ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నాడు. ఇందులో ‘నింద’ గురించి గొప్పగా మాట్లాడుతూ.. స్టేజ్‌పైనే మొదటిసారి తన కొడుకు పేరును రివీల్ చేశాడు నిఖిల్.

క్లోజ్ ఫ్రెండ్..

‘‘నింద అనే సినిమాను ఈరోజు వాళ్లు మనకు అందించారు. ఇది ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనది. జూన్ 21న ఈ సినిమా రిలీజ్ అవుతుందని అందరికీ తెలిసేలా చేయాల్సిన బాధ్యత మనది. సోషల్ మీడియాలో ఏదైనా చేసి నింద మూవీ 21న విడుదల అవుతుందని అందరికీ తెలిసేలా చేయండి. వరుణ్ సందేశ్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని మీ అందరికీ తెలుసు. హీరో అవ్వడం అనేది చాలా పెద్ద విషయం. వరుణ్ సందేశ్ చాలా సినిమాల్లో హీరో. తను అందుకున్న సక్సెస్‌కు తనను అభినందించాలి అనుకుంటున్నాను. సక్సెస్ అనేది వస్తుంది, పోతుంది’’ అంటూ ‘నింద’ను ప్రమోట్ చేయమని కోరాడు నిఖిల్.

నిన్ను కొడతాను..

‘‘నా కెరీర్‌లో స్వామిరారా, కార్తికేయ సినిమాలు ఎలా వచ్చాయో.. అలాగే నింద అనే సినిమా వరుణ్ సందేశ్ కెరీర్‌లో మైల్‌స్టోల్‌గా మిగిలిపోతుంది. నాకు కథ తెలుసు, నేను చూశాను. ఒక సినిమాను ప్రజెంట్ చేయడం చాలా కష్టం. స్వామిరారా, కార్తికేయ అనేవి నా క్రెడిట్స్ కాదు. అలాగే నింద సినిమా కూడా దర్శకుడు రాజేష్ జగన్నాథం క్రెడిట్. ఈ మూవీని చూసి దీని గురించి ఏడాది పాటు మాట్లాడుకుంటారు’’ అంటూ ‘నింద’ గురించి గొప్పగా మాట్లాడాడు నిఖిల్. అంతే కాకుండా ఈ సినిమాను ప్రమోట్ చేయకపోతే నిన్ను కొడతాను అంటూ వరుణ్‌కు వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఒక యాక్టర్ కెరీర్‌లో సక్సెస్ దొరకడం అనేది ఎడారిలో వాటర్ బాటిల్ దొరికినట్టే అంటూ ఫన్నీగా ఉదాహరణ చెప్పాడు. కొన్ని సినిమాలు చూస్తే క్లైమాక్స్ తెలిసిపోతుంది, కానీ ‘నింద’ క్లైమాక్స్ తనకు కూడా తెలియదని అన్నాడు.

బేబీ కావాలి..

‘‘మీరంతా జూన్ 21న థియేటర్లకు వచ్చి సినిమాను ప్రోత్సహించాలి. తర్వాత ప్రభాస్ భాయ్ సినిమా కూడా ఉంది. నింద మాత్రం వరుణ్ సందేశ్‌కు కమ్ బ్యాక్ అవుతుంది’’ అని ‘నింద’ సక్సెస్‌పై నమ్మకం వ్యక్తం చేశాడు నిఖిల్. ఈ సినిమాను ఫస్ట్ డే చూస్తానని మాటిచ్చాడు. ‘స్వయంభు’ అప్డేట్ గురించి అడగగా.. 5000 గ్రాఫిక్ షాట్స్ ఉన్నాయని బయటపెట్టాడు. వితికా, వరుణ్ సందేశ్ గురించి చెప్తూ.. తను చూసిన అందమైన కపుల్స్‌లో వారు కూడా ఒకరు అని అన్నాడు. ‘‘వాళ్లెప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉంటూ ఒక బేబీని కూడా మాకు ఇవ్వాలి అని కోరుకుంటున్నాను’’ అంటూ నవ్వాడు. అప్పుడే తన కొడుకు పేరు ధీరా సిద్ధార్థ్ అని కూడా రివీల్ చేశాడు నిఖిల్. ఇప్పటివరకు తన కొడుకు పేరును బయటపెట్టని నిఖిల్.. ‘నింద’ ప్రెస్ మీట్‌లో ఈ పేరును అనౌన్స్ చేయడం విశేషం.

Also Read: విశ్వక్ సేన్ చేసిన ఆ పనికి ఇంప్రెస్ అవుతున్న ఫ్యాన్స్ - రియల్ హీరో అంటూ కామెంట్స్

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Embed widget