అన్వేషించండి

Vishwak Sen: విశ్వక్ సేన్ చేసిన ఆ పనికి ఇంప్రెస్ అవుతున్న ఫ్యాన్స్ - రియల్ హీరో అంటూ కామెంట్స్

Vishwak Sen: యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా చేసిన పనికి ఫ్యాన్స్ ఇంప్రెస్ అవుతున్నారు. తన సోషల్ మీడియా ద్వారా దీని గురించి బయటపెట్టిన విశ్వక్‌ను ప్రశంసిస్తున్నారు.

Vishwak Sen: ప్రేక్షకులకు, తమ ఫ్యాన్స్‌కు ఆదర్శంగా నిలవడం కోసం సినీ సెలబ్రిటీలు కొన్ని పనులు చేస్తుంటారు. వాటిని చూసి నిజంగానే కొందరు ఫ్యాన్స్ ఇన్‌స్పైర్ అవుతుంటారు. తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా అలాంటి పనే చేశాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా గడిపేస్తున్నాడు. ఒక మూవీ థియేటర్లలో విడుదల అవ్వగానే వెంటనే మరో మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ఇక తాజాగా ఈ యంగ్ హీరో తను ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీనిని చూసి ఫ్యాన్స్ అంతా చాలా మంచి పనిచేశారంటూ కామెంట్స్ పెడుతున్నారు.

బాగా అనిపిస్తుంది..

తాజాగా విశ్వక్ సేన్ తన అవయవాలను డొనేట్ చేశాడు. ఈ విషయాన్ని తను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. డోనర్ కార్డ్‌తో తను దిగిన ఫోటోను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు. అంతే కాకుండా ‘నా అవయవాలను డొనేట్ చేస్తానని మాటిచ్చాను. మీరు కూడా చేయండి. చాలా బాగా అనిపిస్తుంది’ అంటూ క్యాప్షన్ పెట్టి తన ఫ్యాన్స్‌ను కూడా ఇలా చేయమని అన్నాడు విశ్వక్. దీంతో ఈ యంగ్ హీరో చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తనలాగే మరికొందరు యంగ్ యాక్టర్లు కూడా ఇలాంటి మంచి పనుల కోసం ముందుకొస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. రియల్ హీరో అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vishwak Sen (@vishwaksens)

మూడో సినిమాకే డైరెక్టర్‌గా..

‘వెళ్లిపోమాకే’ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన విశ్వక్ సేన్.. ‘ఈ నగరానికి ఏమైంది’తో యూత్‌కు బాగా దగ్గరయ్యాడు. ఈ సినిమా విడుదలయ్యి ఆరేళ్లు అయినా ఇప్పటికీ విశ్వక్ సేన్ అన్ని సినిమాలకంటే దీని ద్వారానే ఎక్కువమంది ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటారు. ఆ తర్వాత తను చేసిన మూడో సినిమాకే డైరెక్టర్‌గా కూడా మారాడు విశ్వక్. దాదాపు అందరు కొత్త నటీనటులతో, కొత్త టెక్నీషియన్లతో ‘ఫలక్‌నామా దాస్’ అనే మూవీ చేశాడు. అప్పటినుండి విశ్వక్ సేన్‌ను తన ఫ్యాన్స్ అంతా దాస్ అని ప్రేమగా పిలవడం మొదలుపెట్టారు. ఒకవైపు హీరోగా, మరోవైపు డైరెక్టర్‌గా ‘ఫలక్‌నామా దాస్’ను నిలబెట్టాడు విశ్వక్.

ఒకే ఏడాది రెండు సినిమాలు..

ఇక 2024లో ఇప్పటికే రెండు సినిమాలను విడుదల చేశాడు విశ్వక్ సేన్. అవే ‘గామి’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ రెండు చిత్రాలు రెండు డిఫరెంట్ జోనర్లకు చెందినవి. రెండిటికీ మిక్స్‌డ్ టాక్ లభించినా ‘గామి’లో విశ్వక్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్‌ను ఎంచుకొని విశ్వక్ అందరినీ ఆశ్చర్యపరిచాడని అన్నారు. ఇక తాజాగా విడుదలయిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’కి కూడా మిక్స్‌డ్ టాకే లభించింది. కానీ మరోసారి మాస్ రోల్‌లో మాస్ పర్ఫార్మెన్స్‌తో చాలామందిని ఇంప్రెస్ చేశాడు ఈ యంగ్ హీరో. ఇప్పుడు ‘మెకానిక్ రాకీ’ లాంటి మరో మాస్ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.

Also Read: పెళ్లయిన హీరోతో ‘కాంతార’ నటి ఎఫైర్? హోటల్ రూమ్‌లో కలిసున్నారంటూ భార్య ఆరోపణలు, కోర్టు మెట్లు ఎక్కిన సప్తమి గౌడ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Security: మాజీ సీఎం జగన్ నివాసం, వైసీపీ సెంట్రల్ ఆఫీసు వద్ద నిఘా పెంచిన పోలీసులు
మాజీ సీఎం జగన్ నివాసం, వైసీపీ సెంట్రల్ ఆఫీసు వద్ద నిఘా పెంచిన పోలీసులు
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 31 మంది మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం - పేలుడు పదార్థాలు సీజ్
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 31 మంది మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం - పేలుడు పదార్థాలు సీజ్
Megastar Chiranjeevi: ప్రజారాజ్యమే జనసేనగా మారింది... పవన్‌ను చూస్తే గర్వమే - విశ్వక్ జెండా పాతాల్సిందే - మెగాస్టార్ పొలిటికల్ కామెంట్స్‌
ప్రజారాజ్యమే జనసేనగా మారింది... పవన్‌ను చూస్తే గర్వమే - విశ్వక్ జెండా పాతాల్సిందే - మెగాస్టార్ పొలిటికల్ కామెంట్స్‌
Harish Rao: బోగస్‌గా మారిన సన్న వడ్లకు బోనస్ హామీ, త్వరగా తేల్చండి - సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ
బోగస్‌గా మారిన సన్న వడ్లకు బోనస్ హామీ, త్వరగా తేల్చండి - సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Madhya Pradesh Dhar Gang Arrest | 55కేసులున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసిన అనంత పోలీసులు | ABP DesamBaduguvani Lanka Nurseries | గోదావరి తీరంలో ఈ ఊరి పూలతోటల అందాలు చూశారా | ABP DesamElon Musk MARS Square Structure | మార్స్ మీదకు ఆస్ట్రోనాట్స్ ను పంపాలనంటున్న మస్క్ | ABP DesamKiran Royal Janasena Issue | వివాదంలో చిక్కుకున్న తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Security: మాజీ సీఎం జగన్ నివాసం, వైసీపీ సెంట్రల్ ఆఫీసు వద్ద నిఘా పెంచిన పోలీసులు
మాజీ సీఎం జగన్ నివాసం, వైసీపీ సెంట్రల్ ఆఫీసు వద్ద నిఘా పెంచిన పోలీసులు
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 31 మంది మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం - పేలుడు పదార్థాలు సీజ్
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 31 మంది మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం - పేలుడు పదార్థాలు సీజ్
Megastar Chiranjeevi: ప్రజారాజ్యమే జనసేనగా మారింది... పవన్‌ను చూస్తే గర్వమే - విశ్వక్ జెండా పాతాల్సిందే - మెగాస్టార్ పొలిటికల్ కామెంట్స్‌
ప్రజారాజ్యమే జనసేనగా మారింది... పవన్‌ను చూస్తే గర్వమే - విశ్వక్ జెండా పాతాల్సిందే - మెగాస్టార్ పొలిటికల్ కామెంట్స్‌
Harish Rao: బోగస్‌గా మారిన సన్న వడ్లకు బోనస్ హామీ, త్వరగా తేల్చండి - సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ
బోగస్‌గా మారిన సన్న వడ్లకు బోనస్ హామీ, త్వరగా తేల్చండి - సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ
Tirumala Ghee Adulteration: తిరుమలలో నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం, సీబీఐ అదుపులో నలుగురు నిందితులు
తిరుమలలో నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం, సీబీఐ అదుపులో నలుగురు నిందితులు
Cuttack Odi Result Update: వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో రోహిత్ వీరవిహారం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో హిట్ మ్యాన్ హుకుం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
Palnadu Road Accident: పల్నాడులో ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
పల్నాడులో ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Mollywood Strike: డిజాస్టర్ సినిమాలు 176, నష్టాలు 100 కోట్లు, హీరోలకు భారీ రెమ్యూనరేషన్లు... మాలీవుడ్‌లో స్ట్రైక్ ఎందుకు జరుగుతుందో తెలుసా?
డిజాస్టర్ సినిమాలు 176, నష్టాలు 100 కోట్లు, హీరోలకు భారీ రెమ్యూనరేషన్లు... మాలీవుడ్‌లో స్ట్రైక్ ఎందుకు జరుగుతుందో తెలుసా?
Embed widget