By: ABP Desam | Updated at : 12 May 2022 01:13 PM (IST)
Edited By: Suresh Chelluboyina
Image Credit: Niharika Nm/Instagram
నిహారిక Nm.. ఇది పేరు కాదు, ఒక బ్రాండ్. ఈమెను జస్ట్ చూస్తే చాలు.. తెలియకుండానే మీరు నవ్వేస్తారు. ఇక ఆమె యాక్షన్‌లోకి దిగిందంటే.. దబిడి దిబిడే. ఆమె వేషాలు చూసి పడి పడి నవ్వేస్తారు. మాటలు, చూపులు, ఎక్స్‌ప్రెషన్స్.. ఇలా ప్రతి ఒక్కటీ ఫన్నీగా ఉంటాయి. అదే ఆమెకు ఎక్కడాలేని క్రేజ్‌ను తీసుకొచ్చింది. మహేష్ బాబు, యష్ వంటి పెద్ద హీరోలు సైతం ఆమెతో ‘యూట్యూబ్ షార్ట్స్’ వీడియో చేశారంటే.. ఆమెకు ఎంత ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా నిహారిక ‘సర్కారువారి పాట’ సినిమా విడుదల సందర్భంగా ఓ షార్ట్స్ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో ఆమె ‘సర్కారు వారి పాట’లో మహేష్ బాబు తాళాల గుత్తిని కొట్టేయడానికి ప్లాన్ వేస్తోంది. ‘మనీహీస్ట్’లోని ప్రొఫెసర్ తరహాలో చోరీకి ప్లాన్ చేస్తుంది. మొత్తానికి ఆ తాళాల గుత్తి కొట్టేసి, టేబుల్ కింద దాక్కుంటుంది. అప్పుడు మహేష్ బాబు ఆమెను సర్‌ప్రైజ్ చేస్తారు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగే సంభాషణ భలే ఫన్నీగా ఉంటుంది. చివరికి మహేష్ బాబు కూడా ఆమె మాటలు విని నవ్వేస్తారు. ఇంతకు ముందు ‘కేజీఎఫ్-2’ విడుదల సందర్భంగా కూడా యశ్‌తో ఓ క్రేజీ షార్ట్స్ వీడియోను పోస్ట్ చేసి ఆకట్టుకుంది.
Also Read: మూన్ నైట్ వెబ్ సిరీస్ రివ్యూ: హాలీవుడ్ అపరిచితుడు ఎలా ఉన్నాడంటే?
ఎవరికీ Niharika Nm?: నిహారికకు తెలుగు, తమిళంతోపాటు ఇతర దక్షిణాది భాషలు కూడా తెలుసు. కాలిఫోర్నియాలోని చాప్మన్ యూనివర్శిటీలో ఎంబీఏ పూర్తి చేసిన నిహారిక.. ఇన్‌స్టాగ్రామ్ ఫన్నీ వీడియోలను పోస్ట్ చేస్తూ అభిమానులను సంపాదించుకుంది. ఆమెకు దక్షిణాదికి చెందిన యువతి కావడంతో.. ఇక్కడి కల్చర్, తల్లిదండ్రుల తీరు తదితర అంశాలపై ఫన్నీ వీడియోలు చేస్తూ నవ్విస్తోంది. ఆమె మాట్లాడే ఇంగ్లీష్‌లో కూడా సౌత్ ఇండియా ప్రజల యాస కనిపిస్తుంది. అదే ఆమె వీడియోలకు ప్లస్. అందుకే, బాలీవుడ్ హీరో షహీద్ కపూర్, అజయ్ దేవగన్ సైతం ఆమెతో కలిసి ఫన్నీ వీడియో చేశారు.
Also Read: 'సర్కారు వారి పాట' రివ్యూ: అయ్యో, మహేషా.. ఇలా చేశావేంటయ్యా!
నిహారిక వీడియోలంటే మన హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్, రెజినాలకు చాలా ఇష్టం. అందుకే వారు నిహారికను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నారు. ఇటీవల నిహారిక ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘నా వీడియోలు చూసి ఫాలోవర్స్ పెట్టే కామెంట్లు చదువుతుంటే కన్నీళ్లు ఉబికి వస్తుంటాయి. నేను చేసే 95 శాతం వీడియోలు నిజజీవితంలో నా ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఉన్నప్పుడు పుట్టేవే’’ అని తెలిపింది. నిహారిక చిన్నప్పటి నుంచి ఆమె తెలుగు, తమిళ సినిమాలు చూస్తూ పెరిగింది. దీంతో ఆమె జోక్స్‌లో ఆ ప్రభావం బాగా కనిపిస్తుంటుంది. ఆమె గురించి ఇలా తెలుసుకోవడం కంటే.. ఆమె వీడియోలు చూస్తేనే అర్థమవుతుంది. అన్నట్లు.. నిహారికకు మహేష్ బాబు, అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమట.
NTR Birthday Special: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు
Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!
RRR Visual Effects: ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో పులి, పాముకు ఇలా ప్రాణం పోశారు, ఇదిగో VFX వీడియో!
Stock Market News: శుక్రవారం డబ్బుల వర్షం! రూ.5.5 లక్షల కోట్లు ఆర్జించిన ఇన్వెస్టర్లు, సెన్సెక్స్ 1163+
CM KCR Tour : జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ గురి, నేటి నుంచి వరుస పర్యటనలు
Nikhat Zareen Profile: ఓవర్‌నైట్ గెలుపు కాదిది - నిఖత్ జరీన్‌ది 12 ఏళ్ల శ్రమ!
Fertility: గర్భం ధరించలేకపోతున్నారా? ఒత్తిడి కారణమేమో చూసుకోండి