Niharika Konidela : రాకాస మూవీని తెగ ఎంజాయ్ చేస్తున్నారు - చందమామ కథలా రీచ్ అయ్యింది... టీం సక్సెస్ మీట్ హైలెట్స్
Rakasa Movie : రాకాస మూవీని పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఎంజాయ్ చేస్తున్నారని నిహారిక కొణిదెల అన్నారు. తాజా సక్సెస్ మీట్‌లో సూపర్ రెస్పాన్స్ రావడంపై మూవీ టీం హర్షం వ్యక్తం చేస్తోంది.

Rakasa Movie Team Success Celebrations : టాలీవుడ్ యంగ్ హీరో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన హారర్ కామెడీ మూవీ రాకాస శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మానస శర్మ దర్శకత్వం వహించగా... జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సల్‌తో కలిపి నిహారిక కొణిదెల నిర్మించారు. తాజాగా మూవీ టీం సక్సెస్ సెలబ్రేషన్స్‌తో సందడి చేసింది.
ప్రీమియర్ల నుంచే సూపర్ రెస్పాన్స్
ఈ మూవీకి ప్రీమియర్ల నుంచే సూపర్ రెస్పాన్ వస్తుందని నిర్మాత నిహారిక కొణిదెల అన్నారు. ''రాకాస' మూవీని ఆడియెన్స్‌తో పాటుగా చూశాం. ప్రీమియర్ల నుంచే మా సినిమాకి మంచి రెస్పాన్స్ దక్కింది. ఎక్కడైతే ఆడియెన్స్ ఎక్కువగా నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు? అని అనుకున్నామో అక్కడ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ మూవీ తీశాం. విడుదలైన ప్రతీ చోటా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.' అని అన్నారు.
Also Read : రామాయణ ఓటీటీ డీల్ - వెయ్యి కోట్ల ఆఫర్ రిజెక్ట్... ధురంధర్‌ను ఫాలో అవుతారా?
నాకు స్పెషల్ మూవీ
పిల్లల దగ్గర నుంచీ పెద్దల వరకూ ప్రతీ ఒక్కరూ తమ మూవీని ఎంజాయ్ చేస్తున్నారని హీరో సంగీత్ శోభన్ అన్నారు. మూవీని ఎంకరేజ్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్ చెప్పారు. రాకాస తనకు చాలా స్పెషల్ మూవీ అని హీరోయిన్ నయన్ సారిక అన్నారు. 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అంటే నా ఫ్యామిలీ. ప్రీమియర్ల నుంచే మాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని వర్గాల ఆడియెన్స్ మా మూవీని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఈ సక్సెస్ చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది.' అని అన్నారు.
చందమామ లాంటి కథ అని తాము ముందే చెప్పామని.. అదే విషయం ఆడియన్స్ అందరికీ రీచ్ అయ్యేలా చేసిందని డైరెక్టర్ మానస శర్మ తెలిపారు. ''రాకాస' చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. చాలా చోట్ల ఆడియెన్స్ పగలబడి నవ్వేస్తున్నారు. అంతలా ప్రేక్షకులు మా సినిమాను ఎంజాయ్ చేస్తుంటే సంతోషంగా ఉంది. మా సినిమాని ఇంకా ఇలానే ఆదరిస్తూ ముందుకు తీసుకు వెళ్లాలని ఆడియెన్స్‌ని కోరుకుంటున్నా.’ అని అన్నారు.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
ట్రెండింగ్ వార్తలు























