Committee Kurrollu Movie: కమిటీ కుర్రాళ్లు... యాస, ఎటకారమే కాదండీ, గోదారి కుర్రాళ్లతోనూ మామూలుగా ఉండదట
Niharika Konidela upcoming film with newcomers titled Committee Kurrollu: నిహారిక కొణిదెల సమర్పణలో రూపొందుతున్న 'కమిటీ కుర్రోళ్ళు' టైటిల్ పోస్టర్ సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ విడుదల చేశారు.
The title motion poster of Committee Kurrollu movie has been released by Sai Durga Tej: ''గోదారి యాస, ఎటకారమే కాదండి... గోదారి కుర్రోళ్లతో కూడా మామూలుగా ఉండదు మరి'' అంటున్నారు మెగా డాటర్ నిహారిక కొణిదెల. ఆమె సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ సంస్థలపై రూపొందుతున్న చిత్రానికి 'కమిటీ కుర్రోళ్ళు' టైటిల్ ఖరారు చేశారు. ఆ విషయాన్ని ఉగాది సందర్భంగా ఇవాళ అధికారికంగా చెప్పారు.
టైటిల్ పోస్టర్ విడుదల చేసిన సుప్రీం హీరో
'కమిటీ కుర్రాళ్లు' సినిమాతో పదకొండు మంది హీరోలు, నలుగురు హీరోయిన్లు తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతున్నారు. ఆ హీరో హీరోయిన్లలో కొంత మంది యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్ కూడా ఉన్నారు. ఈ రోజు సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ 'కమిటీ కుర్రోళ్ళు' టైటిల్ పోస్టర్ విడుదల చేసి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
Our committee is deeply committed to heartfully thank you @IamSaiDharamTej gaaru 🤗❤️
— Pink Elephant Pictures (@PinkElephant_P) April 9, 2024
You made it even more special for all of us #CommitteeKurrollu 🥁 https://t.co/4nHcaLAf8t
ఇదొక పెద్ద బాధ్యత... అందరికీ నచ్చుతుంది!
''ఇంత మంది కొత్త వాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నా. మేం ఈ 'కమిటీ కుర్రోళ్లు' టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇది అందరికీ నచ్చే సినిమా అవుతుందని నమ్ముతున్నా'' అని నటి, ఈ చిత్ర నిర్మాత నిహారిక కొణిదెల చెప్పారు. ఇంకా ఆవిడ మాట్లాడుతూ... ''మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థలో నిర్మించిన తొలి సినిమా 'కమిటీ కుర్రోళ్ళు'. ఉగాదికి టైటిల్ పోస్టర్ విడుదల చేసిన మా హీరో సాయి దుర్గా తేజ్‌గారికి థాంక్స్. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ సంస్థతో కలిసి ఈ సినిమా నిర్మించడం సంతోషంగా ఉంది. ఇంత మంది కొత్త వాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాం. ఈ సినిమా ద్వారా యదు వంశీ గారు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు'' అని చెప్పారు.
Also Read: మైదాన్ రివ్యూ: ఫుట్ బాల్ కోచ్ రహీమ్ బయోపిక్ - అజయ్ దేవగణ్ సినిమా ఎలా ఉందంటే?
'కమిటీ కుర్రోళ్ళు' చిత్రీకరణ పూర్తి అయ్యిందని, తనను నమ్మి అవకాశం ఇచ్చిన నిలబెట్టుకుంటానని దర్శకుడు యదు వంశీ తెలిపారు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ అధినేతలు ఫణి, జయలక్ష్మి మాట్లాడుతూ... ''మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాం. ఈ ప్రయాణంలో మాకు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ తోడు రావటం సంతోషంగా ఉంది. కంటెంట్ ఈజ్ కింగ్. కంటెంట్ బేస్ చేసుకుని 'కమిటీ కుర్రోళ్ళు' టైటిల్ పెట్టాం'' అని చెప్పారు.
Also Read: ఆ హిట్ సినిమాలు మిక్సీలో వేస్తే వచ్చిన కిచిడీ 'ఫ్యామిలీ స్టార్' - రామ రామ... ఏంటిది పరశురామా?
Committee Kurrollu Movie Cast And Crew: 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేష్, తేజస్వి రావు, టీన శ్రావ్య, విషిక, షణ్ముఖి నాగు మంత్రి హీరో హీరోయిన్లు. సాయి కుమార్, గోపరాజు రమణ, 'బలగం' జయరాం, శ్రీ లక్ష్మి, 'కంచరపాలెం' కిషోర్, కిట్టయ్య, రమణ భార్గవ్, 'జబర్దస్త్' సత్తిపండు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి నృత్యం: జేడీ మాస్టర్, కూర్పు: అన్వర్ అలీ, మాటలు: వెంకట సుభాష్ చీర్ల - కొండల రావు అడ్డగళ్ల, పోరాటాలు: విజయ్,ఛాయాగ్రహణం: రాజు ఎడురోలు, సంగీతం: అనుదీప్ దేవ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మన్యం రమేష్, సమర్పణ: నిహారిక కొణిదెల, నిర్మాతలు: పద్మజా కొణిదెల, జయలక్ష్మి అడపాక, రచన & దర్శకత్వం: యదు వంశీ.