Swasika: రామ్ చరణ్ 'పెద్ది' ఆఫర్‌నే రిజెక్ట్ చేస్తావా? - మలయాళ బ్యూటీపై ట్రోలింగ్
Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' మూవీ ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు చెప్పడంపై మలయాళ బ్యూటీ స్వాసికపై నెట్టింట ట్రోలింగ్ సాగుతోంది. కొందరు మాత్రం ఆమెను సపోర్ట్ చేస్తున్నారు.

Netizens Trolling On Malayalam Actress Swasika: మలయాళ బ్యూటీ స్వాసికపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తాను గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్' 'పెద్ది' మూవీ ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు చెప్పడంతో తాజాగా ఆమెపై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ సాగుతోంది. కొందరు సపోర్ట్ చేస్తుండగా... ఓ వర్గం మాత్రం స్వాసిక నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.
'పెద్ది' ఆఫర్ రిజెక్ట్ చేసిన స్వాసిక
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' మూవీలో ఆయనకు తల్లిగా నటించేందుకు తనకు ఆఫర్ వచ్చిందని కానీ దాన్ని రిజెక్ట్ చేసినట్లు తెలిపారు స్వాసిక. ఆమె లేటెస్ట్ మలయాళ మూవీ 'వాసంతి' ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తమిళ మూవీ 'లబ్బర్ పందు'లో మదర్ రోల్‌కు మంచి పాపులారిటీ రావడంతో వరుసగా అలాంటి ఆఫర్సే వచ్చినట్లు చెప్పారు.
'చాలామంది దర్శకులు నాకు మదర్ రోల్స్ ఆఫర్ చేశారు. రామ్ చరణ్ 'పెద్ది' మూవీలోనూ హీరో తల్లి పాత్ర కోసం టీం నన్ను సంప్రదించింది. ఆ రోల్ చేస్తే కెరీర్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. 33 ఏళ్ల వయసులో ఈ రోల్ కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అందుకే ప్రస్తుతానికి అలాంటి రోల్స్ చేయాలని నాకు లేదు. అందుకే ఆ ఆఫర్ రిజెక్ట్ చేశా. ఫ్యూచర్‌లో ఇలాంటి ఛాన్స్ వస్తే ఆలోచిస్తా.' అంటూ చెప్పారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.
Also Read: తేజ సజ్జ 'మిరాయ్' మూవీ కొత్త రిలీజ్ డేట్ - ట్రైలర్ ఎప్పుడో తెలుసా?
నెటిజన్ల ట్రోలింగ్
స్వాసిక అభిప్రాయాన్ని కొందరు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. చరణ్ మూవీని రిజెక్ట్ చేసినట్లు చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్ల చరణ్‌కు 33 ఏళ్ల వయసున్న అమ్మాయి తల్లి క్యారెక్టర్ చేయడం కరెక్ట్ కాదనే ఆమె నిర్ణయం సరైనదేనంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొందరు మాత్రం అలా డైరెక్ట్‌గా చెప్పడం కరెక్ట్ కాదని... నచ్చితే ఆ రోల్ చేయాలి లేకుంటే లేదని కామెంట్స్ చేశారు. దీంతో ఇది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. స్వాసిక పలు తమిళ, మలయాళ మూవీస్‌లో నటించి మెప్పించారు. రీసెంట్‌గా వచ్చిన నితిన్ 'తమ్ముడు' మూవీలో నెగిటివ్ రోల్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో రామ్ చరణ్ 'పెద్ది' మూవీ తెరకెక్కుతోంది. చరణ్ సరసన అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా... కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ, అర్జున్ అంబటి, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గ్రామీణ నేపథ్యం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ప్రధానాంశంగా మూవీ తెరకెక్కతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, లుక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.





















