అన్వేషించండి

Toxic Movie Update : యశ్ 'టాక్సిక్' మూవీ కోసం హాలీవుడ్ టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్.. 45 రోజుల యాక్షన్ సీక్వెన్స్!

Yash Toxic : రాకింగ్​ స్టౌర్ యశ్ హీరోగా చేస్తోన్న టాక్సిక్ మూవీని  భారీగా ప్లాన్ చేశారు మేకర్స్. దీనికోసం హాలీవుడ్ టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్​ని తీసుకొచ్చి యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. 

Yash’s Toxic Movie : రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్-ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’. కేజీఎఫ్​ తర్వాత యశ్ నుంచి వచ్చే సినిమా కోసం అందరూ ఎదురు చేస్తున్నారు. దీనిలో భాగంగానే మేకర్స్ టాక్సిక్ మూవీని నెక్స్ట్​ లెవెల్​కి తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారు. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం హాలీవుడ్ టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్ జె.జె. పెర్రీని తీసుకొచ్చారు. 

హాలీవుడ్ రేంజ్ యాక్షన్స్

టాక్సిక్​ సినిమాపై అభిమానుల్లో ఉన్న అంచనాలు ఇప్పటికీ చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిని రెట్టింపు చేసేలా.. హాలీవుడ్​ రేంజ్​లో యాక్షన్ సీన్స్​ని తెరకెక్కిస్తోంది చిత్రబృందం. అందుకే సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ కోసం.. ‘జాన్ విక్’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’, ‘డే షిఫ్ట్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు వర్క్ చేసిన టాప్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్​ జె.జె. పెర్రీని తీసుకొచ్చారు. Toxic Movie Update : యశ్ 'టాక్సిక్' మూవీ కోసం హాలీవుడ్ టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్.. 45 రోజుల యాక్షన్ సీక్వెన్స్!

45 రోజుల షెడ్యూల్

జె.జె. పెర్రీ ఇండియన్ స్టంట్ టీంతో ముంబైలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ షెడ్యూల్‌ని ప్లాన్ చేశారు. 45 రోజుల పాటు ఈ షెడ్యూల్‌ కొనసాగనుంది. అయితే దీనిలో కేవలం ఇండియన్ స్టంట్ టీం మాత్రమే పని చేయనున్నట్లు తెలుస్తోంది. ‘టాక్సిక్’ కోసం ఇండియన్ స్టంట్ టీంను మాత్రమే తీసుకుని యాక్షన్ సీక్వెన్స్ భారీగా.. హాలీవుడ్‌ స్థాయికి ధీటుగా.. ప్లాన్ చేశారట పెర్రీ. అంతర్జాతీయ స్థాయిలో ‘టాక్సిక్’ను రూపొందిస్తామని తెలిపారు పెర్రీ.

హై బడ్జెట్​తో ఇంగ్లీష్​లో కూడా

ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌.. యశ్​ కెరీర్​లో మరో మైలురాయిగా నిలవనుందని అంటున్నాయి చిత్రవర్గాలు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. కన్నడ, ఇంగ్లీష్​లో ఒకేసారి చిత్రీకరిస్తున్న మొట్టమొదటి హై బడ్జెట్‌ ద్విభాషా చిత్రం ఇదే.Toxic Movie Update : యశ్ 'టాక్సిక్' మూవీ కోసం హాలీవుడ్ టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్.. 45 రోజుల యాక్షన్ సీక్వెన్స్!

ఈ మూవీని హిందీ, తెలుగు, తమిళం, మలయాళంతో సహా ఇతర భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా వరల్డ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ మూవీగా ‘టాక్సిక్’ను తెరకెక్కిస్తున్నారు. మార్చి 19, 2026న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. 

యశ్ నెక్స్ట్ లైన్ అప్

టాక్సిక్ చేస్తూనే యశ్ రామాయణం సినిమాలో రావణుడిగా చేస్తున్నాడు. కేజీఎఫ్ 3పై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ ప్రశాంత్ మరోసారి యశ్​ని రాఖీగా చూపిస్తారంటూ పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికైతే.. అభిమానాల్లో టాక్సిక్​పై అంచనాలు రోజురోజుకి పెంచేస్తున్నారు మేకర్స్. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Trimukha Movie Release Date: సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Tata Sierra Dealership: టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
Embed widget