Mirai Release Date: తేజ సజ్జ 'మిరాయ్' మూవీ కొత్త రిలీజ్ డేట్ - ట్రైలర్ ఎప్పుడో తెలుసా?
Mirai Movie: యంగ్ హీరో తేజ సజ్జా లేటెస్ట్ సూపర్ అడ్వెంచర్ మూవీ 'మిరాయ్' రిలీజ్ అనుకోని కారణాలతో వాయిదా పడింది. ట్రైలర్ రిలీజ్ డేట్‌తో పాటు కొత్త రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు.

Teja Sajja's Mirai Movie New Release Date: 'హనుమాన్' మూవీతో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న యంగ్ హీరో తేజ సజ్జా లేటెస్ట్ సూపర్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'మిరాయ్'. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తుందని ముందు ప్రకటించినా అనుకోని కారణాలతో వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు.
కొత్త రిలీజ్ ఎప్పుడంటే?
'మిరాయ్' మూవీని ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 12న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, లుక్స్ ఆకట్టుకోగా... ఇక ట్రైలర్‌ను ఈ నెల 28న విడుదల చేస్తామని చెప్పారు. 'భవిష్యత్తు కోసం ఓ యుద్ధంగా పుట్టిన ఇతిహాసాల తత్వం నుంచి మిరాయ్ ట్రైలర్ వచ్చేస్తోంది. భారతదేశ అత్యంత ప్రతిష్టాత్మక యాక్షన్ అడ్వెంచర్ చూసేందుకు రెడీగా ఉండండి.' అంటూ రాసుకొచ్చారు.
From the ethos of Itihasas, born a battle for the future ⚔️#MiraiTrailer drops on 28th August 🔥
— Teja Sajja (@tejasajja123) August 26, 2025
Get ready to witness India’s most ambitious Action-Adventure Saga 🥷❤️🔥#MIRAI GRAND RELEASE WORLDWIDE ON 12th SEPTEMBER💥
Rocking Star @HeroManoj1 @Karthik_gatta @RitikaNayak_… pic.twitter.com/8orFDK7EkN
Also Read: అఫీషియల్ అనౌన్స్‌మెంట్ - మాస్ మహారాజ రవితేజ 'మాస్ జాతర' రిలీజ్ వాయిదా
ఈ మూవీలో తేజ సజ్జా సూపర్ యోధుడిగా కనిపించనున్నారు. తేజ సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా... మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్నారు. జగపతిబాబు, శ్రియ, కౌశిక్ మెహతా కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో దాదాపు 8 భాషల్లో 2డీ, 3డీ ఫార్మాట్లలో సెప్టెంబర్ 12న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
అసలేంటీ 'మిరాయ్'?
'మిరాయ్'... ఈ టైటిల్ అనౌన్స్ చేయగానే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అసలు 'మిరాయ్' అంటే అర్థం ఏంటి? అంటూ తెగ సెర్చ్ చేశారు నెటిజన్లు. 'మిరాయ్' అంటే 'భవిష్యత్తుపై నమ్మకం' అని అర్థం. చెడును అంతం చేసి ధర్మాన్ని కాపాడి భవిష్యత్తుపై నమ్మకం కలిగించే ఓ సూపర్ యోధుడుగా తేజ సజ్జా నటించనున్నట్లు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. అశోకుడు కళింగ యుద్ధ పరిణామాల తర్వాత రాసిన గ్రంథాలు వాటిని తరతరాలుగా కాపాడుతూ వస్తోన్న 9 మంది యోథుల బ్యాక్ డ్రాప్ ప్రధానాంశంగా ఈ మూవీని రూపొందించినట్లు తెలుస్తోంది.
'జరగబోయేది మారణ హోమం. శిథిలం కాబోతోంది అశోకుని ఆశయం.' అనే పవర్ ఫుల్ డైలాగ్‌తో టీజర్ ప్రారంభం కాగా... భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇక టీజర్ క్లైమాక్స్‌లో వానరాలు చుట్టూ ఉండగా... రాముని అడుగులు వేస్తూ రావడం వేరే లెవల్‌కు తీసుకెళ్లింది. అశోకుని కళింగ యుద్ధం బ్యాక్ డ్రాప్ ఆ తర్వాత జరిగిన పరిణామాలు... ఆ గ్రంథాలను కాపాడేందుకు ఈ వారియర్ ఏం చేశాడు? అనేదే మూవీలో చూపించినట్లు తెలుస్తోంది. మరి ఈ యాక్షన్ అడ్వెంచర్ చూడాలంటే సెప్టెంబర్ 12 వరకూ ఆగాల్సిందే.



















