Nazriya Fahadh : సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్న నజ్రియా - షాకింగ్ డెసిషన్
Nazriya Nazim Shocking Decision : మలయాళీ బ్యూటీ నజ్రియా కీలక నిర్ణయం తీసుకుంది. కొంతకాలం పాటు సోషల్ మీడియాకు బ్రేక్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. త్వరలో మళ్లీ కలుస్తాంటూ ఇన్ స్టా వేదికగా ప్రకటించింది.
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘అంటే సుందరానికి’ సినిమాతో నేరుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది మలయాళీ బ్యూటీ నజ్రియా ఫహద్. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. చక్కటి అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను అలరించింది. అంతేకాదు, ఈ సినిమాలో తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘రాజా రాణి’ అనే డబ్బింగ్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులు చేరువైన మలయాళ హీరోయిన్, ‘అంటే సుందరానికి’ సినిమాతో తెలుగునాట మరింత పాపులారిటీ సంపాదించుకుంది.
సోషల్ మీడియాకు విరామం ప్రకటించిన నజ్రియా
తాజాగా నజ్రియా కీలక నిర్ణయం తీసుకుంది. కొంతకాలం పాటు సోషల్ మీడియాకు బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలిపింది. త్వరలోనే మళ్లీ వస్తానని ప్రకటించింది. “సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకుంటున్నాను. కొంత కాలం పాటు మీ ప్రేమకు దూరం కాబోతున్నాను. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తాను. ప్రామీస్” అని ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో చెప్పుకొచ్చింది. ఏ కారణం చేత సోషల్ మీడియాకు బ్రేక్ చెప్తుంది? అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
ప్రేమ వివాహం చేసుకున్న ఫహద్ ఫాజిల్, నజ్రియా నజీమ్
మలయాళ క్యూట్ కపుల్ గా ఫహద్ ఫాజిల్, నజ్రియా నజీమ్ కు గుర్తింపు ఉంది. ఇప్పటికే నజ్రియా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కాగా, ఫహాద్ ‘పుష్ప’ మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. మంచి అవకాశాలు వస్తున్న సమయంలోనే ఫహద్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది నజ్రియా. ఆ తర్వాత భార్యభర్తలు ఇద్దరు కలిసి ‘ట్రాన్స్’ అనే సినిమాలో నటించారు. ఫహద్ ఫాసిల్, నజ్రియా నజీమ్ ‘బెంగుళూరు డేస్’ మూవీలో భార్యాభర్తలుగా నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. అదే సినిమా సెట్స్‌పై వీరి ప్రేమ కథకు పునాది పడింది. ఈ సినిమాలో కపుల్స్ గా నటించిన ఈ జంట, మూవీ విడుదలకు ముందే నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. జనవరి 2014లో అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఆగస్టు 21న వివాహం చేసుకున్నారు.
Also Read : కంగనా రనౌత్, అలియా భట్ ను వెనక్కి నెట్టిన ఆదా శర్మ, బాక్సాఫీస్ దగ్గర ‘ది కేరళ స్టోరీ’ సరికొత్త రికార్డు!
పెళ్లి తర్వాత నాలుగేళ్లు సినిమాలకు దూరం
వివాహం తర్వాత నజ్రియా నటనకు దాదాపు నాలుగేళ్ల విరామం తీసుకుంది. తన వివాహ జీవితంపై దృష్టి పెట్టింది. ఆ సమయంలో ఫహద్ ఫాసిల్ ను వెనకుండి నడిపించింది. ఆ సమయంలో తన కెరీర్ లో వచ్చిన సక్సెస్ లో ఆమె శ్రమ చాలా ఉందని చెప్పారు ఫహద్. "నేను నజ్రియాను పెళ్లి చేసుకున్న తర్వాత చాలా విజయాలు సాధించాను. వాటిని ఒంటరిగా నేను సాధించలేనని తెలుసు” అని చెప్పుకొచ్చారు. ఫహద్, నజ్రియా పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. ఇద్దరి మధ్య వయసులు భారీ తేడా ఉండటంతో బాగా నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. పెళ్లి నాటికి నజ్రియా వయసు 19 ఏళ్లు కాగా, ఫహద్‌కు 32 ఏళ్లు. అంతేకాదు, పెళ్లి తర్వాత నజ్రియాను నటించకుండా అడ్డుకున్నారని విమర్శలు వచ్చాయి. వాటన్నింటినీ ఈ జంట ఎదుర్కొని నిలబడింది. పెళ్లి తర్వాత నాలుగేళ్లకు నజ్రియా, అంజలి మీనన్ దర్శకత్వం వహించిన ‘కూడే’ (2018)లో నటించింది. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా ఇద్దరూ కెరీర్ కొనసాగిస్తున్నారు.
Read Also: 'శివ'గా షణ్ముఖ్ జస్వంత్ - కొత్త సిరీస్ 'స్టూడెంట్' షురూ, లుక్ చూశారా?