By: ABP Desam | Updated at : 13 May 2023 09:31 AM (IST)
'స్టూడెంట్' సిరీస్ ఫస్ట్ లుక్ (Photo Credit: Shanmukh Jaswanth Kandregula/Instagram)
సోషల్ మీడియా వేదికగా బాగా పాపులర్ అయిన యువకులలో షణ్ముఖ్ జస్వంత్ ఒకరు. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లు, వీడియో సాంగ్స్ చేస్తూ మంచి పేరు సంపాదించాడు. రీసెంట్ గా‘అయ్యయ్యో..’ అనే వీడియో సాంగ్ తో అభిమానులను అలరించాడు. నటి ఫణి పూజితతో కలిసి రొమాంటిక్ సాంగ్ లో ఆకట్టుకున్నాడు. వీరిద్దరి ఆన్ స్క్రీన్ జోడి నెటిజన్లను బాగా అలరించింది. తన ప్రేయసిని కలసుకోవడానికి పరితపించే ఓ ప్రేమికుడిలా షణ్ముఖ్ మెప్పించాడు. ఈ మ్యూజిక్ వీడియోకు వినయ్ షణ్ముఖ్ దర్శకత్వం వహించగా, ది ఫాంటిసియా మ్యాన్ సంగీతం అందించారు.
తాజాగా మరో కొత్త వెబ్ సిరీస్ తో అభిమానుల ముందుకు రానున్నట్లు షణ్ముఖ్ ప్రకటించాడు. ‘స్టూడెంట్’ పేరుతో కొత్త సిరీస్ ను రూపొందిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. రాఘవ, శివ, చక్రి అనే మూడు కీలక పాత్రలతో ఈ సిరీస్ తెరకెక్కుతున్నట్లు తెలిపాడు. ఈ మూడు క్యారెక్టర్లు ట్రాఫిక్ సిగ్నల్స్ కు ప్రతీకగా ఉండబోతున్నట్లు వివరించాడు. అయితే, ఎప్పుడు విడుదల కాబోతోంది అనే విషయాన్ని మాత్రం షణ్ముఖ్ వివరించలేదు. త్వరలో పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
ఇక షణ్ముఖ్ జస్వంత్ 2012 లో యూట్యూబ్ చానల్ ను ప్రారంభించాడు. తర్వాత 2013 లో వచ్చిన ‘ది వైవా’ వీడియోలో కనిపించాడు. తర్వాత పలు యూట్యూబ్ వీడియోలు, కవర్ సాంగ్ లు చేసి తన యూట్యూబ్ చానెల్ లో అప్లోడ్ చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత యూట్యూబర్ దీప్తి సునయనతో కలిసి పలు షార్ట్ ఫిల్మ్ లు చేశాడు. వీరిద్దరి కాంబో కు మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత షణ్ముఖ్ కె.సుబ్బు దర్శకత్వం వహించిన ‘సాఫ్ట్ వేర్ డవలపర్స్’ వెబ్ సిరీస్ లో షన్ను పాత్రలో నటించాడు. ఈ వెబ్ సిరీస్ బాగా హిట్ అవ్వడంతో షణ్ముఖ్ బాగా పాపులర్ అయ్యాడు. ఈ వెబ్ సిరీస్ తర్వాత పలు మ్యూజిక్ వీడియోలు చేశాడు. తర్వాత ‘సూర్య’ వెబ్ సిరీస్ లో నటించాడు షణ్ముఖ్.
Also Read : ప్రెగ్నెంట్ ఇలియానా - బేబీ బంప్ ఫుల్ ఫొటోస్ వచ్చేశాయ్!
షణ్ముఖ్ తన యూట్యూబ్ కోస్టార్ దీప్తి సునయన తో ప్రేమాయణం సాగించాడు. ‘బిగ్ బాస్ 5’లో పాల్గొన్న తర్వాత వీరి ప్రేమకు బీటలు వారాయి. బిగ్ బాస్ హౌస్ లో సిరి హనుమంతు తో సన్నిహితంగా ఉంటూ వచ్చాడు షన్ను. ఆ తర్వాత షణ్ముఖ్, దీప్తి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఇద్దరు విడిపోయారు. ఒకటి రెండు సార్లు ప్రయివేట్ పార్టీలు, మీటింగ్ లలో కనిపించినా పలకరించుకోలేదు. ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి కెరీర్ను బిల్డ్ చేసుకొనే పనిలో వారు ఉన్నారు. దీప్తి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ.. అప్పుడప్పుడు చిన్న చిన్న సినిమాల్లో కనిపిస్తున్నది. షన్ను వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ బిజీగా మారాడు.
వివాదంలో ‘2018’ మూవీ - జూన్ 7 నుంచి థియేటర్స్ బంద్, ఎందుకంటే..
మహేష్ పార్టీకి, అఖిల్‌కు లింకేంటీ? ఆ హాట్ వెబ్ సీరిస్‌లో తమన్నా, మృణాల్ - ఇంకా ఎన్నో సినీ విశేషాలు!
Lust Stories 2 Teaser : పెళ్ళికి ముందు టెస్ట్ డ్రైవ్ చేయరా? హాట్ హాట్‌గా తమన్నా, మృణాల్ వెబ్ సిరీస్ టీజర్!
Telangana Tyagadhanulu Web Series : తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన త్యాగధనులు చరిత్రతో వెబ్ సిరీస్
Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?
YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!
WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?