Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Andhra : మాదిగల విషయంలో పవన్ వివక్ష చూపిస్తున్నారని మందకృష్ణ ఆరోపించారు. హోంమంత్రిపై పవన్ చేసిన వ్యాఖ్యల సందర్భంలో మందకృష్ణ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Mandakrishna accused Pawan of showing discrimination in the case of Madigala: పోలీసులు నేరస్తులను పట్టుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యంగా హోంమంత్రి అనితను ఉద్దేశించి ఆయన బాధ్యత తీసుకోవాలని ప్రకటించారు. ఈ అంశంపై దుమారం రేగుతోంది. వైసీపీ నేతలు పలు రకాలుగా స్పందించారు. తాజాగా ఈ అంశంపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేత మంద కృష్ణ మాదిగ స్పందించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన పవన్ కల్యాణ్ దళిత బిడ్డ అయిన హోంమంత్రి వంగలపూడి అనితను అవమానించారని మండిపడ్డారు.
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
ఏమైనా ఉంటే కేబినెట్‌లో మాట్లాడుకోవాలి కానీ బహిరంగంగా మాట్లాడతారా ?
ఏదైనా అంశం ఉంటే కేబినెట్‌లో చర్చించుకోవాలన్నారు. వంగలపూడి అనితపై అలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. అభిప్రాయం ఎలా ఉన్నా పబ్లిక్‌లో మాట్లాడటం సరి కాదన్నారు. హోంశాఖకు సంబందించిన అభ్యంతరాలు ఉంటే.. కేబినెట్‌లో చర్చించుకోవడమే ముఖ్యమన్నారు.ఇలా ప్రజల ముందు పెట్టి దళిత బిడ్డ అయిన వంగలపూడి అనితను అవమానించడం సరి కాదని మందకృష్ణ అన్నారు. ఈ విషయాన్ని తాము మనసులో పెట్టుకుంటామన్నారు. పవన్ కల్యాణ్ మాదిగలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. ఎన్నికల సమయంలో సామాజిక న్యాయం గురించి పవన్ మాట్లాడారని..అయితే ఆయన పార్టీ తరపున పోటీ చేసేందుకు అవకాశం వచ్చిన మూడు స్థానాల్లో ఒక్క చోట కూడా మాదిగ వర్గానికి చెందిన నేతకు అవకాశం ఇవ్వలేదన్నారు.
మూడు రిజర్వుడు సీట్లలో ఒక్కటి కూడా ఎందుకు మాదిగలకు ఇవ్వలేదు !
గోదావరి జిల్లాల్ల్లో రెండుచోట్ల పోటీకి అవకాశం వస్తే ఒకే వర్గానికి ఇచ్చారని మరి రాయలసీమలో రైల్వే కోడూరులో అయినా మాదిగవర్గానికి అవకాశం ఇవ్వాల్సి ఉందని కానీ పవన్ కల్యాణ్ అక్కడ కూడా మాల వర్గానికి చెందిన వారికే ఇచ్చారన్నారు. అక్కడ మాదిగలు గెలిచి మంత్రులు కూడా అయ్యారని గుర్తు చేశారు. జనసేన పాటించే సామాజిక న్యాయం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు.అందర్నీ సమానంగా చూడాలన్నారు. జనసేన తరపున ముగ్గురు మంత్రులు అయ్యారని అందులో రెండు సామాజికవర్గాలకు చెందిన వారే ఉన్నారన్నారు. రెండు పదవులు ఇతరులకు పోయినా ఒక్క పదవిని అయిన బడుగు బలహీనవర్గాలకు ఇవ్వాలి కదా అని ప్రశ్నించారు.
Also Read: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
ఒక్క మంత్రి పదవి అయినా ఇతర వర్గాలకు ఇవ్వాలి కదా !
జనసేన పార్టీ అన్ని వర్గాలను ఆదరిస్తేనే గెలిచిందని గుర్తు చేసుకున్నారు. ఒక ఎస్సీ,ఎస్టీ లేదా బీసీకి ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు. పవన్ వెనుక కష్టనష్టాల్లో ఉన్న బలహీనవర్గాల వారికి అవకాశం కల్పించాల్సి ఉందన్నారు. మందకృష్ణ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.