అన్వేషించండి

Nayanthara: రోడ్ సైడ్ ఐస్‌క్రీం తింటూ కనిపించిన స్టార్‌ హీరోయిన్‌ - అర్ధరాత్రి వీధుల్లో నయన్‌ సందడి, వీడియో వైరల్‌

Nayanthara: అర్ధరాత్రి రోడ్డు పక్కన ఐస్‌క్రీం తింటూ షాకిచ్చింది నయనతార. ప్రస్తుతం ఆమె వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ మారింది. నయన్‌ను ఇలా చూసి అంతా సర్‌ప్రైజ్‌ అవుతున్నారు.

Nayanthara Eat Ice Cream at Road Side: లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఆసక్తికర వీడియో షేర్‌ చేసింది. ఇందులో ఆమె రోడ్‌ సైడ్‌ నిలబడి ఐస్‌క్రీం తీంటూ కనిపించింది. దీంతో నయన్‌ ఇలా చూసి అంతా సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. కాగా ఇటీవల 'జవాన్‌' చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది నయన్‌. అలాగే అన్నపూర్ణి సినిమాతో మంచి రెస్పాన్స్‌ అందుకుంది. ఇక నెక్ట్స్‌ సినిమాలకు కాస్తా గ్యాప్‌ తీసుకున్న నయన్‌ ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. ఇంట్లో తన ఇద్దరు కవల కుమారులతో కలిసి టైం స్పెండ్‌ చేస్తుంది. వారితో సరదగా ఆడుకుంటూ, అల్లరి చేస్తున్న వీడియోలను షేర్‌ చేస్తూ మురిసిపోతుంది. అంతకుముందు అసలు సోషల్‌ మీడియాలో కనిపించని ఆమె ఈ మధ్య ఫుల్‌ యాక్టివ్‌ అయ్యింది.

అర్ధరాత్రి రోడ్డు పక్కన నయన్

తరచూ తన కుమారుల ఫోటోలు షేర్‌ చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా నయన్‌ తన ఎక్స్‌పోస్ట్‌లో ఆసక్తికర వీడియోను పంచుకుంది. సాధారణ వ్యక్తిలా అర్థరాత్రి రోడ్డు పక్కన ఐస్‌క్రీం తింటుంది. అయితే ఇందులో నయన్‌తో పాటు ఒక అమ్మాయి, అబ్బాయి కూడా ఉన్నారు. అయితే వారు నయన్‌ బంధువుల్లా ఉన్నారు. ఈ వీడియోలో వారు నయన్‌ను ఏడిపిస్తూ కనిపించారు. వీడియో ప్రారంభంలో నయనతారతో ఉన్న ఇద్దరు ఐస్‌క్రీం తింటూ ఈ మాల్‌పై ఉన్న నయనతార హోడింగ్‌ చూస్తారు. తన గురించి మాట్లాడుకుంటుండగా.. సడెన్‌గా వెనక్కి తిరిగి.. హే.. మేడం అంటూ సర్‌ప్రైజ్‌ అవుతారు. కానీ నయన్ ఎలాంటి రియాక్షన్‌ ఇవ్వకుండ ముసిముసిగా నవ్వుతూ ఐస్‌క్రీం తింటుంది.

ఫన్నీగా సాగిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. దీంతో ఆమె వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా నయనతార సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె తమిళంలో రెండు సినిమాలకు కమిట్‌ అయినట్టు సమాచారం. ఇటీవల బాలీవుడ్‌తో జవాన్‌ ఎంట్రీ ఇచ్చిన నయనతార ఆ తర్వాత హీరోయిన్‌గా ఫుల్‌ బిజీ అయిపోతుందనుకున్నారు. సౌత్‌లోనే హిందీలో బ్యాక్‌ టూ బ్యాక్‌ ఆఫర్స్‌తో దూసుకుపోతుందని అంతా అంచన వేశారు. కానీ, నయన్‌ చూస్తుంటే అలాంటిదేం కనిపించడం లేదు. ప్రస్తుతం ఆమె ప్రోఫెషనల్‌ లైఫ్‌ కంటే పర్సనల్‌ లైఫ్‌పైనే ఎక్కువ ఫోకస్‌ పెడుతున్నట్టు అనిపిస్తుంది.

పిల్లలను చూసుకుంటు తల్లిగా తన బాధ్యతను నిర్వర్తిస్తుంది. పెద్దగా సినిమాలు చేయకుండ ఒకటిరెండు ప్రాజెక్ట్స్‌ ఒకే చేసి ఫ్రీ టైం ఉండేలా చూసుకుంటున్నట్టు కనిపిస్తుంది నయన్‌ వ్యవహరం చూస్తుంటే. ఇదిలా ఉంటే రీసెంట్‌ నయతార భర్తతో విడిపోతుందంటూ ఒక్కసారిగా రూమర్‌ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తన భర్త విఘ్నేశ్‌ శివన్‌కు ఇన్‌స్టాగ్రామ్‌ అన్‌ఫాలో చేసి షాకిచ్చింది. ఈ విషయం బయటకు వచ్చి వైరల్‌ కాగానే మళ్లీ ఫాలో చేసింది. దీంతో కావాలని నయనతార ఇలా చేసిందని, అందరికి ఓ ఝలక్‌ ఇచ్చిందన్నారు. కానీ, నయన్‌ అలా చేయడంతో నయనతార-విఘ్నేశ్‌ శివన్‌ విడాకులు అంటూ వార్త ఒక్కసారిగా గుప్పుమంది. ఆ తర్వాత ఇది నిజం కాదని తేలిపోయింది. 

Also Read: మోడలింగ్‌ నుంచి పాన్ ఇండియా రేంజ్ వరకు - రష్మిక గురించి ఈ విషయాలు తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kommineni Srinivasarao: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు, మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల వివాదం కేసు
Kommineni Srinivasarao: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు, మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల వివాదం కేసు
Vakiti Srihari Political career: తెలంగాణ కేబినెట్‌లో సంచలనం, సర్పంచ్ నుంచి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన వాకిటి శ్రీహరి
తెలంగాణ కేబినెట్‌లో సంచలనం, కలిసొచ్చిన సామాజిక సమీకరణాలు- సర్పంచ్ నుంచి రాష్ట్ర మంత్రిగా..
Pawan Kalyan Trolls: పవన్ కళ్యాణ్ పై భారీ ఎత్తున ట్రోలింగ్ చేస్తున్న వైసీపీ- మేం చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్పా అంటూ పోస్టులు
పవన్ కళ్యాణ్ పై భారీ ఎత్తున ట్రోలింగ్ చేస్తున్న వైసీపీ- మేం చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్పా అంటూ పోస్టులు
Chiyaan Vikram: మహేష్ బాబు - రాజమౌళి సినిమాకు 'నో' చెప్పిన విక్రమ్ - SSMB29 ఆఫర్ రిజెక్ట్ చేయడానికి రీజన్ అదేనా?
మహేష్ బాబు - రాజమౌళి సినిమాకు 'నో' చెప్పిన విక్రమ్ - SSMB29 ఆఫర్ రిజెక్ట్ చేయడానికి రీజన్ అదేనా?
Advertisement

వీడియోలు

Akhil Akkineni, Zainab Ravdjee Reception | అఖిల్ జైనాబ్ రిసెప్షన్ లో స్టార్స్ సందడిFrench Open 2025 | ఫ్రెంచ్ ఓపెన్ విజేత కార్లోస్ అల్కరాస్Akhil Akkineni Zainab Grand Reception | గ్రాండ్ గా అఖిల్ అక్కినేని, జైనాబ్ రిసెప్షన్ | ABP DesamAkhanda 2 vs OG Clash | దసరా బరిలో తలపడుతున్న బాలయ్య, పవన్ కళ్యాణ్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kommineni Srinivasarao: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు, మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల వివాదం కేసు
Kommineni Srinivasarao: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు, మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల వివాదం కేసు
Vakiti Srihari Political career: తెలంగాణ కేబినెట్‌లో సంచలనం, సర్పంచ్ నుంచి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన వాకిటి శ్రీహరి
తెలంగాణ కేబినెట్‌లో సంచలనం, కలిసొచ్చిన సామాజిక సమీకరణాలు- సర్పంచ్ నుంచి రాష్ట్ర మంత్రిగా..
Pawan Kalyan Trolls: పవన్ కళ్యాణ్ పై భారీ ఎత్తున ట్రోలింగ్ చేస్తున్న వైసీపీ- మేం చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్పా అంటూ పోస్టులు
పవన్ కళ్యాణ్ పై భారీ ఎత్తున ట్రోలింగ్ చేస్తున్న వైసీపీ- మేం చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్పా అంటూ పోస్టులు
Chiyaan Vikram: మహేష్ బాబు - రాజమౌళి సినిమాకు 'నో' చెప్పిన విక్రమ్ - SSMB29 ఆఫర్ రిజెక్ట్ చేయడానికి రీజన్ అదేనా?
మహేష్ బాబు - రాజమౌళి సినిమాకు 'నో' చెప్పిన విక్రమ్ - SSMB29 ఆఫర్ రిజెక్ట్ చేయడానికి రీజన్ అదేనా?
Akhil Zainab Reception: అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్: అక్కినేని ఫ్యామిలీ ఫోటోలో జైనాబ్ మిస్సింగ్... ఆ ఒక్కటీ గమనించారా?
అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్: అక్కినేని ఫ్యామిలీ ఫోటోలో జైనాబ్ మిస్సింగ్... ఆ ఒక్కటీ గమనించారా?
Crime News: హనీమూన్‌లో విషాదం, సుపారీ ఇచ్చి మరీ భర్తను హత్య చేపించిన భార్య - DGP సంచలన ప్రకటన
హనీమూన్‌లో విషాదం, సుపారీ ఇచ్చి మరీ భర్తను హత్య చేపించిన భార్య - DGP సంచలన ప్రకటన
OTT Releases This Week: వీరమల్లు వాయిదాతో థియేటర్లు వెలవెల... ఓటీటీల్లో ఈ వారం విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏవో తెలుసా?
వీరమల్లు వాయిదాతో థియేటర్లు వెలవెల... ఓటీటీల్లో ఈ వారం విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏవో తెలుసా?
Earthquake in Prakasam: ప్రకాశం జిల్లాలో అర్ధరాత్రి భూకంపం, భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
ప్రకాశం జిల్లాలో అర్ధరాత్రి భూకంపం, భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
Embed widget