Nayanthara: నయనతార ఆస్తుల విలువ అన్ని కోట్లా? కార్లు, ప్రైవెట్ జెట్‌తో పాటు మరెన్నో!
ఇండియాలో కొందరు నటీనటులకు ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి. ఆ లిస్ట్‌లో నయనతార పేరు కూడా ఉంటుంది.
సినీ పరిశ్రమలోని కొందరు స్టార్ హీరోహీరోయిన్ల ఆస్తుల వివరాలు చూస్తుంటే ప్రేక్షకుల మతిపోవాల్సిందే.. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో స్థిరపడి ఇప్పటికీ రాణిస్తున్న హీరోలు, హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. మామూలుగా వారి రెమ్యునరేషన్ గురించి వివరాలు అప్పుడప్పుడూ బయటికొచ్చినా ఆస్తుల వివరాలు మాత్రం ఎక్కువగా బయటికి రావు. ఇక తాజాగా ‘జవాన్’లో నటించి హిందీలో బ్లాక్‌బస్టర్ డెబ్యూ ఇచ్చిన నయనతార ఆస్తుల గురించి బాలీవుడ్ ఆరాతీయడం మొదలుపెట్టింది. అందులో భాగంగానే అసలు తన ఆస్తులు ఎంత, తన దగ్గర ఉన్న లగ్జరీ వస్తువులు ఏంటి అనే వివరాలు బయటికొచ్చాయి.
రూ.100 కోట్లు విలువ చేసే ఇల్లు..
‘జవాన్’.. తన మొదటి హిందీ చిత్రమే అయినా.. సౌత్‌లో ఇప్పటికే లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది నయనతార. అందుకే ఆ మూవీ కోసం రూ.10 కోట్ల రెమ్యునరేషన్ ఛార్జ్ చేసినట్టు సమాచారం. ఇలా భారీ రెమ్యునరేషన్ అందుకుంటోంది కాబట్టే నయన్ పూర్తి ఆస్తుల విలువ రూ.183 కోట్లని తెలుస్తోంది. నయన్ కట్టుకున్న అందమైన ఇళ్లులు, కార్లు, ప్రైవేట్ జెట్, బ్రాండ్స్.. ఇవన్నీ కలిపి తన ఆస్తులు దాదాపుగా రూ.183 కోట్లు ఉంటాయని సమాచారం. నయనతారకు కేవలం తన సొంత రాష్ట్రంలోనే కాకుండా హైదరాబాద్, చెన్నై, కేరళ లాంటి రాష్ట్రాల్లో కూడా ప్రాపర్టీలు ఉన్నాయి. కేరళలో నయన్‌కు తరతరాలుగా వస్తున్న ఇల్లు ఉంది. అది కాకుండా హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో రూ.30 కోట్లు విలువ చేసే రెండు ప్రాపర్టీలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం చెన్నైలో తను ఉంటున్న ఇల్లు దాదాపు రూ.100 కోట్ల విలువ ఉంటుందని సమాచారం.
ప్రైవేట్ జెట్ ఉన్న హీరోయిన్..
ఇండియాలో కొందరు నటీనటులకు ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి. ఆ లిస్ట్‌లో నయనతార పేరు కూడా ఉంటుంది. సౌత్‌లోని దాదాపు అన్ని భాషల్లో నటిస్తూ బిజీగా ఉండే ఈ భామ.. తన బిజీ షెడ్యూల్స్‌ను కవర్ చేయడానికి కొన్నేళ్ల క్రితమే ఈ ప్రైవేట్ జెట్‌ను ఖరీదు చేసింది. సినిమాల్లో బిజీగా ఉన్నా బ్రాండ్స్ ఎండోర్స్‌మెంట్స్ విషయంలో కూడా నయనతార ఎప్పుడూ ముందుంటుంది. ప్రస్తుతం తన చేతిలో టాటా స్కై, కే బ్యూటీ, తనిష్క్.. లాంటి బ్రాండ్స్ ఎండోర్స్‌మెంట్స్ ఉన్నాయి. నయనతార.. ఒక బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి దాదాపు రూ.5 కోట్లు తీసుకుంటుందని సమాచారం. తను ఇతర బ్రాండ్స్‌ను ప్రమోట్ చేయడం మాత్రమే కాదు.. నయన్‌కే సొంతంగా ఒక బ్రాండ్ కూడా ఉంది. అదే ‘ది లిప్ బామ్ కంపెనీ’. 2019లో డాక్టర్ రెనీటా రంజన్‌తో కలిసి నయనతార ఈ బిజినెస్‌ను ప్రారంభించింది.
లగ్జరీ కార్లు కూడా..
‘ది లిప్ బామ్ కంపెనీ’తో పాటు నయనతార.. ‘ఛాయ్ వాలె’ అనే మరో కంపెనీలో కూడా పెట్టుబడులు పెట్టింది. దీంతో పాటు యూఏఈకి చెందిన ఒక ఆయిల్ బిజినెస్‌లో కూడా తను రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు సమాచారం. ఇక హీరోయిన్‌గా స్టార్‌డమ్ సంపాదించుకున్న తర్వాత దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుంది నయన్. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి రౌడీ పిక్చర్స్ అనే సొంత ప్రొడక్షన్ హౌజ్‌ను ప్రారంభించారు. ఇప్పటికే తన ప్రొడక్షన్ హౌజ్ నుండి పలు చిత్రాలు బయటికి వచ్చాయి. ఇవి మాత్రమే కాకుండా నయన్ దగ్గర పలు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. రూ.74.50 లక్షలు విలువ చేసే బీఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్, రూ.88 లక్షలు విలువ చేసే మెర్సిడీజ్ జీఎల్‌ఎస్ 350డీ, రూ.1.76 కోట్లు విలువ చేసే బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్.. ఇవన్నీ నయన్ సొంతం.
Also Read: అరె ఏంట్రా ఇది - ‘జవాన్’ ప్రేక్షకులకు ఊహించని షాక్, గంటన్నరలో సినిమా ఫినిష్? ఇంతకీ ఏమైంది?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial