Nayanthara : నయనతారకు ఆహ్వానం పలికిన 'డియర్ స్టూడెంట్స్' టీమ్ - మలయాళ హీరోతో జతకట్టిన లేడీ సూపర్ స్టార్!
Nayanthara: మలయాళ హీరో నివిన్ పౌలి కథానాయకుడిగా 'డియర్ స్టూడెంట్స్' అనే సినిమా తెరకెక్కుతోంది. తాజాగా మూవీ టీమ్ నయనతారను ఆహ్వానిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది.
Nayanthara joins the cast of Nivin Pauly Dear Students: సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తోంది. గత ఏడాది 'జవాన్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి భారీ సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ సైతం చేస్తుంది. ఇక తాజాగా ఈ బ్యూటీ ఓ మలయాళ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేస్తోంది. మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలి కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమాలో నయనతార ప్రధాన పాత్ర పోషిస్తుంది. తాజాగా మూవీ టీం నయనతారని ఆహ్వానిస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశారు.
'డియర్ స్టూడెంట్స్' టీమ్ లో జాయిన్ అయిన నయనతార
'ప్రేమమ్' మూవీతో మలయాళం లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నివీన్ పౌలి కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'డియర్ స్టూడెంట్స్'. జార్జ్ ఫిలిప్ రాయి, సందీప్ కుమార్ రచన, దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నివిన్ పౌలి సొంత నిర్మాణ సంస్థ పౌలీ జె ఆర్ పిక్చర్స్, కర్మ మీడియా నెట్ వర్క్ ఎల్.ఎల్.పి, రౌడీ పిక్చర్స్, ఆల్ట్రా తో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా 'డియర్ స్టూడెంట్స్' టీం తో నయనతార జాయిన్ అయింది. ఈ సందర్భంగా నయనతార కి స్వాగతం పలుకుతూ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోని షేర్ చేయగా.. అది నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియోలో కాలేజ్, క్లాస్ రూమ్ ని చూపించారు. వీడియో చివర్లో నయనతార చేతిలో పెన్ పట్టుకుని కనిపించింది.
We are super excited to welcome Superstar @NayantharaU on board "Dear Students" rolling soon🎥🎬@NivinPaulyActor @UltraBollywood @UltraSushil #RajatAgarwal #NitinKumar @PaulyJrPictures #Newmovie #Nayanthara #ComingSoon pic.twitter.com/75O3Z25826
— Karma Media And Entertainment (@KarmaMediaEnt) April 14, 2024
నయనతార పాత్ర అదేనా?
తాజాగా రిలీజ్ చేసిన వీడియోని బట్టి చూస్తే 'డియర్ స్టూడెంట్స్' మూవీలో నయనతార టీచర్ రోల్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. వీడియోలో కాలేజీ, క్లాస్ రూమ్ చూపించారంటే సినిమా అంతా కాలేజ్ లైఫ్ చుట్టూనే తిరుగుతుందని, ఇందులో నివీన్ పౌలీ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కాన్సెప్ట్ తో మలయాళం లో ఇప్పటికే 'ప్రేమమ్' అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. అందులోనూ నివిన్ పౌలి కాలేజ్ స్టూడెంట్‌గా నటించి మెప్పించాడు. టీచర్ గా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించింది. ఇప్పుడు 'డియర్ స్టూడెంట్స్' లో నయనతార సైతం టీచర్ రోల్ చేస్తున్నట్టు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. రీసెంట్ గానే సెట్స్ పైకి వచ్చిన ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు, నటీనటుల వివరాలను మూవీ టీం త్వరలోనే వెల్లడించనుంది.
కోట్లలో రెమ్యునరేషన్
నయనతార ప్రస్తుతం సౌత్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం.. నయనతార తమిళ్, తెలుగు, మలయాళం సినిమాలకి రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుంది. గత ఏడాది షారుక్ ఖాన్ సరసన 'జవాన్' సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా కోసం ఏకంగా రూ.10 కోట్ల రెమ్యునరేషన్ అందుకుందని టాక్. అంతేకాదు ప్రస్తుతం సౌత్ ఇండియన్ రిచెస్ట్ హీరోయిన్స్ లో నయనతార ముందు వరుసలో ఉండటం విశేషం.
Also Read : 'సైరా' వల్ల భారీగానే నష్టపోయాం - ఆ సినిమాకి గొప్ప పేరొచ్చింది, కానీ డబ్బులు రాలేదు : చిరంజీవి